ప‌న్ను చెల్లింపుదార్ల‌కు పాన్ ఎందుకు?

మ‌దింపుదారుడికి సంబంధించిన అన్ని లావాదేవీలను గుర్తించడానికి పాన్ అనుమతిస్తుంది

ప‌న్ను చెల్లింపుదార్ల‌కు పాన్ ఎందుకు?

మీరు పాన్ ను తరచుగా ఉపయోగిస్తుంటారు, కాని ఇది పన్ను శాఖ ఎందుకు జారీ చేస్తుందో మీకు తెలుసా? సంపాదించిన ఆదాయం, పన్ను మినహాయింపు, చెల్లించిన పన్ను, రాబడి, ఇతర లావాదేవీలతో సహా పన్ను మదింపుదారు అన్ని లావాదేవీలను గుర్తించడానికి పాన్ ఆదాయ‌ విభాగాన్ని అనుమతిస్తుంది.

ఆర్థిక సంవత్సరంలో సంపాదించిన ఆదాయం పన్ను పరిధిలోకి వస్తే వ్యక్తులు పాన్ పొందడం తప్పనిసరి. మీరు 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తి అయితే, రూ. 2.5 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది; సీనియర్ సిటిజన్లకు (60 ఏళ్లు పైబడినవారు), రూ. 3 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే ఆదాయ పన్ను వ‌ర్తిస్తుంది. సూప‌ర్‌ సీనియర్ సిటిజన్లకు (80 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి) రూ. 5 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఆదాయానికి పన్ను ప‌డుతుంది.

పాన్ భారతదేశం అంతటా, మదింపుదారుడి జీవితకాలం చెల్లుతుంది. మదింపుదారుడి చిరునామా లేదా మదింపు అధికారి మారినప్పటికీ పాన్ గుర్తింపు మారదు. పాన్ కోసం దరఖాస్తు చేసేటప్పుడు అందించిన వివరాలలో ఏదైనా మార్పు చేయాల‌నుకుంటే పన్ను విభాగానికి “Request For New PAN Card Or/And Changes or Correction in PAN Data" అనే ఫారం ద్వారా తెలియజేయాలి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly