ఇక‌పై ప్ర‌భుత్వ ఉద్యోగులు న‌చ్చిన ఫండ్ మేనేజ‌ర్‌ను ఎంచుకోవ‌చ్చు

నిబంధ‌న‌లకు అనుగుణంగా ఇక‌పై ప్ర‌భుత్వ ఉద్యోగులు కూడా ఎన్‌పీఎస్‌లో పెట్టుబ‌డుల‌ కేటాయింపుల‌ను నిర్ణ‌యించుకోవ‌చ్చు

ఇక‌పై  ప్ర‌భుత్వ ఉద్యోగులు న‌చ్చిన ఫండ్ మేనేజ‌ర్‌ను ఎంచుకోవ‌చ్చు

పెన్ష‌న్ ఫండ్ నియంత్ర‌ణ సంస్థ పీఎఫ్ఆర్‌డీఏ ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు ఎన్‌పీఎస్‌ పెట్టుబ‌డుల విష‌యంలో మ‌రింత సౌక‌ర్యాన్ని పెంచింది. జ‌న‌వ‌రి 31, 2019 న ఇచ్చిన నోటిఫికేష‌న్‌లో కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగులు ఎన్‌పీఎస్ నిర్వ‌హించే 8 ఎనిమిది ఫండ్ మేనేజ‌ర్లలో స్వ‌యంగా పెన్ష‌న్ ఫండ్ మేనేజ‌ర్‌ను ఎంచుకునే అవ‌కాశం క‌ల్పించింది. అదేవిధంగా ఎంత‌మేర‌కు ఎందులో పెట్టుబ‌డులు పెట్టాల‌నుకుంటున్నారో ప‌రిమితుల ప్ర‌కారం ఎంచుకోవ‌చ్చు. ఇప్ప‌టివ‌ర‌కు ఉద్యోగుల‌ ఫండ్ల నిర్వ‌హ‌ణ ఈ ఎనిమిది ఫండ్ మేనేజ‌ర్లు మ‌త్ర‌మే చూసుకునేవి. అయితే భ‌విష్య‌త్తులో మొత్తం నిధుల్ని ఇత‌ర ఫండ్ మేనేజ‌ర్ల‌కు మ‌రలించే అవ‌కాశాలున్నట్లు సంకేతాలు క‌నిపిస్తున్నాయి. పీఎఫ్ఆర్‌డీఏ ఎన్‌పీఎప్‌లో రెండు మార్పుల‌ను చేసింది.

ఫండ్ మేనేజ‌ర్ ఎంపిక‌:

ఎనిమిది ఫండ్ మేనేజ‌ర్ల‌లో ఏదైనా ఎంచుకునే అవ‌కాశాన్ని ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు ఇచ్చింది. ఇప్ప‌టివ‌ర‌కు ప్రైవేటు రంగ ఉద్యోగులు మాత్ర‌మే ఎనిమిది ఫండ్ మేనేజ‌ర్ల‌లో ఎంచుకునే అవ‌కాశం ఉండేది. ప్ర‌భుత్వ చందాదారుల‌కు ఎల్ఐసీ పెన్ష‌న్ లిమిటెడ్, ఎస్‌బీఐ పెన్ష‌న్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌, యూటీఐ రిటైర్‌మెంట్ సొల్యూష‌న్ లిమిటెడ్ వంటి సంస్థ‌లు డిపాల్ట్‌గా ప‌నిచేసేవి. ఎన్‌పీఎస్ మొత్తం నిధి రూ.2.8 ల‌క్ష‌ల కోట్ల‌లో నుంచి 3 శాతాన్నిమాత్ర‌మే 5 ప్రైవేటు రంగ సంస్థ‌లు నిర్వ‌హిస్తాయి.

ఆస్తుల కేటాయింపు:

పీఎఫ్ఆర్‌డీఏ నోటిఫికేష‌న్ లో ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు ఇచ్చి న మ‌రో సౌక‌ర్యం ఏంటంటే నాలుగు ర‌కాల కేట‌గిరీల్లో ఎంచుకునే అవ‌కాశం ఉంది.
ఎ. ప్ర‌స్తుతం ఉన్న ఆస్తుల కేటాయింపు (ఈక్విటీ 15 శాతంతో), బి. 100 శాతం ప్ర‌భుత్వ బాండ్ల‌లో సి. క‌న్జ‌ర్వేటివ్ లైఫ్ సైకిలో ఫండ్- ఈక్విటీ కేటాయింపు 25 శాతానికి ప‌రిమితం, డి. మోడ‌రేట్ లైఫ్ సైకిల్ ఫండ్దీం- ఈక్విటీ 50 శాతం. దీంతో ప్ర‌భుత్వ చందాదారులు ఇప్పుడు ఈక్విటీని మ‌రింత పెంచుకోవ‌చ్చు. ఇంత‌కుముందు కేవ‌లం 15 శాతం దాంట్లో మాత్ర‌మే పెట్టేందుకు వీలుండేది.

ప్ర‌భుత్వ ఉద్యోగులు లైఫ్ సైకిల్ ఫండ్‌ను ఎంచుకొని ఈక్విటీల్లో పెట్టుబ‌డులు పెంచుకోవ‌డం మంచిద‌ని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ప్ర‌భుత్వ ఉద్యోగులు కేవ‌లం ఈక్విటీ నుంచి లైప్‌సైకిల్ ఫండ్ల‌ను ఎంచుకునేందుకు వీలుంది. 2004 లో ఉద్యోగంలో చేరిన‌వారు ఇప్పుడు దాదాపు గా 45 ఏళ్లు ఉంటారు. వారు ఇప్పుడు క‌చ్చితంగా ఈక్విటీల‌ను పెంచుకునేందుకు ఇప్పుడు అవ‌కాశం ఉంటుంది కాబ‌ట్టి ఈక్విటీ పెట్టుబ‌డుల‌కు ప్రాధాన్య‌మివ్వాల‌ని సూచిస్తున్నారు.

ప్ర‌వేటు ఉద్యోగులు సీ లేదా డీ ఆప్ష‌న్ ఎంచుకోవ‌చ్చు లేదా 75 శాతం ఈక్విటీల‌కు అవ‌కాశం ఉండే లైఫ్ సైకిల్ ఫండ్‌తో పెట్టుబ‌డుల‌ను పెట్ట‌వ‌చ్చు. అదేవిధంగా ప్ర‌త్యామ్నాయంగా యాక్టివ్ చాయిస్ ఆప్ష‌న్ ఎంచుకొని పెట్టుబ‌డుల‌ను ఈక్విటీలు, కార్పొరేట్ బాండ్లు, ప్ర‌భుత్వ బాండ్ల‌లో కేటాయించ‌వ‌చ్చు. యాక్టివ్ చాయిస్‌లో 50 ఏళ్ల కంటే త‌క్కువ వ‌య‌సు ఉన్న‌వారికి ఈక్విటీ 75 శాతం వ‌ర‌కు ఉంటుంది. అదే 50 ఏళ్ల‌కంటే ఎక్కువ ఉన్న‌వారు ఈక్విటీల‌ను త‌గ్గించుకుంటూ రావాలి.

ఎలా ఎంచుకోవాలి?
పెన్ష‌న్ ఫండ్ మేనేజ‌ర్‌ను ఎంచుకునేట‌ప్పుడు ముందుగా ఒకే మేనేజ‌ర్ ఈక్విటీ, కార్పొరేట్ బాండ్, ప్ర‌భుత్వ బాండ్, ఇత‌ర పెట్టుబ‌డుల‌ను కూడా నిర్వ‌హించేలా ఉండాలి. ఇది మ్యూచువ‌ల్ ఫండ్ల‌తో పోలిస్తే కాస్త బిన్నంగా ఉంటుంది. అక్క‌డ ఈక్విటీల‌ను, డేట్ ఫండ్ల‌ను వేర్వేరుగా నిర్వ‌హిస్తారు.

మ‌రి పెన్ష‌న్ ఫండ్ మేనేజ‌ర్‌ను ఎలా ఎంచుకోవాలి అంటే ఎన్‌పీఎస్ వెబ్‌సైట్‌కి వెళ్లి వేర్వేరు స‌మ‌యాల్లో వివిధ ఫండ్ మేనేజ‌ర్ల ఇంత‌కు ముందు ప‌నితీరు రాబ‌డిని ప‌రిశీలించాలి. మీరు ఎంత దేనికి కేటాయించాల‌నుకుంటున్నారో నిర్ణ‌యించుకొని గ‌తంలో దాని పరిస్థితిని కూడా గ‌మ‌నించాలి. రిస్క్ గురించి బ‌య‌ప‌డ‌కుండా నిర్ణ‌యం తీసుకునేవారైతే టైర్‌-1 ఖాతాల్లో హెచ్‌డీఎఫ్‌సీ పెన్షన్ ఫండ్ ఎంచుకోవ‌డం మంచిది. అయితే గ‌తేడాది దీంతో పోలిస్తే ఎస్‌బీఐ పెన్ష‌న్ ఫండ్ మంచి పనితీరును క‌న‌బ‌రిచింది. సాంప్ర‌దాయ పెట్టుబ‌డుల కోసం అయితే ఎల్ఐసీ పెన్ష‌న్ ఫండ్ ముందు స్థానంలో ఉంటుంది.

అయితే ఫండ్ మేనేజ‌ర్ల గ‌తంలో ప‌నితీరు ఒక‌దానితో ఒక‌టి పోలిస్తే పెద్ద‌గా తేడా ఏమి ఉండ‌క‌పోవ‌చ్చు. ర్యాంకులు ఎప్ప‌టిక‌ప్పుడు మారుతుంటాయి. ఫండ్ మేనేజ‌ర్‌ను ఎంచుకునేట‌ప్పుడు ట్రాక్ రికార్డ్ అనేది చాలా ముఖ్యం. మ్యూచువ‌ల్ ఫండ్లు, బ్యాంకింగ్ వంటి ఇత‌ర‌ర వాటితో పోల్చి చూసుకోవాలి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly