పీఎఫ్ఆర్‌డీఏ ఏకైక పెన్ష‌న్‌ నియంత్ర‌ణ సంస్థ!

ఈ ప్రతిపాదనను ఇతర మంత్రిత్వ శాఖలకు పంపారు, దీనికి కేబినెట్ అనుమతి పొందాల్సి ఉంటుంది

పీఎఫ్ఆర్‌డీఏ ఏకైక పెన్ష‌న్‌ నియంత్ర‌ణ సంస్థ!

అన్ని పెన్ష‌న్ ప‌థ‌కాల‌ను పీఎఫ్ఆర్‌డీఏ నియంత్ర‌ణ‌లోకి తెచ్చేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. పిఎఫ్‌ఆర్‌డీఏ చట్టం సవరణకు ఆర్థిక మంత్రిత్వ శాఖ నుండి సూత్రప్రాయంగా ఆమోదం లభించింది, ఇది పెన్షన్ ప‌థ‌కాల‌కు ఏకైక నియంత్ర‌ణ సంస్థ‌గా ప‌నిచేస్తుంది.

ఈ ప్ర‌తిపాద‌న‌ను ఇత‌ర మంత్రిత్వ శాఖ‌ల‌కు బ‌దిలీ చేశారు, ఆ త‌ర్వాత కేబినెట్ ఆమోదం పొందాల్సి ఉంటుంది. కొన్ని నెల‌ల్లో పూర్తి ఆమోదం పొందే అవ‌కాశం ఉంది. ప్ర‌స్తుతం పీఎఫ్ఆర్‌డీఐ నియంత్ర‌ణ‌లో కొన్ని పెన్ష‌న్ ప‌థ‌కాలు మాత్ర‌మే ఉన్నాయి. అయితే ఈ సంస్థ నియంత్ర‌ణ‌లో లేని ఉత్ప‌త్తుల‌తో వినియోదారులు గంద‌ర‌గోళానికి గుర‌వుతున్నార‌ని భావిస్తోంది.

2003 లో స్థాపించిన పీఎఫ్ఆర్‌డీఏ నియంత్ర‌ణ‌లో ఉన్న ప‌థ‌కాల‌ రాబ‌డి సంవత్సరానికి దాదాపు 9.5 శాతం నుంచి 11.3 శాతంగా ఉంది. భారతదేశంలోని వివిధ పెన్షన్ ఫండ్స్ మొత్తం రూ.25 ట్రిలియన్ ( 351.62 బిలియన్ డాల‌ర్లు). కాగా, పీఎఫ్ఆర్‌డీఏ నిర్వ‌హ‌ణ‌లో ఇప్పుడు రూ. 4 ట్రిలియ‌న్లు మాత్రమే ఉన్నాయి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly