పీఎన్‌బీ మెట్‌లైఫ్ ఎండోమెంట్ సేవింగ్స్ ప్లాన్ ప్ల‌స్ తీసుకోవ‌చ్చా?

పీఎన్‌బీ మెట్‌లైఫ్ ఎండోమెంట్ సేవింగ్స్ ప్లాన్ ప్ల‌స్ ప్రీమియం, రాబ‌డి వివ‌రాల‌ను తెలుసుకుందాం

పీఎన్‌బీ మెట్‌లైఫ్ ఎండోమెంట్ సేవింగ్స్ ప్లాన్ ప్ల‌స్ తీసుకోవ‌చ్చా?

బీమా పాల‌సీలు 10-11 శాతం రాబ‌డినిస్తాయంటే అంత సులువుగా ఎలా న‌మ్ముతారో అర్థం కాని విష‌యం. ఎందుకంటే ప‌న్ను వ‌ర్తించ‌ని ఇలాంటి డెట్ ప‌థ‌కాల‌పై 10-11 శాతం రాబ‌డి ఎప్పుడు రాద‌న్న విష‌యం గుర్తుంచుకోండి. సాంప్ర‌దాయం బీమా ప‌థ‌కాలు మార్కెట్ల‌లో డెట్ ప‌థ‌కాల వంటివే.

పీఎన్‌బీ మెట్‌లైఫ్ ఎండోమెంట్ సేవింగ్స్ గూరించి పూర్తి విశ్లేష‌ణ ద్వారా తెలుసుకుందాం. ర‌మేష్ అనే వ్య‌క్తి ఐదేళ్ల కాలానికి రూ.70 వేలు వార్షిక‌ ప్రీమియం చెల్లించాల్సి ఉంది. ఐదేళ్ల ప్రీమియం చెల్లించిన త‌ర్వాత రూ.4,83,000 వ‌స్తాయి లేదా బీమా పాల‌సీపై 11 శాతం రాబ‌డి వ‌స్తుంది. పాల‌సీ ట‌ర్మ్ ముగిసే స‌మ‌యానికి రూ.35 వేలు బోన‌స్‌గా కంపెనీ ఇస్తుంది. మెచ్యూరిటీ స‌మ‌యంలో పూర్తిగా చెల్లించే మొత్తం రూ.5,18,000 . బోన‌స్ మెచ్యూరిటీ స‌మ‌యంలో ఇస్తే దాంతో క‌లిపి రాబ‌డి 13.4 శాతం అవుతుంది.

ఈ పాల‌సీ గురించి వివ‌రంగా ప‌రిశీలిస్తే…
మొద‌టి సంద‌ర్భంలో ప్రీమియం పేమెంట్ ట‌ర్మ్‌, పాల‌సీ కాల‌ప‌రిమితి 5 సంవ‌త్స‌రాలు అయితే రాబ‌డి 13.4 శాతం అవుతుంది. ప్రీమియం పేమెంట్ ట‌ర్మ్ అంటే ప్రీమియం చెల్లించే కాలం, పాల‌సీ కాల‌ప‌రిమితి ముగిసే కాలం. దీని త‌ర్వాత మెచ్యూరిటీ మొత్తం చెల్లిస్తారు.

రెండో సంద‌ర్భంలో ప్రీమియం చెల్లింపు కాలం 5 సంవ‌త్స‌రాలు, పాల‌సీ కాల‌ప‌రిమితి 10 సంవ‌త్స‌రాలు, అప్పుడు రాబ‌డి 5 శాతం అవుతుంది. ఐదేళ్ల కాలానికి ప్రీమియం రూ.3,50,000 చెల్లిస్తే, ప‌దేళ్ల మెచ్యూరిటీ త‌ర్వాత రూ.5,18,000 ల‌భిస్తుంది. అంటే రాబ‌డి 5 శాతం మాత్ర‌మే. అది కూడా మెచ్యూరిటీ స‌మ‌యంలో బోన‌స్ రూ.35 వేలు చెల్లిస్తేనే. ఒక‌వేళ బోన‌స్ చెల్లించ‌క‌పోతే రాబ‌డి 4.7 శాతం మాత్ర‌మే.

కంపెనీ బ్రోచ‌ర్‌లో ఇచ్చిన స‌మాచారం ప్ర‌కారం, 15 సంవ‌త్స‌రాల కాలానికి సంవ‌త్స‌రానికి 50 వేల చొప్పున‌ ప్రీమియం చెల్లించాలి. అప్పుడు పాల‌సీ కాలం ముగిసిన త‌ర్వాత 8 శాతం రాబ‌డితో రూ.11,05,769 ల‌భిస్తుంది. ఒక‌వేళ‌ రాబ‌డి 4 శాతం అయితే రూ.8,93,314 మాత్ర‌మే అందుతాయి. ఈ 8 లేదా 4 శాతం రాబ‌డి బీమా కంపెనీలు త‌ప్ప‌నిస‌రిగా త‌మ పాల‌సీల‌లో చూపించాల‌ని ఐఆర్‌డీఏఐ నిబంధ‌న‌లు విధించింది.

పాల‌సీ ముగిసిన త‌ర్వాత త‌ప్ప‌నిస‌రిగా బోన‌స్ ఇవ్వాల‌ని ఏం నిబంధ‌న‌లు లేవు. పైన చూసిన ఉదాహ‌ర‌ణ ప్ర‌కారం, 15 ఏళ్ల కాలంలో మీరు చెల్లించాల్సిన మొత్తం రూ.7,50,000. 15 సంవ‌త్స‌రాల త‌ర్వాత మీకు రూ.11,05,769 లాభం త‌స్తుంది. అంతే కానీ 11 నుంచి 13 శాతం రాబ‌డి వ‌చ్చే అవ‌కాశం లేదు.

మ‌రి క‌చ్చిత‌మైన రాబ‌డి ఎంత అంటే పైన చెప్పిన ప్ర‌కారం రాబ‌డి 4.7 శాతం మాత్ర‌మే అంటే పెట్టుబ‌డుల రాబ‌డి 8 శాతం. బ్రోచ‌ర్‌లో చెప్పిన ప్ర‌కారం పెట్టుబ‌డుల‌పై రాబ‌డి 4 శాతం అయితే అస‌లు రాబ‌డి 2.2 శాతం మాత్ర‌మే.

చివ‌రగా
మీరు కేవ‌లం 2-5 శాతం వ‌ర‌కు మాత్ర‌మే రాబ‌డి పొందాలనుకుంటే ఈ పాల‌సీని కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఈ పాల‌సీని తీసుకోక‌పోవ‌డ‌మే మంచిదని ఆర్థిక స‌ల‌హాదారులు సూచిస్తున్నారు. క‌ష్ట‌ప‌డి సంపాదించిన డ‌బ్బు ఇందులో పెట్టి వృథా చేయ‌కూడ‌దు. బీమా ఏజెంట్లు పాల‌సీని విక్ర‌యించేందుకు చాలా ర‌కాలుగా ఒప్పించే ప్ర‌య‌త్నం చేస్తారు. మీకు 10 శాతం నుంచి 11 శాతం రాబ‌డి పొంద‌వ‌చ్చ‌ని చెప్తారు. కానీ నిజానికి అది కేవ‌లం 5 శాతం మాత్ర‌మే. అంతేకాకుండా హామీ మొత్తం చాల‌లా త‌క్కువ‌గా ఉంటుంది. దీనికి బ‌దులుగా ఆన్‌లైన్‌లో ట‌ర్మ్ ప్లాన్ తీసుకుంటే త‌క్కువ ప్రీమియంతో ఎక్కువ బీమా హామీ ల‌భిస్తుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly