2018 లో ఎక్కువ లాభ‌ప‌డిన‌ పెట్టుబ‌డుదారులు ఎవరు?

లాభాల‌ను ఆశించి ఒకే ర‌క‌మైన ప‌థ‌కాల‌ను ఎంచుకోకుండా పెట్టుబ‌డుల్లో వైవిధ్య‌త ఉంటే మంచిది.

2018 లో ఎక్కువ లాభ‌ప‌డిన‌ పెట్టుబ‌డుదారులు ఎవరు?

పీపీఎఫ్ లో పెట్టుబ‌డుల‌కు భ‌ద్ర‌త ఉంటుంద‌నుకునేవారికి 2018 క‌లిసొచ్చింది. మ‌ద్య‌త‌ర‌గ‌తి వారికి అనుకూల‌మైన పీపీఎఫ్ వార్షిక రాబ‌డి 7.7 శాతం రాబ‌డిని న‌మోదు చేసింది. ఎన్ఎస్‌సీ కూడా 7.7 శాతం రాబ‌డినందించింది. అయితే పీపీఎఫ్ పెట్టుబ‌డుల‌పై ప‌న్ను ఉండ‌దున్న విష‌యం తెలిసిందే. ఇత‌ర క‌చ్చిత‌మైన రాబ‌డినిచ్చే ప‌థ‌కాలు కూడా ఈ ఏడాది ఆశించిన లాభాల‌ను పంచాయి. సెక్యూరిటీల‌లో పెట్టుబ‌డులు పెట్టే స్వ‌ల్ప‌కాలీక‌ డెట్ ఫండ్లు కూడా 7.78 శాతం లాభాన్ని న‌మోదు చేశాయి. అయితే ఈ ఏడాది ఇంత మేర‌కు లాభాలు రావ‌డానికి కార‌ణం ద్ర‌వ్యోల్బ‌ణం పెర‌గొచ్చ‌నే అంచాన‌ల‌తో ఆర్‌బీఐ వ‌డ్డీ రేట్ల‌ను య‌ధావిధిగా కొన‌సాగించ‌డం అని చెప్పుకోవ‌చ్చు. ఈ ప్ర‌భావం ప్ర‌భుత్వ సెక్యూరిటీల‌పై ప‌డ‌టంతో అన్ని ర‌కాల పెట్టుబ‌డుల్లో లాభం వ‌చ్చింది. పీపీఎఫ్ రేట్లు ఎప్పూడు ప్ర‌భుత్వ సెక్యూరిటీల‌తో పోలిస్తే 25 బేసిస్ పాయింట్లు అధికంగానే ఉంటాయి. క‌చ్చిత‌మైన రాబ‌డినిచ్చే ప‌థకాలు ఈ ఏడాది ద్ర‌వ్యోల్బ‌ణాన్ని అదిగ‌మించి లాభ‌ప‌డ్డాయి. 2018 లో ఆర్‌బీఐ పాల‌సీ రేట్లు పెరిగాయి. మంచి మూల‌ధ‌నం క‌లిగిన బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్ల‌ను పెంచ‌డంతో రుణ వృద్ధి పెరిగింది.

ఆర్‌బీఐ చ‌ర్య‌ల‌తో ఫిక్స్‌డ్ డిపాజిట్ల నుంచి చిన్న పొదుపు ప‌థ‌కాల వ‌ర‌కు సానుకూల‌త ఏర్ప‌డింది. అయితే స్టాక్ మార్కెట్ల‌లో అడుగుపెట్టిన‌వారికి ఈ ఏడాది చేదు అనుభవాల్నే మిగిల్చింది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు న‌ష్ట‌పోయాయి. 2018 లో నిఫ్టీ 2.69 శాతం లాభ‌ప‌డింది. అంత‌ర్జాతీయ జాతీయ పరిణామాల‌తో గ‌తేడాది మార్కెట్ల‌లో అనిశ్చితి ఏర్ప‌డింద‌ని విశ్లేష‌కులు చెప్తున్నారు. ప్ర‌త్యేకంగా అధిక వ‌డ్డీ రేట్లు, చ‌మురు ధ‌ర‌లు పెర‌గ‌డం, అధిక మొత్తంలో విదేశీ పెట్టుబ‌డులు న‌మోద‌య్యాయి. అయితే 2018 లో లాభాలు వ‌చ్చాయ‌ని 2019 లో పీపీఎఫ్‌, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, బంగారంలో పెట్టుబ‌డులు పెట్టాల‌నుకుంటే అదే రాబ‌డి వ‌స్తుంద‌ని చెప్ప‌లేం. అందుకే కొంత‌ భ‌ద్ర‌త క‌లిగిన‌ వాటిలో, కొంత‌ ఈక్విటీల్లో పెట్టుబ‌డులు చేయ‌డం మంచిది.

2018 లో ఏ ప‌థ‌కంలో ఎంత రాబ‌డి వ‌చ్చిందో తెలుసుకుందాం …

0201.jpg

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly