అత్య‌వ‌స‌ర నిధి కోసం పెట్టుబ‌డి మార్గాలు

నిపుణుల ప్రకారం 10-15 రోజులఖర్చులకు అవసరమైన డబ్బును ఇంటి వద్ద ఉంచుకోవాలి

అత్య‌వ‌స‌ర నిధి కోసం పెట్టుబ‌డి మార్గాలు

అవసరమైన సమయానికి కావలసిన డబ్బు విషయంలో , మదుపరులు చాలా జాగ్రత్తగా ఉండాలి . ఎంతోకాలంగా సస్పెన్షన్ లో ఉన్న ముంబయి ఆధారిత సీకేపీ కో-ఓపెరేటివ్ బ్యాంకు లైసెన్స్ ను ఏప్రిల్ 30న రిజర్వు బ్యాంకు అఫ్ఇండియా రద్దు చేసింది . అయితే 99.2శాతం డిపాజిటర్ ల సొమ్ము డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేష‌న్ (డీఐసీజీసీ) కింద వారికి లభిస్తుందని రిజర్వు బ్యాంకు తెలిపింది . పంజాబ్ మహారాష్ట్ర కో-ఓపెరేటివ్ బ్యాంకు (పీఎంసీ) ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉంది .

ఖాతాదారులు ఎస్ బ్యాంకు లో డబ్బులు నెల రోజులు వాడుకోలోలేకపోయారు . ఈ మధ్య ఫ్రాంక్లిన్ టెంపుల్టెన్ మ్యూచువల్ ఫండ్ తన ఆరు డెట్ స్కీం లను సస్పెన్షన్ లో ఉంచింది. దీనివల్ల మదుపరులు తమ సొమ్ము తీసుకోలేరు, మదుపు చేయలేరు. డబ్బు భద్రత ఉందికానీ, ఎప్పుడు చేతికొస్తుందో తెలియని పరిస్థితి . అత్యవసరంగా కావలసిన డబ్బు కోసం ఇటువంటి సమయాల్లో ఏమి చేయాలి . డబ్బును పెట్టుబడి చేసేటప్పుడు అధిక వడ్డీ, పన్ను మినహాయింపులు వంటి వాటికోసం చూడకూడదు . అనారోగ్యంగా ఉన్నప్పుడు, లేదా ఉద్యోగం కోల్పోయినప్పుడు వంటి సమయాల్లో డబ్బు అవసరం ఉంటుంది.

నిపుణుల ప్రకారం 10-15 రోజులఖర్చులకు అవసరమైన డబ్బును ఇంటి వద్ద ఉంచుకోవాలి . ముంబయి వరదల సమయంలో బ్యాంకులు , ఏటీఎం లు కూడా మూతపడ్డాయి . కొంత డబ్బును పొదుపు ఖాతా లో ఉంచాలి. అయితే పొదుపు ఖాతాలో వుంటే రోజువారీ ఖర్చులకు వాడే అవకాశం ఉంది కాబట్టి, ఫ్లెక్సీ ఫిక్సెడ్ డిపాజిట్ లో వుంచడం వలన , కొంచెం అధిక వడ్డీ తో పాటు , అవసరమైనప్పుడు పొదుపు ఖాతా ద్వారా తిరిగి పొందొచ్చు . అత్యవసర నిధిని దాచుకునేటప్పుడు కో-ఓపెరేటివ్ బ్యాంకుల కన్నా ప్రభుత్వ లేదా పెద్ద ప్రైవేట్ బ్యాంకులను ఎంచుకోవాలి . అలాగే రెండు బ్యాంకు లలో ఉంచడం మంచిది .

అత్యవసర నిధిని మంచి రాబడి, పన్ను మినహాయింపుల కోసం షార్ట్ టర్మ్ ఫండ్స్ లో పెట్టుబడి చేయమని ఆర్ధిక నిపుణులు సలహా ఇస్తూంటారు . అయితే ఈ మధ్య జరిగిన ఫ్రాంక్లిన్ టెంపుల్టెన్ మ్యూచువల్ ఫండ్ ఉదంతం అందరిని ఇబ్బందికి గురి చేసింది . నిపుణుల అభిప్రాయం ప్రకారం అత్యవసర నిధికి అత్యంత సురక్షితమైన పెట్టుబడి సాధనం లిక్విడ్/ ఓవర్ నైట్ ఫండ్స్ . లిక్విడ్ ఫండ్స్ ఎంచుకునేటప్పుడు అధిక శాతం ప్రభుత్వ బాండ్స్ , లేదా ‘AAA’ రేటెడ్ బాండ్స్ఉండేటట్లు చూసుకోవాలి. అలాగే అధిక ఆస్తుల నిర్వ‌హ‌ణ (ఏయూఎం) కలిగిన రెండు ఫండ్స్ లో పెట్టుబడి చేయాలి .

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly