పేటీఎం 'ఫాస్టాగ్‌'

ఫాస్టాగ్‌ కలిగిన వాహనం టోల్‌ ప్లాజా దాటి వెళ్లినప్పుడు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌ (ఆర్‌ఎఫ్‌ఐడీ) సాంకేతికత ఆధారంగా చెల్లింపులు జరుగుతాయి

పేటీఎం 'ఫాస్టాగ్‌'

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (పీపీబీ) ఎక్కువ మొత్తంలో ఫాస్టాగ్‌ల‌ను జారీచేసిన‌ట్లు వెల్ల‌డించింది. ఇప్ప‌టివ‌ర‌కు 3 మిలియ‌న్ల ఫాస్టాగ్‌ల‌ను అందించింది . డిసెంబ‌ర్ 15 నుంచి వాహ‌నాల‌కు ఫాస్టాగ్ త‌ప్ప‌నిస‌రి చేసిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌భుత్వం చేప‌ట్టిన‌ డిజిటల్ ఇండియా విజ‌న్ కోసం తాము చేస్తున్న కృషికి ఇది నిధ‌ర్శ‌నం అని పేటీఎం పేర్కొంది. డిజిట‌ల్ టోల్ చెల్లింపుల‌ను మ‌రింత ప్రోత్స‌హిస్తామ‌ని తెలిపింది.

ఫాస్టాగ్ ఎల‌క్ర్టానిక్ టోల్ చెల్లింపు విధానం, దీనిని నేష‌న‌ల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వ‌హిస్తుంది. ప్రీపెయిడ్ లేదా పొదుపు ఖాతా నుంచి రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీని ఉపయోగించి నేరుగా ఇది టోల్ చెల్లిస్తుంది.

ఫాస్టాగ్‌తో టోల్‌గేట్ల‌ వ‌ద్ద ఆగాల్సిన ప‌నిలేదు

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ మార్చి లోపు రెట్టింపు సంఖ్య‌లో ఫాస్టాగ్‌ల‌ను జారీ చేయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకుంది. ఇప్ప‌టికే అందుబాటులోకి వ‌చ్చిన వాటిలో 40 శాతం పేటీఎం జారీ చేసిన‌వే. పేటీఎం వాలెట్‌తో నేరుగా చెల్లించే అవ‌కాశం ఉంది. మ‌ళ్లీ దానికోసం ప్ర‌త్యేకంగా ఫాస్టాగ్ వాలెట్‌ను క్రియేట్ చేసి రీఛార్జ్ చేయ‌నవ‌స‌రం లేదు. అందుకే ఎక్కువ మంది దీనిని ఎంచుకుంటున్నారు. దీనిని సుల‌భంగా వాహ‌న రిజిస్ర్టేష‌న్ నంబ‌ర్‌, స‌ర్టిఫికెట్‌తో కొనుగోలు చేయ‌వ‌చ్చు. మీ న‌మోదిత చిరునామా ఉచితంగా డెలివ‌రీ చేస్తుంది. బ్యాంకులు, ఇత‌ర వాలెట్లు కూడా ఫాస్టాగ్‌ల‌ను జారీ చేస్తున్నాయి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly