స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ స‌ర్వీసుల‌ను ప్రారంభించ‌నున్న పేటీఎమ్‌..

షేర్ ట్రేడింగ్‌తో పాటు ఎన్‌పీఎస్‌(నేష‌న‌ల్ పెన్ష‌న్ సిస్ట‌మ్‌)ను కూడా పేటీఎమ్ త్వ‌ర‌లోనే ఆఫ‌ర్ చేయ‌నుంది

స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ స‌ర్వీసుల‌ను ప్రారంభించ‌నున్న పేటీఎమ్‌..

డిజిటల్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్‌ఫామ్ పేటీఎంమనీ త్వరలోనే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ సేవలను ప్రారంభించ‌నుంది. ఇంద‌కోసం మార్కెట్ల నియంత్ర‌ణ సంస్థ సెబి(సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) నుంచి ఇప్ప‌టికే అనుమ‌తి పొందింది.

దీనికి సంబంధించిన వివ‌రాల‌ను పేటీఎంమనీ త‌మ అధికారిక ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా వెల్ల‌డించింది. “నిర్వ‌హ‌ణ‌, ఆప‌రేష‌న్లు వంటి ప‌లు అంశాల‌పై మా టీమ్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌ల‌ను సంప్ర‌దించింది. ఈ రంగంలో అడుగు పెట్టేందుకు ఎంతో ఆస‌క్తితో ఎద‌రుచూస్తున్నాం” అని సంస్థ ట్వీట్ చేసింది.

పేటీఎంమనీ ట్రేడింగ్‌లో ఈక్వీటీలు, క్యాష్ సెగ్‌మెంట్‌, డెరివేటీవ్స్‌, ఈటీఎఫ్‌ల‌ను ఆఫ‌ర్ చేయ‌నుంది. ఈ స్టార్ట‌ప్ ఇంత‌వ‌ర‌కు త‌మ ధ‌ర‌ల‌ను ప్ర‌క‌టించ‌లేదు. అయితే ప్ర‌స్తుతానికి జెరోధా నేతృత్వంలోని డిస్కౌంట్ బ్రోక‌రేజ్ విభాగంలో ఉంటుంద‌ని భావిస్తున్నారు. బెంగుళూరుకు చెందిన డిస్కౌంట్ బ్రోక‌రేజ్ సంస్థ, ప్ర‌స్తుత భార‌త రీటైల్ ట్రేడింగ్‌లో దాదాపు 15శాతం కాంట్రీబ్యూట్ చేస్తుంది. అంతేకాకుండా 15 ల‌క్ష‌ల కంటే ఎక్కువ ఖాతాదారుల‌తో భార‌త అతిపెద్ద రిటైల్ స్టాక్‌బ్రోక‌ర్‌గా కొన‌సాగుతుంది.

షేర్ ట్రేడింగ్‌తో పాటు ఎన్‌పీఎస్‌(నేష‌న‌ల్ పెన్ష‌న్ సిస్ట‌మ్‌)ను కూడా పేటీఎమ్ త్వ‌ర‌లోనే ఆఫ‌ర్ చేస్తుంది. ఇందుకు సంబంధించి పెన్ష‌న్ ఫండ్ రెగ్యులేట‌రీ అండ్ డ‌వ‌ల‌ప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్‌డీఏ) నుంచి అనుమ‌తి పొందింది.

పేటీఎమ్ ఇన్వెస్ట‌మెంట్ ఫ్లాట్‌ఫామ్‌పై 30 ల‌క్ష‌ల మంది వినియోగ‌దారులు ఉన్నారు. ఇప్ప‌టికే ఈ సంస్థ మ్యూచువ‌ల్ ఫండ్ స‌ర్వీసులను కూడా అందిస్తుంది. సంస్థ‌ త‌మ మ్యూచువ‌ల్ ఫండ్ యాప్‌ను సెప్టెంబ‌రు,2018లో ప్రారంభించింది.

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly