పేటీఎం వినియోగదారులకు శుభవార్త..
వినియోగదారుల డిమాండ్లను తీర్చడానికి అనేక కొత్త ఉత్పత్తులను క్లిక్స్, పేటీఎం కలిసి ప్రవేశపెట్టనున్నాయి
దేశంలోని ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం తన ప్లాట్‌ఫామ్‌లోని వినియోగదారులకు, వ్యాపారులకు తక్షణ డిజిటల్ రుణాలను అందించడానికి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సియల్ కంపనీ అయిన క్లిక్స్ ఫైనాన్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
“ఢిఫర్డ్ పేమెంట్ లేదా పోస్ట్ పెయిడ్”, “మర్చంట్ లైన్స్” సౌకర్యాల ద్వారా కంపెనీ పేటీఎం వినియోగదారులకు, వ్యాపారులకు రుణాలు అందిస్తుంది.
పేటీఎం, క్లిక్స్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ప్రొప్రయిటరీ మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్) మోడళ్లను ఉపయోగించి, మిలియన్ల మంది పేటీఎం వినియోగదారులు, వ్యాపారులు పేటీఎం ప్లాట్ఫామ్లో తక్షణమే డిజిటల్ రుణాలను పొందవచ్చునని వన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ ఒక ప్రకటన ద్వారా తెలిపింది.
పేటీఎం పోస్ట్‌పెయిడ్, మర్చంట్ లెండింగ్ ఉత్పత్తులపై అధిక స్పందన చూశామని, ఈ భాగస్వామ్యంతో క్రెడిట్ టెస్టడ్ అల్గోరిథమిక్ రుణ ఉత్పత్తులను పెద్ద వినియోగదారులకు, వ్యాపారులకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేటీఎం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నితిన్ మిశ్రా తెలిపారు.
రాబోయే కొద్ది నెలల్లో వినియోగదారుల అనుభవాన్ని మరింత మెరుగుపరచడానికి, వారి డిమాండ్లను తీర్చడానికి అనేక కొత్త ఉత్పత్తులను క్లిక్స్, పేటీఎం కలిసి ప్రవేశపెట్టనున్నాయి.
దేశంలోని లక్షలాది మంది వినియోగదారుల అపరిమితమైన ఆర్థిక అవసరాలను తీర్చడానికి అవసరమయ్యే ప్రత్యేకమైన ఉత్పత్తులను పేటీఎం తో కలిసి అందుబాటులోకి తీసుకొస్తామని క్లిక్స్ ఫౌండర్, చైర్మన్ ప్రమోద్ భాసిన్ తెలిపారు.
భారతదేశంలోని దాదాపు 60 మిలియన్ల మైక్రో, స్మాల్ & మీడియం ఎంటర్ప్రెస్సెస్ (ఎంఎస్ఎంఈ) డిజిటలైజషన్ వైపు వెళ్లాల్సి ఉంది. అలీబాబాకు చెందిన పేటీఎం దేశంలో 200 మిలియన్లకు పైగా వినియోగదారులను కలిగి ఉంది.
సిరి లో ఇంకా:
మదుపర్ల ప్రశ్నలకు సిరి జవాబులు , వడ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేటర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థమయ్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ రకాల మ్యూచువల్ ఫండ్ల పనితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివరాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్టర్
Comments
0