వ్యాపార‌స్తుల‌కు 'ఆల్ ఇన్ వన్' క్యూఆర్‌ను ప్ర‌వేశ‌పెట్టిన పేటీఎం

నేరుగా వ్యాపారుల బ్యాంక్ ఖాతాకు న‌గ‌దు చేరేలా ఈ క్యూఆర్ ఉప‌యోగ‌ప‌డుతుంది

వ్యాపార‌స్తుల‌కు 'ఆల్ ఇన్ వన్' క్యూఆర్‌ను ప్ర‌వేశ‌పెట్టిన పేటీఎం

దేశవ్యాప్తంగా ఉన్న‌ వ్యాపారుల కోసం "ఆల్ ఇన్ వన్ క్యూఆర్‌"ను ప్రారంభించినట్లు భారత ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం బుధవారం ప్రకటించింది. ఈ క్యూర్ కోడ్‌ను ఉప‌యోగించి పేటీఎం వాలెట్‌, రూపే కార్డులు, యూపీఐ ఆధారిత చెల్లింపుల యాప్‌లు అన్నింటి నుంచి నేరుగా వ్యాపారుల బ్యాంక్ ఖాతాకు న‌గ‌దు స్వీక‌రించేందుకు వీలుంటుంది. ఇందుకు ఎలాంటి రుసుములు చెల్లించ‌న‌వ‌స‌రం లేద‌ని పేటీఎమ్ వ్య‌వ‌స్థాప‌కుడు, సీఈఓ విజ‌య్ శంక‌ర్ శ‌ర్మ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో తెలిపారు. ఈ ప్లాట్‌ఫాం తన ‘పేటీఎం ఫర్ బిజినెస్’ యాప్ ద్వారా అన్ని ర‌కాల చెల్లింపులను ఒకే చోట అందిస్తుంద‌ని శ‌ర్మ‌ తెలిపారు.

“వ్యాపారాల కోసం ఆల్ ఇన్ వన్ క్యూఆర్‌ను ప్రారంభించడం మాకు చాలా గర్వంగా ఉంది. ఇది తప్పనిసరిగా ఉండవలసిన వ్యాపార సాధ‌నం” అని శ‌ర్మ‌ వెల్ల‌డించారు.

వన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్‌కు చెందిన‌ పేటీఎం, కాలిక్యులేటర్లు, పవర్ బ్యాంకులు, గడియారాలు, రేడియో వంటి వివిధ వస్తువులలో క్యూఆర్ కోడ్‌ను ఆవిష్కరించింది. వీటిని వ్యాపారులు తమ దుకాణంలో రోజువారీ అవసరాలకు ఉపయోగించవచ్చు.

ఆల్ ఇన్ వన్ క్యూఆర్‌ను ఉప‌యోగించే వారి కోసం ‘పేటీఎం బిజినెస్ ఖాతా’ ను కూడా సంస్థ‌ ప్రవేశపెట్టింది. “బిజినెస్ ఖాతా” నగదు, క్రెడిట్‌తో సహా ఖాతాదారుల లావాదేవీల సంబంధిత‌ లెడ్జర్‌లను డిజిటల్ విధానంలో నిర్వ‌హించేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని సంస్థ తెలిపింది. వ్యాపారుల మొబైల్ చెల్లింపుల‌లో 54శాతం మార్కెట్ వాటాను పేటీఎం క‌లిగి ఉంది.

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly