ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు స్వ‌చ్ఛంద ప‌ద‌వీవిర‌మ‌ణపై ఎన్‌పీఎస్ నియ‌మాలు

ఎన్‌పీఎస్ టైర్‌-I, ఖాతా కింద‌కు వ‌చ్చే కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు ఇచ్చే కాంట్రీబ్యూష‌న్‌ను ప్ర‌భుత్వం 10 శాతం నుంచి 14 శాతానికి పెంచింది.

ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు స్వ‌చ్ఛంద ప‌ద‌వీవిర‌మ‌ణపై ఎన్‌పీఎస్ నియ‌మాలు

జ‌న‌వ‌రి, 2004 త‌రువాత విధుల‌లో చేరిన కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగులు(ర‌క్ష‌ణ ద‌ళంలో ప‌నిచేస్తున్న వారిని మిన‌హాయించి) అంద‌రికీ ఎన్‌పీఎస్ వ‌ర్తిస్తుంది. మే, 2009 త‌రువాత అసంఘ‌టిత కార్మిక‌ల‌తో స‌హా దేశ పౌరులంద‌రికీ ప‌ద‌వీవిర‌మ‌ణ నిధిని స‌మ‌కూర్చే ఉద్దేశ్యంతో ఎన్‌పీఎస్‌ను విస్త‌రించింది. ఇందుకు కార్మికులు స్వ‌చ్ఛంద‌గా కాంట్రీబ్యూట్ చేయ‌వ‌చ్చు. ఎన్‌పీఎస్ టైర్‌-I, ఖాతా కింద‌కు వ‌చ్చే కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు ప్రాథ‌మిక వేత‌నం+ క‌రువు భ‌త్యాల‌పై ఇచ్చే కాంట్రీబ్యూష‌న్‌ను ఈ ఏడాది ప్ర‌భుత్వం 10 శాతం నుంచి 14 శాతానికి పెంచింది. అయితే ఉద్యోగి కాంట్రీబ్యూష‌న్‌ను 10 శాతంలో ఎటువంటి మార్పు లేదు.

స్వ‌చ్చంధ ప‌ద‌విర‌మ‌ణ‌పై ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు అందే ఎన్‌పీఎస్ ప్ర‌యోజ‌నాలు:

  1. ప్ర‌భుత్వ ఉద్యోగులు క‌నీస 20 సంవ‌త్స‌రాల స‌ర్వీసుతో సంబంధం లేకుండా ప‌ద‌వీ విర‌మ‌ణ కంటే ముందే ఎన్‌పీఎస్ నుంచి నిష్క్ర‌మించ‌వ‌చ్చు.
  1. ఎన్‌పీఎస్ నిబంధనల ప్రకారం, స్వ‌చ్ఛంద ప‌ద‌వీవిర‌మ‌ణ అనేది ప్రభుత్వ ఉద్యోగి, అత‌ను/ ఆమెకు వ‌ర్తించే స‌ర్వీస్ రూల్స్‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. ఒక‌వేళ ఎన్‌పీఎస్ చందాదారుడు స్వ‌ఛ్చంద ప‌ద‌వీవిర‌మ‌ణ(వాలెంట‌రీ రిటైర్‌మెంట్‌)లేదా ఎన్‌పీఎస్ నుంచి నిష్ర్క‌మ‌ణ అనేది చేస్తే, ఎన్‌పీఎస్‌లో జ‌మ అయిన మొత్తం నుంచి 80 శాతం మొత్తాన్ని యాన్యూటీలు కొనుగోలు చేసేందుకు త‌ప్ప‌క ఉప‌యోగించాలి.

  2. యాన్యూటీలు ప‌ద‌వీ విర‌మ‌ణ కోసం ఉద్దేశించ‌వి. దీని ద్వారా ప‌ద‌వీ విర‌మ‌ణ స‌మ‌యంలో నిర్ధిష్ట మొత్తాన్ని నెల‌వారీగా, త్రైమాసికంగా, వార్షికంగా పొంద‌వ‌చ్చు. ఇది ఎన్‌పీఎస్‌లో జ‌మ అయిన‌ మొత్తం, ఎంచుకున్న కాల‌ప‌రిమితిపై ఆధార‌ప‌డి ఉంటుంది.

  3. మిగిలిన ఎన్‌పీఎస్ మొత్తాన్ని చందాదారునికి ఏక‌మొత్తంగా చెల్లిస్తారు.

  4. ఫించ‌ను, ఫించ‌నుదారుల సంక్షేమ శాఖ ప్ర‌కారం, 1972, సీసీఎస్‌(పెన్ష‌న్‌)నిబంధ‌న‌లు మాదిరిగానే, ఎన్‌పీఎస్ ప‌రిధిలోకి వ‌చ్చే కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు ప‌ద‌వీవిర‌మ‌ణ గ్రాట్యూటీ, డెత్ గ్రాట్యూటీ ప్ర‌యోజ‌నం పెంచారు.

చివ‌రిగా:
పైన తెలిపిన ప్ర‌కారం ప్ర‌భుత్వ ఉద్యోగులు ఎన్‌పీఎస్ నుంచి ముందుగానే వైదొలిగే వెలుసుబాటు ఉన్న‌ప్ప‌టికీ, ఎన్‌పీఎస్ నుంచి వైదొలిగే స‌మ‌యానికి జ‌మ అయిన మొత్తం నుంచి 80 శాతం మొత్తాన్ని యాన్యూటీల‌లో త‌ప్ప‌క పెట్టుబ‌డి పెట్టాలి. దీనివ‌ల‌న కొంత న‌ష్ట‌పోయే అవ‌కాశం ఉంటుంది కాబ‌ట్టి ఉద్యోగులు త‌మ ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌ర‌కు ఎన్‌పీఎస్‌ను కొన‌సాగించ‌డం మంచిది. దీని వ‌ల్ల దీర్ఘ‌కాలంలో మంచి రాబ‌డిని పొంద‌డం మాత్ర‌మే కాకుండా ప్ర‌స్తుత నియ‌మాల ప్ర‌కారం ప‌ద‌వీవిర‌మ‌ణ త‌రువాత 60 శాతం మొత్తాన్ని ఒకేసారి విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. 40 శాతం మొత్తాన్ని పెన్ష‌న్ కోసం యాన్యూటీల‌లో పెట్టుబ‌డి పెట్టాల్సి ఉంటుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly