సొంతింటి నిర్మాణానికి కాంట్రాక్ట‌ర్ లేదా డెవ‌ల‌ప‌ర్ - ఎవరు మేలు?

ఇంటి నిర్మాణం కాంట్రాక్ట‌ర్ లేదా డెవ‌ల‌ప‌ర్ ద్వారా చేప‌ట్టేట‌ప్పుడు తెలుసుకోవాల్సిన కొన్ని విష‌యాలు..

సొంతింటి నిర్మాణానికి కాంట్రాక్ట‌ర్ లేదా డెవ‌ల‌ప‌ర్ - ఎవరు మేలు?

సొంత ఇంటిని నిర్మించుకోవాల‌నుకునేవారు ముందుగా కాంట్రాక్ట‌ర్‌ను లేదా డెవ‌ల‌ప‌ర్‌ను ఎంచుకోవాలి. ఇల్లు నిర్మించ‌డం అనేంది చాలా ఖ‌ర్చుతో కూడుకున్న ప‌ని. చాలామంది త‌మ జీవిత కాలంలో ఒకే ఒక ఇంటిని నిర్మించుకుంటారు. అందుకే ఇంటికి నాణ్య‌త‌, ప‌రిమాణాలు అనేవి చాలా ముఖ్యం. సాధారణంగా ఒక కాంట్రాక్టర్ వేర్వేరు దశలలో, ప్రాజెక్టును పూర్తి చేయడానికి నిపుణుల‌ను నియమించుకుంటారు. అదేవిధంగా డెవలపర్ డిజైనర్‌, ఇంజనీర్లు, ప్లంబర్లు, ఎలెక్ట్రిషియన్లు, నాణ్యతా నిర్వహణ మరియు అనుసంధాన బృందాలను క‌లిగి ఉంటారు.

డెవ‌ల‌ప‌ర్ ద్వారా ఇంటిని నిర్మిస్తున్న‌ప్పుడు దృష్టిలో పెట్టుకోవాల్సిన‌వి:

నిపుణుల సూచ‌న‌లు:
డెవ‌ల‌ప‌ర్లు ఆర్కిటెక్ట్‌, ఇంజ‌నీర్లు నాణ్య‌త నిర్వ‌హ‌ణ బృందం, సంబంధిత కార్య‌క‌లాపాల బృందం క‌లిసి ఇంటి ప్రాజెక్టుల‌ను చేప‌డుతుంటారు. మీకు న‌చ్చిన‌ట్లుగా ఇంటిని డిజైన్ చేసుకోవాలంటే ఆర్కిటెక్ట్‌తో మీకు న‌చ్చిన విధంగా ఇంటిని ఎలా కావాల‌నుకుంటున్నారో వారికి చెప్పాలి. వారి ప్లాన్ మీకు, కుటుంబ స‌భ్యుల‌కు న‌చ్చితే ఇంటి నిర్మాణం ప్రారంభించ‌వ‌చ్చు.

అనుమ‌తులు:
డెవ‌ల‌ప‌ర్‌కి ఇంటిని నిర్మించేందుకు కావ‌ల‌సిన అన్ని అనుమ‌తులు ఉన్నాయా లేదా తెలుసుకోండి. వివిధ శాఖ‌ల నుంచి అనుమ‌తులు, స‌ర్టిఫికెట్లు, సంబంధిత లేఖ‌లు వంటివి ఉండాలి. ప్రాజెక్ట్ ప్రారంభించే ముందు ఆర్థిక ప‌రిస్థితుల‌ను కూడా దృష్టిలో పెట్టుకోవాలి.

బ‌డ్జెట్‌:
ఒక‌సారి ఇంటి ప్లాన్ సిద్ధ‌మైన త‌ర్వాత బ‌డ్జెట్ గురించి డెవ‌ల‌ప‌ర్‌కి తెలియ‌జేయాలి. అప్పుడు ఇంటికి ఏ ర‌క‌మైన మెటీరియ‌ల్స్ ఉప‌యోగించాలో, ఎలా నిర్మించాలో స్ప‌ష్ట‌త వ‌స్తుంది. ఫ్లోరింగ్,
బాత్‌ ఫిట్టింగ్స్‌, ఫిక్ష‌ర్స్‌, పేయింటింగ్, ఎల‌క్ర్టిక‌ల్ స్విచెస్, ఫిట్టింగ్స్‌, మాడ్యుల‌ర్ కిచెన్ ఇలా మీరు ఎంచుకున్న దాన్ని బ‌ట్టి బ‌డ్జెట్ ఉంటుంది.

స‌బ్-కాంట్రాక్ట‌ర్లు:
చాలావ‌ర‌కు డెవ‌ల‌ప‌ర్లు సొంతంగా టీమ్ క్వాలిటీ ఇంజ‌నీర్స్‌, సూప‌ర్‌వైజ‌ర్ వంటి స‌బ్-కాంట్రాక్ట‌ర్ల టీమ్ క‌లిగి ఉంటారు . మీరు సొంతంగా సబ్‌-కాంట్రాక్ట‌ర్‌ను పెట్టుకోవాల‌నుకుంటే ముందుగా డెవ‌ల‌ప‌ర్‌కి చెప్ప‌వ‌ల‌సి ఉంటుంది. దాని ప్ర‌కారం ఎంత ఖ‌ర్చ‌వుతుంద‌నేది అంచ‌నా వేసుకుంటారు.

కూలీ ఖ‌ర్చులు:
ఇంటి నిర్మాణం ప్రారంభించే ముందే కూలీ ఖ‌ర్చుల‌ను మాట్లాడుకోవాలి. అప్పుడు ఎంత ఖ‌ర్చు అవుతుందో దానిపై మీకు స్ప‌ష్ట‌త వ‌స్తుంది. ముందుగానే అన్ని ఖ‌ర్చులు, లెక్క‌లు మాట్లాడుకుంటే త‌ర్వాత ఏ స‌మ‌స్య ఉండ‌దు. ఎలాంటి చ‌ట్ట‌ప‌ర‌మైన ఇబ్బందులు రాకుండా కూలీల భ‌ద్ర‌త‌కు కూడా జాగ్ర‌త్త వ‌హించాల్సి ఉంటుంది.

నిర్మాణంపై క‌న్నేయండి:
నిర్మాణం జ‌రిగేట‌ప్పుడు అక్క‌డ ప‌రిస్థితుల‌ను డెవ‌ల‌ప‌ర్‌ను అడిగి ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకుంటుండాలి. అదేవిదంగా అప్పుడుప్పుడు సైట్‌కి వెళ్లి నిర్మాణ క‌ర్య‌క‌లాపాల‌ను ప‌రిశీలిస్తుండాలి. అప్పుడు ఎలాంటి స‌మ‌స్య‌లు త‌లెత్త‌కుండా ఉంటాయి.

ఇంటిరీయ‌ర్ లే అవుట్‌:
ప‌వ‌ర్‌, వాట‌ర్, లైటింగ్ వంటి అన్ని స‌దుపాయాలు అన్ని స‌క్ర‌మంగా అమ‌రుస్తున్నారా లేదా చూసుకోవాలి. య‌జ‌మాని, డెవ‌ల‌ప‌ర్ ఇద్ద‌రు క‌లిసి నిర్ణ‌యం తీసుకుంటే అనుకున్న‌దాని ప్ర‌కారం ఇంటి నిర్మాణం పూర్త‌వుతుంది.

రిఫ‌రెన్సులు:
డెవ‌ల‌ప‌ర్ ఇది వ‌ర‌కే నిర్మాణ రంగంలో ఉంటే ఇంత‌కు ముందు ప‌నిచేస‌న చోట ఫీడ్‌బ్యాక్ అడిగి తెలుసుకోవ‌చ్చు. ప‌నితీరు, అనుభ‌వం, డిజైన్, ప్రాసెస్‌, స్థ‌ల వినియోగం, ప్ర‌త్యేక‌త‌లు, ఫ‌ర్నీషింగ్ వంటి వాటి గురించి తెలుసుకోండి.

నిర్మాణం పూర్తి:
ఇంటి నిర్మాణం, వ్య‌యాలు గురించి పూర్తి స‌మాచారం డెవ‌ల‌ప‌ర్ మీకు అందిస్తాడు. ఫ్లోరింగ్, పేయింట్ క‌ల‌ర్స్‌, లైట్ ఫిట్టింగ్స్‌, బాత్ ఫిట్టింగ్స్‌, ఫిక్ష‌ర్స్, క్యాబినెట్స్ వంటివి నిర్మాణం పూర్త‌య్యే స‌మ‌యంలో మీ ఇష్ట‌ప్ర‌కారం ఎంచుకోవ‌చ్చు. ప్రాజెక్టు పూర్త‌యిన త‌ర్వాత క్వాలిటీ టీమ్ ప‌రిశీలించి బాధ్య‌త‌ను మీకు అప్ప‌గిస్తారు.

కాంట్రాక్టర్ ద్వారా ఇంటిని నిర్మిస్తున్న‌ప్పుడు దృష్టిలో పెట్టుకోవాల్సిన‌వి

ఒక‌రితోనే కాంటాక్ట్‌:
ప్రాజెక్టు నిర్మాణ స‌మ‌యయంలో ఒక వ్య‌క్తి ద్వారానే స‌మాచారం తెలుసుకోవాలి.

కాంటాక్ట్‌:
కాంట్రాక్ట‌ర్ ప‌రితీరు, బ‌డ్జెట్, బిల్డింగ్ మెటిరియ‌ల్స్, వ్య‌యాలు, స‌బ్‌-కాంట్రాక్ట్ వంటివి
తెలుసుకోవాలి.

అనుమ‌తులు:
బిల్డింగ్ ప్లాన్, విద్యుత్ సదుపాయం, నీరు, ఇత‌ర స‌దుపాయాలు వంటివి అన్ని ప‌రిశీలించిన త‌ర్వాత డిజైట్‌ను ఫైన‌ల్ చేయాలి. ఆర్కిటెక్ట్‌ను కాంట్రాక్ట‌ర్‌కు అప్ప‌గించాలి.

షెడ్యూల్‌:
నిర్మాణ షెడ్యూల్ కాంట్రాక్ట‌ర్‌ను అడిగి తెలుసుకోవాలి. కిచెన్‌, టైల్స్, బాత్ ఫిట్టింగ్స్‌, ఇంటీరియ‌ర్స్, పేమెంట్ షెడ్యూల్ వంటివి మాట్లాడుకోవాలి. ఇంటి నిర్మాణం గురించి ఎప్ప‌టిక‌ప్పుడు మీకు స‌మాచారం అందేలా చూసుకోవాలి. దీంతో ఏదైనా మార్పులు చేయాల‌నుకుంటే అనుకూలంగా ఉంటుంది.

సూప‌ర్‌విజ‌న్:
నిర్మాణ స్థ‌లాన్ని ప‌రిశీలిస్తున్న సూప‌ర్‌వైజ‌ర్ వివరాలు తెలుసుకోవ‌డం చాలా ముఖ్యం. చాలా వ‌ర‌కు కాంట్రాక్ట‌ర్లు నిర్మాణ తీరును, నాణ్య‌త‌ను ప‌రిశీలించేందుకు సూప‌ర్‌వైజ‌ర్ల‌ను నియమించుకుంటారు

నిర్మాణంలో మార్పులు:
ముందుగా అనుకున్న‌ట్లుగా కాకుండా నిర్మాణంలో ఏదైనా మార్పులు కావాలంటే వ్య‌యాలు, షెడ్యూల్‌లో వ‌చ్చిన మార్పులు రాత‌పూర్వ‌కంగా ఉండాలి.

అందుబాటులో ఉండ‌టం:
వీలైనంత వ‌ర‌కు నిర్మాణ స్థ‌లంలో య‌జ‌మానులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. ఉదాహ‌ర‌ణ‌కు విద్యుత్ స‌దుపాయాలు, టైల్స్ వంటివి ఫిక్స్ చేసేట‌ప్పుడు ఆర్కిటెక్ట్‌తో పాటు య‌జ‌మాని ఉంటే నిర్మాణంలో ఇబ్బందులు ఉండ‌వు.

ప్రాజెక్ట్ పేప‌ర్ వ‌ర్క్‌:
ప్రాజెక్ట్‌ పూర్తి చేయడానికి ముందు, ఎలక్ట్రానిక్ పరికరాల కోసం యూజర్ మ్యానువ‌ల్స్, సబ్ కాంట్రాక్టర్లకు సంబంధించిన సమాచారం, తనిఖీ నివేదికలు, ప్లంబింగ్ యుటిలిటీస్ జాబితా ఉండాలి.

చివ‌ర‌గా:

ఇంటి నిర్మాణతం కాంట్రాక్ట‌ర్ సాయంతో పూర్తి చేసిప్పుడు త‌క్కువ ఖ‌ర్చు ఉండొచ్చు. అదే డెవ‌ల‌ప‌ర్ అయితే అంద‌రి టీమ్‌ను క‌లిగి ఉంటారు కాబ‌ట్టి ఎక్కువ‌గా ఖ‌ర్చు ఉంటుంది. చివ‌ర‌గా మీ స‌దుపాయాన్ని బ‌ట్టి మీరు నిర్ణ‌యం తీసుకోవ‌చ్చు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly