పోస్టాఫీసు చిన్న‌మొత్తాల పొదుపు ప‌థ‌కాల తాజా వ‌డ్డీరేట్లు

పోస్టాఫీసు చిన్న మొత్తాల పొదుపు ప‌థ‌కాల‌పై 4 నుంచి 8.6 శాతం వ‌ర‌కు వ‌డ్డీ ల‌భిస్తుంది.

పోస్టాఫీసు చిన్న‌మొత్తాల పొదుపు ప‌థ‌కాల తాజా వ‌డ్డీరేట్లు

జ‌న‌వ‌రి-మార్చి త్రైమాసికానికి చిన్న మొత్తాల పొదుపు ప‌థ‌కాల‌ వ‌డ్డీ రేట్ల‌ను య‌థాత‌థం చేస్తున్న‌ట్లు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. భార‌తీయ తపాలా శాఖ తొమ్మిది ర‌కాల చిన్న మొత్తాల‌ పొదుపు ప‌థ‌కాల‌ను అందిస్తుంది. ఇందులో పొదుపు ఖాతా, రిక‌రింగ్ డిపాజిట్‌(ఆర్‌డీ), టైమ్ డిపాజిట్‌(టీడీ) నెల‌వారి ఆదాయ ప‌థ‌కం, సీనియ‌ర్ సిటిజ‌న్ పొదుపు ప‌థ‌కం, ప్ర‌జా భ‌విష్య నిధి (పీపీఎఫ్), జాతీయ పొదుపు ప‌త్రాలు, కేవీపీ, సుక‌న్య స‌మృద్ది యోజ‌న వంటివి ఉన్నాయి. ఈ ప‌థ‌కాల‌పై వ‌డ్డీ రేట్ల‌ను ప్ర‌తి త్రైమాసికానికి ప్ర‌భుత్వం పున‌రుద్ద‌రిస్తుంది.

పోస్టాఫీసు అందిస్తున్న ప‌థ‌కాలు, వ‌డ్డీ రేట్లు:

  1. పోస్టాఫీసు పొదుపు ఖాతా:
    భార‌త త‌పాలా శాఖ, 1.5 ల‌క్ష‌ల పోస్ట‌ల్ కార్యాల‌యాల‌తో దేశ‌మంత‌టా విస్త‌రించింది. పోస్టాఫీసు సాదార‌ణ పొదుపు ఖ‌తాను రూ.500 కనీస బ్యాలెన్స్‌తో ఎవ‌రైనా తెర‌వ‌వ‌చ్చు. వ్య‌క్తిగ‌త, జాయింట్ ఖాతాల‌కు వార్షికంగా 4 శాతం వ‌డ్డీని అందిస్తుంది.

  2. నేష‌న‌ల్ సేవింగ్స్ రిక‌రింగ్ డిపాజిట్ అక్కౌంట్‌:
    రిక‌రింగ్ డిపాజిట్ (ఆర్‌డీ) ఖాతాను బ్యాంకులో గానీ, పోస్టాఫీసులో గానీ తెరువ‌వ‌చ్చు. కాల‌ప‌రిమితి 5 సంవ‌త్స‌రాలు. రిక‌రింగ్ డిపాజిట్ ఖాతాపై వార్షికంగా 7.2 శాతం వ‌డ్డీ ల‌భిస్తుంది. వ‌డ్డీని త్రైమాసికంగా కాంపౌండ్ చేస్తారు.

  1. నేష‌న‌ల్ సేవింగ్స్‌ టైమ్ డిపాజిట్ ఖాతా:
    పోస్టాఫీసు టైమ్ డిపాజిట్ (టీడీ) ఖాతాను పోస్టాఫీసు ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతా అని కూడా పిలుస్తారు. దీనిలో 4 ర‌కాలుగా, ఒకటి, రెండు, మూడు, ఐదు సంవ‌త్స‌రాల‌కు మెచ్యూరిటీ పిరియ‌డ్‌లు అందుబాటులో ఉన్నాయి. దీనిలో వ‌డ్డీని త్రైమాసికంగా లెక్కిస్తారు. కానీ సంవ‌త్స‌రానికి ఒక సారి వ‌డ్డీ చెల్లిస్తారు. 1,2,3 సంవ‌త్స‌రాల టైమ్ డిపాజిట్ ఖాతాపై 6.9 శాతం, 5 సంవ‌త్స‌రాల ఖాతాకు 7.7 శాతం వ‌డ్డీ ఆఫ‌ర్ చేస్తున్నారు.

  2. పోస్టాఫీసు మంత్లీ ఆదాయం పథకం (ఎమ్ఐఎస్‌) ఖాతా:
    ప్ర‌స్తుత జ‌న‌వ‌రి-మార్చి త్రైమాసికానికి ఈ ఖాతాపై 7.6 శాతం వ‌డ్డీని ఆఫ‌ర్ చేస్తున్నారు. కాల‌ప‌రిమితి 5 సంవ‌త్స‌రాలు. వ‌డ్డీని నెల‌వారీగా చెల్లిస్తారు.

  3. సీనియర్ సిటిజ‌న్‌ పొదుపు పథకం (ఎస్‌సీఎస్ఎస్‌):
    వార్షికంగా 8.6 శాతం వ‌డ్డీ చెల్లిస్తారు. ఈ ప‌థ‌కం బ్యాంకుల‌లో కూడా అందుబాటులో ఉంది. క‌నీస పెట్టుబ‌డి రూ. 1000.

  4. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) ఖాతా:
    వార్షిక వ‌డ్డీ రేటు 7.9 శాతంగా వుంది. సంవ‌త్స‌రానికి ఒకసారి కాంపౌండ్‌ చేస్తారు. ఈ పథ‌కం బ్యాంకుల‌లో కూడా అందుబాటులో ఉంది. క‌నీస పెట్టుబ‌డి రూ.500.

  5. జాతీయ పొదుపు సర్టిఫికేట్లు (ఎన్ఎస్‌సీ):
    వార్షిక వ‌డ్డీ రేటు 7.9 శాతంగా వుంది. దీనిలో వ‌డ్డీని త్రైమాసికంగా లెక్కిస్తారు. కానీ సంవ‌త్స‌రానికి ఒక సారి వ‌డ్డీ చెల్లిస్తారు. దీనిలో 5 సంవ‌త్స‌రాల లాక్ ఇన్ పిరియ‌డ్ ఉంటుంది. రూ.100 విలువ గ‌ల ఎన్ఎస్‌సీకి 5 సంవ‌త్స‌రాల మెచ్యూరీటీ పిరియ‌డ్‌కి గాను రూ. 146.25 వ‌స్తుంది. క‌నీస పెట్టుబ‌డి రూ. 100.

  6. కిసాన్ వికాస్ ప‌త్రా (కేవీపీ)
    వార్షిక వ‌డ్డీ రేటు 7.6 శాతంగా ఉంది. సంవ‌త్స‌రానికి ఒక‌సారి వ‌డ్డీ కాంపౌండ్ చేస్తారు. కేవీపీ మెచ్యూరిటీ పిరియ‌డ్‌ను 118 నుంచి 113 నెల‌ల‌కు త‌గ్గించారు. కేవీపీలో పెట్టుబ‌డి పెట్టిన మొత్తం 113 నెల‌లు(9 సంవ‌త్స‌రాల 5 నెల‌లు)లో రెట్టింపు అవుతుంది. క‌నీస పెట్టుబ‌డి రూ. 1000

  7. సుకన్య స‌మృద్ధి యోజ‌న ఖాతా:
    బాలిక‌ల కోసం ఏర్పాటు చేసిన ప‌థ‌కం. వ‌డ్డీ సంవ‌త్స‌రానికి 8.4 శాతంగా వుంది. సంవ‌త్స‌రానికి ఒక‌సారి వ‌డ్డీ లెక్కిస్తారు, ఈ ప‌థ‌కం బ్యాంకుల‌లో కూడా అందుబాటులో ఉంది. క‌నీస డిపాజిట్ రూ.1000 నుంచి రూ. 250 కి ప్ర‌భుత్వం త‌గ్గించింది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly