పోస్టాఫీస్‌ టైమ్‌ డిపాజిట్‌ ఖాతా

బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ లా పని చేసే పోస్ట్ఆఫీస్ టర్మ్ డిపాజిట్ ఖాతా వివరాలు.

పోస్టాఫీస్‌ టైమ్‌ డిపాజిట్‌ ఖాతా

పోస్టాఫీస్‌ టైమ్‌ డిపాజిట్‌ ఖాతా బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలాంటివే.నిర్దిష్ట కాలానికి ఏకమొత్తంలో పెట్టుబడి పెట్టేవారికోసం రూపొందించింది ఈ పథకం.

టైమ్‌ డిపాజిట్‌కు అర్హత:

 • స్థానిక భార‌తీయులు మాత్ర‌మే ఈ ప‌థ‌కంలో చేరేందుకు అర్హులు.
 • సంర‌క్ష‌కుడి స‌హాయంతో 10ఏళ్లు నిండిన మైన‌ర్లు ఈ ప‌థ‌కంలో పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు.

కనిష్ఠ, గరిష్ఠ పరిమితులు:

 • క‌నీసం రూ.200 పెట్టుబ‌డి పెట్టి ఈ ప‌థ‌కంలో చేరాల్సి ఉంటుంది.
 • పెట్టుబడికి గరిష్ఠ పరిమితి లేదు.

కాలపరిమితి:

 • 1,2,3 లేదా 5 ఏళ్ల కాల‌ప‌రిమితో కూడిన ట‌ర్మ్ డిపాజిట్లు మ‌దుప‌రుల‌కు అందుబాటులో ఉన్నాయి.

రాబడి:

Screen Shot 2017-05-21 at 11.52.32.png

నామినీ సదుపాయం:

ఖాతా ప్రారంభ సమయంలో లేదా ఎప్పుడైనా నామినీని ప్రతిపాదించవచ్చు.

ఖాతా తెరిచే విధానం:

 • ఏదైనా పోస్టాఫీస్ కార్యాల‌యంలో ఖాతాను ప్రారంభించవచ్చు.
 • పూర్తి వివరాలతో నింపిన టర్మ్‌ డిపాజిట్‌ ఫారంతో పాటు గుర్తింపు, చిరునామా పత్రాలు, రెండు ఫొటోలు జతచేయాలి.
 • నగదు లేదా చెక్కు అందించి ఖాతాలో సొమ్ము జ‌మ‌చేయ‌వ‌చ్చు.
 • ముందే ఖాతా కలిగిన వ్యక్తి పరిచయ సంతకం అవ‌స‌ర‌మ‌వుతుంది.
 • టర్మ్‌ డిపాజిట్‌ ఖాతాకు ఒకేసారి డిపాజిట్‌ చేయాలి. అదే ఖాతాకు మరోసారి డిపాజిట్‌ చేసే అవకాశం లేదు.
 • ఒక వ్యక్తి ఎన్ని టైమ్‌ డిపాజిట్‌ ఖాతాలైనా తెరిచేందుకు అవకాశం ఉంది.
  ఖాతా బదిలీ:
 • టర్మ్‌ డిపాజిట్‌ను మరొకరి పేరుపై బదిలీ చేయవచ్చు.
 • మరో పోస్టాఫీసుకు మన ఖాతాను బదిలీ చేయించుకోవచ్చు.

వడ్డీ రేట్లు:

 • ట‌ర్మ్ డిపాజిట్‌లోని పెట్టుబ‌డి పై వడ్డీ వార్షికంగా చెల్లిస్తారు.
 • గ‌డువు తేదీ ముగిశాక విత్‌డ్రా చేయని వడ్డీ సొమ్ము పై అదనంగా ఎలాంటి వడ్డీ జమ కాదు.
 • టైమ్‌ డిపాజిట్‌లో వచ్చే వడ్డీని పొదుపు ఖాతాకు మ‌ళ్లించుకునే వెసులుబాటు ఉంటుంది.

ముందుగా సొమ్మును ఉప‌సంహ‌రించుకోవాలంటే…

 • ఒక సంవత్సరం పూర్తికాక ముందు ఖాతాదారు తన ఖాతాను మూసివేయాలనుకుంటే సాధారణ పొదుపు ఖాతాకు వ‌ర్తించే వడ్డీ జమ చేస్తారు.
 • 2, 3 లేదా 5ఏళ్ల టైమ్‌ డిపాజిట్‌ ఖాతాలను ఒక సంవత్సరం తర్వాత మూసివేయదల్చుకుంటే టైమ్‌ డిపాజిట్‌పై పేర్కొన్న వడ్డీ కంటే 1శాతం తక్కువగా పెట్టుబడిదారుకు చెల్లిస్తారు.
 • 5 ఏళ్ల టైమ్‌ డిపాజిట్‌పై 3 సంవత్సరాల తర్వాత ఖాతా మూసివేయాలనుకుంటే పేర్కొన్న వడ్డీ రేటులో 2 శాతం తగ్గించి ఇస్తారు.
 • మెచ్యూరిటీ ముగిశాక మొత్తం సొమ్ము తీసేసుకొని ఖాతాను మూసివేయవచ్చు.

పన్ను మినహాయింపులు:

 • ఐదేళ్ల టర్మ్‌ డిపాజిట్ పెట్టుబ‌డుల‌పై సెక్షన్‌ 80సీ ప్రకారం గరిష్ఠ సొమ్ము రూ. 1,50,000 వరకూ పన్ను మినహాయింపు ఉంటుంది.
 • వడ్డీపై ఎలాంటి పన్ను రాయితీ లేదు.
 • రూ.50వేలు ఆ పైన లావాదేవీలు జరిపేవారు ఆదాయపు పన్ను చట్టాన్ని అనుసరించి తప్పనిసరిగా పాన్ కార్డు సంఖ్యను పేర్కొనాలి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly