ప్ర‌ధాన మంత్రి ల‌ఘ వ్యాపారి మాన్‌-ధ‌న్ యోజ‌న 2019

అసంఘ‌టిత రంగానికి చెందిన‌ లఘు వ్యాపారుల‌కు వృద్ధాప్య జీవితానికి అవ‌స‌ర‌మైన ఆదాయం కోసం ప్ర‌భుత్వం ఈ సంక్షేమ ప‌థ‌కాన్ని తీసుకొచ్చింది.

ప్ర‌ధాన మంత్రి ల‌ఘ వ్యాపారి మాన్‌-ధ‌న్ యోజ‌న 2019

60 ఏళ్ల వ‌య‌సు త‌ర్వాత‌ నెలవారీ పెన్షన్ / ఆదాయాన్ని అందించడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నమే ప్ర‌ధాన మంత్రి ల‌ఘ వ్యాపారి మాన్‌-ధ‌న్ యోజ‌న 2019. అసంఘ‌టిత రంగానికి చెందిన‌ లఘు వ్యాపారుల‌కు వృద్ధాప్య జీవితానికి అవ‌స‌ర‌మైన ఆదాయం కోసం ఈ సంక్షేమ ప‌థ‌కాన్ని తీసుకొచ్చింది.

ప‌థ‌కం గురించి వివ‌ర‌ణ‌…

 1. జులై 22, 2019 నుంచి ఈ ప‌థ‌కంల అందుబాటులోకి వ‌చ్చింది.

2.ల‌ఘ వ్యాపారులు (చిన్న వ్యాపారులు) ఈ స్కీమ్‌లో చేర‌వ‌చ్చు. చిన్న వ్యాపారులు , దుకాణ‌దారులు, రిటైల్ ట్రేడ‌ర్స్‌, రైస్ మిల్ ఓన‌ర్స్, ఆయిల్ మిల్ ఓన‌ర్స్, వ‌ర్క్ షాప్ ఓన‌ర్స్‌, క‌మీష‌న్ ఏజెంట్స్, బ్రోక‌ర్లు, రియ‌ల్ ఎస్టేట్ బ్రోక‌ర్స్‌, చిన్న హోట‌ళ్లు, రెస్టారెంట్ల య‌జ‌మానులు వంటి వారు ఈ ప‌థ‌కంలో చేర‌వ‌చ్చు.

ఇటువంటి చిన్న వ్యాపారాలు సాధారణంగా కుటుంబ స‌భ్యులతో క‌లిసి చేస్తారు. ఆదాయం త‌క్కువ‌గా, శ్ర‌మ ఎక్కువ‌గా ఉంటుంది. అందుకే వృద్ధాప్యంలో వారికి చేయూత‌ను అందించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ఈ ప‌థ‌కాన్ని అమ‌ల్లోకి తెచ్చింది. ఈ పెన్ష‌న్ ఫండ్ నిర్వ‌హ‌ణ‌ ఎల్ఐసీ తీసుకుంది. అర్హ‌త ఉన్న‌వారికి పెన్ష‌న్ అందిస్తుంది.

పెన్ష‌న్ ఫండ్:

ఈ ప‌థ‌కంలో చేరిన‌వారు పెన్ష‌న్ ఫండ్‌కు స‌బ్‌స్క్రైబ్ చేసుకోవ‌చ్చు. చందాదారుడు ఎంత డిపాజిట్ చేస్తాడో అంతే స‌మానంగా కేంద్ర ప్ర‌భుత్వం పెన్ష‌న్ ఫండ్‌కు చెల్లిస్తుంది.

స్కీమ్‌లో చేరేందుకు అర్హ‌త‌:

ఈ స్కీమ్ కేవ‌లం ల‌ఘ వ్యాపారుల‌కే వ‌ర్తిస్తుంది. అంటే వార్షిక‌ ట‌ర్నోవ‌ర్ రూ.1.5 కోట్లు దాట‌నివారికి ఇందులో చేరే అవ‌కాశం ఉంది. ప్ర‌వేశ‌ వ‌య‌సు 18 సంవ‌త్స‌రాల‌కు పైన ఉండాలి. గ‌రిష్ఠంగా 40 ఏళ్ల‌కు మించి ఉండ‌కూదు. ఎన్‌పీఎస్‌లో చేరిన‌వారికి ఇందులో అర్హ‌త లేదు. ఈఎస్ఐసీ లేదా ఈపీఎఫ్ లో ఉన్న‌వారికి, ప‌న్ను వ‌ర్తించే ఆదాయం క‌లిగిన వారు అర్హులు కారు. చెల్లింపుల్లో ఏదైనా ఆల‌స్యం జ‌రిగితే వ‌డ్డీతో సహా తిరిగి డిపాజిట్ చేసేందుకు అవ‌కాశం ఉంటుంది.

ప్రీమియం వివ‌రాలు:

table.png

పెన్ష‌న్ స్కీమ్ నుంచి ఉప‌సంహ‌రించుకుంటే…

 1. స్కీమ్‌లో చేరిన ప‌దేళ్ల లోపు త‌ప్పుకుంటే అత‌ను చేసిన డిపాజిట్లతో పాటు, పొదుపుఖాతాపై ల‌భించే వ‌డ్డీ రేటును అందిస్తారు.
 2. ప‌దేళ్ల త‌ర్వాత ప‌థ‌కం నుంచి ఉప‌సంహ‌రించుకుంటే 60 ఏళ్లు నిండ‌క‌ముందు అయితే, అప్ప‌టివ‌ర‌కు జ‌మ‌యిన వ‌డ్డీతో పాటు, మొత్తం పెన్ష‌న్ ఫండ్ నుంచి ల‌భిస్తుంది.
 3. రెగ్యుల‌ర్ డిపాజిట్లు చేసి చందాదారుడు మ‌ర‌ణిస్తే అత‌ని భార్య లేదా భ‌ర్త‌ ఈ స్కీమ్ కొన‌సాగించ‌వ‌చ్చు
 4. చందాదారుల‌తో పాటు భార్య లేదా భ‌ర్త కూడా మ‌ర‌ణిస్తే డ‌బ్బు తిరిగి ఫండ్‌లో జ‌మ‌వుతుంది.
 5. పైన చెప్పిన‌ 1,2,3 ల ప్ర‌కారం ఉప‌సంహ‌రించుకుంటే ప్ర‌భుత్వం చేసిన కాంట్రిబ్యూష‌న్ తిరిగి పెన్ష‌న్ ఫండ్‌కు చేరుతుంది.

వైక‌ల్యం సంభ‌విస్తే:

చందాదారుడు క్ర‌మంగా డిపాజిట్లు చేసిన త‌ర్వాత 60 ఏళ్ల‌కు మందు ఏదైనా ప్ర‌మాదం చేత వైక‌ల్యం ఏర్ప‌డితే ఆ త‌ర్వా డిపాజిట్ చేయ‌క‌పోతే వారి జీవిత భాగ‌స్వాములు ఈ ప‌థ‌కాన్ని కొన‌సాగించ‌వ‌చ్చు. రెగ్యుల‌ర్‌గా ప‌థ‌కంలో జ‌మ‌చేయ‌వ‌చ్చు లేదా ఉప‌సంహ‌రించుకుంటే అప్ప‌టివ‌ర‌కువ‌చ్చిన జ‌మ‌చేసిన మొత్తంతో పాటు పెన్ష‌న్ ఫండ్ నుంచి వ‌చ్చిన వ‌డ్డీని పొంద‌వ‌చ్చు.

చందాదారుడు మ‌ర‌ణిస్తే:

ఈ స్కీమ్‌లో కొన‌సాగుతున్న‌ప్పుడు చందాదారుడు మ‌ర‌ణిస్తే ఫ్యామిలీ పెన్ష‌న్ కింద‌ వారి భాగ‌స్వామికి 50 శాతం ల‌భిస్తుంది. ఇది భార్య లేదా భ‌ర్త‌కు మాత్ర‌మే చెందుతుంది.

పెన్ష‌న్ చెల్లింపు:

 1. ఈ స్కీమ్ కింద చందాదారుడు 60 ఏళ్ల త‌ర్వాత ప్ర‌తి నెల రూ.3000 ఎల్ఐసీ నుంచి పెన్ష‌న్‌గా పొందుతాడు.
 2. 18 నుంచి 40 ఏళ్ల లోపు వారు ఇందులో చేర‌వ‌చ్చు. ఆ త‌ర్వాత 60 ఏళ్ల వ‌ర‌కు ఇందులో డిపాజిట్ చేస్తుండాలి. అప్పుడు 60 ఏళ్ల త‌ర్వాత నెల‌కు క‌చ్చితంగా రూ.3 వేల పెన్ష‌న్ ల‌భిస్తుంది.

ఈ స్కీమ్‌లో చేర‌డం ఎలా?

కామ‌న్ స‌ర్వీస్ సెంట‌ర్ (సీఎస్‌సీ) ద్వారా ఈ స్కీమ్‌లో చేర‌వ‌చ్చు. దేశ‌వ్యాప్తంగా మొత్తం 3.50 ల‌క్ష‌ల సీఎస్‌సీ కేంద్రాలు ఉన్నాయి. ఇక్క‌డ ఈ ప‌థ‌కంలో రిజిస్ట‌ర్ చేసుకోవ‌వ‌చ్చు. స‌భ్య‌త్వ న‌మోదు కోసం ప్ర‌భుత్వం ఈ కేంద్రాల‌కు రూ.30 చెల్లిస్తుంది. స‌భ్యులు ఎటువంటి ఛార్జీలు చెల్లించ‌న‌వ‌స‌రం లేదు

మీ ద‌గ్గ‌ర‌లో ఉన్న‌సీఎస్‌సీ కేంద్రాన్నీ ఈ లింక్ ద్వారా తెలుసుకోండి
https://csc.gov.in/statdistrictlist

Toll free no: 1800 3000 3468

లేదా

మీ బ్యాంకును సంప్ర‌దించ‌వ‌చ్చు

చివ‌ర‌గా:

 • ఇది కేంద్ర ప్ర‌భుత్వం ప్రారంభించిన గ్యారంటీ పెన్ష‌న్ స్కీమ్‌
 • ఏదైనా కార‌ణంతో చందాదారుడు డిపాజిట్ చేయ‌డం ఆపేస్తే, అప్ప‌టివ‌ర‌కు జ‌మ చేసిన మొత్తంతో పాటు వ‌డ్డీ ల‌భిస్తుంది.
 • అయితే ఇది సుదీర్గ‌మైన పెట్టుబ‌డి ప‌థ‌కంగా చెప్పుకోవ‌చ్చు. ఎందుకంటే 40 ఏళ్ల వ‌య‌సులో చేరినా ఇంకా 20 ఏళ్లు కాంట్రిబ్యూట్‌ చేయాల్సి ఉంటుంది.
 • స్కీమ్‌కు అనుసంధానం చేసి ఉన్న బ్యాంకు ఖాతాను మూసివేయ‌కూడ‌దు.
 • 20 ఏళ్ల త‌ర్వాత రూ.3 వేల విలువ ద్ర‌వ్యోల్బ‌ణంతో చూస్తే 6 శాతం పెరిగి ఇప్ప‌టి రూ.935 కి స‌మానం
 • వృద్ధాప్యంలో క్ర‌మంగా ఆదాయం పొందేందుకు ఇది మంచి ప‌థ‌కం అని చెప్ప‌వ‌చ్చు.
 • భ‌విష్య‌త్తులో ప్ర‌భుత్వం ప‌థ‌కంలో మ‌రిన్ని మార్పులు చేయ‌వ‌చ్చు. పెన్ష‌న్ మ‌రింత పెంచే అవ‌కాశం ఉంటుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly