దేశ దిగుమతులు..80 శాతం ఇంధ‌నం విదేశాల నుంచే!

పెరుగుతున్న జనాభా, వారి ఆదాయాలతోపాటు అవసరాలు, రోజు రోజుకు వాహనాల వాడకం పెరగదానికి దోహదం చేస్తున్నాయి

దేశ దిగుమతులు..80 శాతం ఇంధ‌నం విదేశాల నుంచే!

భారత దేశం చేసుకునే దిగుమతులలో ముఖ్యమైనవి - ముడి చమురు, బంగారం, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఆహార పదార్ధాలు వంటివి.
ముడి చమురు : పెట్రోల్ , డీజిల్, కిరోసిన్, ఇంజిన్ ఆయిల్, గ్రీజ్ , తారు వంటివి ముడి చమురు నుంచి ఉత్పత్తి అయ్యే పదార్ధాలు. ఇవి ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలకు నిత్యావసరంగా మారిపోయాయి. మన దేశ అవసరాలలో 80 శాతం ముడి చమురు దిగుమతి చేసుకుంటున్నాము. అంతర్జాతీయ మార్కెట్ లను బట్టి ముడి చమురు ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. దిగుమతి కోసం విదేశీ మారక ద్రవ్యం - యు ఎస్ డాలర్ - అవసరం.
వీటిపై పన్నులు - ఎక్సయిజ్ డ్యూటీ ని కేంద్ర ప్రభుత్వం విధిస్తే, వ్యాట్ ను రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్నాయి. ఇవి రాష్ట్రాన్ని బట్టి వేరువేరుగా ఉంటాయి. ఈ కింది పట్టిక ద్వారా ముడి చమురు ఖరీదు వాటిపై పన్నుల వివరాలను తెలుసుకుందాం.

imports.jpg
  • పై ప‌ట్టిక‌లోని పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు దిల్లీలో న‌మోదైనవి

ఈ పన్నులలో అధిక భాగం రాష్ట్ర ప్రభుత్వాలు పొందుతాయి. అందుకని వీటిని జిఎస్టి పరిధిలోకి తీసుకురాలేదు. పెరుగుతున్న జనాభా, వారి ఆదాయాలతోపాటు అవసరాలు, రోజు రోజుకు వాహనాల వాడకం పెరగదానికి దోహదం చేస్తున్నాయి. ఒకచోట నుంచి మరొక చోటకు తమకు అనువైన సమయంలో ప్రయాణించగలగటం. స్వంత వాహనాల వాడకం పెరగడానికి మరొక కారణం, వాహన ఉత్పత్తిదారులు ఇచ్చే రుణం, కొనుగోలుదారులకు వాయిదా పధ్ధతి చెల్లించేందుకు అవకాశం.

మరొక కోణం : స్వంత వాహనాలలో ఉన్న సౌకర్యం వలన వీటి వాడకం పెరిగి, కాలుష్యం, పట్టణాలలో ట్రాఫిక్ సమస్యలు ఎక్కువవుతున్నాయి. కొంతమంది బాధ్యతారాహిత్యంగా వాహనాలను నడపడంవలన అనేక ప్రమాదాలు నిత్యకృత్యాలయ్యాయి. ఇందులో అనేక అమాయక ప్రజలతోపాటు, విద్యావంతులు, ప్రతిభావంతులైన వ్యక్తులుకూడా ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొందరు శాశ్వత వికలాంగులై జీవిస్తున్నారు. దీని ప్రభావం వారి కుటుంబాలపై, పిల్లల భవిష్యత్ ఫై చాలా ప్రభావం చూపుతోంది .

ఉపసంహరణ: సాధ్యంనతవరకు ప్రజారవాణా వ్యవస్థను ఉపయోగించడం మంచిది. స్వంత వాహన కొనుగోలు, నిర్వహణ ఖర్చులకు అయ్యే సొమ్మును , మదుపు చేయడం వలన ఇతర ఆర్ధిక లక్ష్యాలను చేరుకోవడానికి, ఆనందకరమైన జీవితానికి వినియోగించవచ్చు. విదేశీమారక ద్రవ్య ఖర్చును మౌలిక సౌకర్యాలైన స్కూల్స్, రోడ్, మంచినీరు , ఆసుపత్రులు వంటి వాటి కోసం వినియోగించవచ్చు. ఇవి మన జీవన ప్రమాణాలను పెంచుతాయి.
బాధ్యతాయుతమైన పౌరులుగా దేశ అభివృద్ధికి, వ్యక్తిగతంగా కుటుంబానికి అండగా నిలబడదాం .

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly