అత్యాశతో అసలుకే ఇబ్బంది

సాధారంగా కో-ఆపరేటివ్ బ్యాంకులు నష్టపోవటానికి కారణాలు-వృత్తిపరమైన నిర్వహణ లేకపోవడం, పారదర్శకత లోపించడం

అత్యాశతో అసలుకే ఇబ్బంది

నిన్ననే ముంబాయి ఆధారిత పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో-ఆపరేటివ్ బ్యాంకు (పీ ఎం సి బ్యాంకు ) ఫై రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా కొన్ని నిషేధాలను విధించింది. వచ్చే ఆరు నెలల వరకు తమ ఖాతా దారులకు నెలకు రూ 1,000 కంటే అధికంగా సొమ్ము చెల్లంచరాదని చెప్పింది . దీనికి ముఖ్య కారణం పెరిగిపోయిన నిరర్ధక ఆస్తులు. ఆ బ్యాంకు లో రూ 11,600 కోట్ల ఫై చిలుకు మదుపర్ల సొమ్ము ఉంది . ఎటువంటి డిపాజిట్లను తీసుకోరాదని , అలాగే రుణాలను మంజూరు చేయరాదని తెలిపింది. అయితే యధావిధిగా తన కార్యక్రమాలను నిర్వహించుకోవచ్చని తెలిపింది. స్థిరాస్తి వ్యాపారానికి ఇచ్చిన రుణాలు తిరిగిరాకపోవడమే నిరర్ధక ఆస్తుల పెరుగుదల ఒక కారణం. అయితే బ్యాంకు లైసెన్సు ను రద్దు చేయలేదు.
వచ్చే ఆరు నెలలలో బ్యాంకు లోని అవకతవకలను సరిచేసుకుంటామని, ఖాతాదారులు ఎటువంటి భయాందోళనలకు గురికావొద్దని ఆ బ్యాంకు ఎం డి జాయ్ థామస్ తెలిపారు.

సాధారంగా కో-ఆపరేటివ్ బ్యాంకులు నష్టపోవటానికి కారణాలు - వృత్తిపరమైన నిర్వహణ లేకపోవడం, పారదర్శకత లోపించడం వల్ల రుణ మంజూరులో అవకతవకలు జరిగే అవకాశం, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించటానికి యాజమాన్యం సుముఖత చూపకపోవడం, చిన్న పరిమాణం వల్ల అధిక వడ్డీ ఆశ చూపటం మొదలైనవి . అయితే అన్ని సహకార బ్యాంకులను ఒకేలా చూడకూడదు.

ముగింపు:
డిపాజిట్ దారుల కోరుకునేది కచ్చితమైన వడ్డీ తో పాటు అసలు తిరిగి పొందడం. కేవలం వడ్డీ ఆదాయంపై ఆధారపడి జీవించే వారు చాలా మంది ఉన్నారు. అయితే అత్యాశకు పోయి అసలుకూడా నష్టపోయే అవకాశం ఉంటుంది. అందువలన మార్కెట్ లో వాణిజ్య బ్యాంకులు అందించే వడ్డీ కన్నా అధికంగా ఇస్తున్నప్పుడు మొత్తం సొమ్మును ఒకచోటే డిపాజిట్ చేయడం మంచిది కాదు. రెండు లేదా మూడు బ్యాంకులలో డిపాజిట్ చేయడం ద్వారా ఒకచోట ఏదైనా సమస్య ఉన్నా , మిగిలిన బ్యాంకుల నుంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly