మరోసారి తగ్గిన వడ్డీరేట్లు

ఈ ఆర్థిక సంవత్సరంలో నేడు జరిగిన మూడో పరపతి సమీక్ష సమావేశంలో ఆర్‌బీఐ వరుసగా నాలుగో సారి కూడా రెపో రేటును తగ్గించింది

మరోసారి తగ్గిన వడ్డీరేట్లు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఈ రోజు బెంచ్మార్క్ రుణ రేటును 35 బేసిస్ పాయింట్లు మేర తగ్గించింది. దీంతో రుణ వడ్డీరేటు 5.40శాతానికి చేరింది. ఆర్‌బీఐ తీసుకున్న ఈ చర్యతో ఇల్లు, వాహన కొనుగోలుదారులకు ఈఎమ్ఐ తగ్గనుంది. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఆర్‌బీఐ, రేట్ల కోత నిర్ణయాన్ని తీసుకుందని ఆర్‌బీఐ చీఫ్ శక్తికాంత దాస్ తెలిపారు.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో బుధవారం సమావేశమైన ద్రవ్య విధాన కమిటీ, ద్రవ్య విధానంపై 'ఎకామిడేటివ్ ’ వైఖరిని కొనసాగించాలని నిర్ణయించింది. ద్రవ్యోల్బణం వంటి అధిక ఫ్రీక్వెన్సీ సూచికల ఆధారంగా ద్రవ్య విధానాన్ని మరింత సడలించడాన్ని సూచిస్తుంది.

ఈ ఏడాది ఆర్‌బీఐ రెపో రేట్ తగ్గించడం ఇది నాలుగోసారి. ఇంతకు ముందు వరుసగా మూడుసార్లు 25 బేసిస్ పాయింట్ల చొప్పున రెపో రేటును తగ్గించింది .చాలా బ్యాంకులు తమ డిపాజిట్ రేట్లను తగ్గించాయి. దింతో బ్యాంకులు గృహ, ఆటో రుణ రేట్లను తగ్గించేందుకు సాధ్యమవుతుంది.

దేశంలోని అతిపెద్ద బ్యాంకు ఎస్‌బీఐ , తమ పొదుపు ఖాతా రేట్లు, కొన్ని రుణాలను రెపో రేటుకు అనుసంధానించి, బ్యాంకింగ్ వ్యవస్థలో ఆర్‌బీఐ పోలిసిలను అమలుపరిచే దిశగా చర్యలు తీసుకుందని ఆర్‌బీఐ ఛీఫ్ తెలిపారు. ఆర్థిక వ్యవస్థలో సరైన విధంగా ద్రవ్యతను నిర్వహించేందుకు సెంట్రల్ బ్యాంక్ చర్యలు తీసుకుంటుందని ఆర్‌బీఐ ఛీఫ్ తెలిపారు.

ఈ ఆర్థిక సంవత్సరంలో మూడో పరపతి సమీక్ష సమావేశం ఇది. స్వల్పకాల రుణ వడ్డీరేటు 5.40శాతానికి చేరడంతో రివర్స్‌ రెపో రేటు 5.15 వద్దకు చేరింది. 2020 జీడీపీ వృద్ధి రేటును 7శాతం నుంచి 6.9శాతానికి తగ్గించింది. ఆర్థిక వ్యవస్థలో ఉత్సాహం నింపేందుకు ప్రస్తుత వడ్డీరేట్ల తగ్గింపు ఉపకరిస్తుందని ఆర్థిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు.

‘‘ ఆర్థిక వ్యవస్థ కుదురుకోవడానికి వడ్డీరేట్ల తగ్గింపు చాలా కీలకం.’’ అని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా మెరిల్‌ లించ్‌ ఆర్థిక వేత్త ఇంద్రాణి సేన్‌ గుప్తా పేర్కొన్నారు. వాహన విక్రయాలు మందగించడం, మౌలిక రంగ వృద్ధి దిగజారడం, రుతుపవనాలు, స్టాక్‌ మార్కెట్ల క్షీణతపై ఆందోళనల నేపథ్యంలో ఆర్‌బీఐ రేట్ల కోతకు మొగ్గు చూపింది. బ్యాంకర్లందరూ ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్ష ప్రకారం… రుణ రేట్లను సవరించాల్సిందిగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇప్పటికే ఆదేశించారు. కీలక రేట్లు మరోపావు శాతం తగ్గొచ్చని ఎస్‌బీఐ ఛైర్మన్‌ రజనీశ్‌ కుమార్‌ అభిప్రాయపడ్డారు. ఆయన అంచనాలకు మించి వడ్డీరేట్లను తగ్గించారు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly