వ‌డ్డీ రేట్లు త‌గ్గించిన ఆర్‌బీఐ

ద్రైపాక్షిక‌ ద్రవ్య విధాన సమీక్షలో భాగంగా రెపోరేటు పావు శాతం త‌గ్గిస్తూ ఆర్‌బీఐ నిర్ణ‌యం తీసుకుంది.

వ‌డ్డీ రేట్లు త‌గ్గించిన ఆర్‌బీఐ

రిజర్వుబ్యాంకు కీలక వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. రెపో రేటు - ఆర్బిఐ బ్యాంకులకి ఇచ్చే వడ్డీ రేటు 5.75 శాతంగా ఉంటుంది. తటస్థ నుంచి అనుకూలమైన రీతికి రిజ‌ర్వుబ్యాంకు మార్చింది. ఈ సారి రేటు త‌గ్గింపు 25 బేసిస్ పాయింట్లు ఉంటుంద‌ని చాలామంది ఆర్థికవేత్తలుఅంచనా వేశారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో జ‌రిగిన రెండో ద్రైపాక్షిక‌ ద్రవ్య విధాన సమీక్షలో భాగంగా రిజ‌ర్వు బ్యాంక్ ద్రవ్య విధాన కమిటీ ఈ రేటు త‌గ్గింపును ఇచ్చింది.

రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్ నెలలో 0.06 శాతం పెరిగి 2.92 శాతానికి చేరింది. ఈ అర్ధ‌వార్షికంలో న‌మోదైన‌ అత్యధిక ద్రవ్యోల్బణం ఇదే. వరుసగా వ‌రుస‌గా తొమ్మిదవ నెలలో వినియోగదారుల‌ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం, రిజ‌ర్వు బ్యాంకు మ‌ధ్య‌కాల లక్ష్యం 4% కంటే తక్కువగా న‌మోదైంది.

జాతీయ గ‌ణాంకాల కార్యాల‌యం (సిఎస్ఓ) శుక్రవారం విడుదల చేసిన గణాంకాలు ప్రకారం జనవరి-మార్చి త్రైమాసికంలో జీడీపి వృద్ధి రేటు 5.8 శాతానికి తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం (2018-19) న‌మోదైన వృద్ధి రేటు 6.8% గ‌త ఐదు సంవత్సరాల క‌నిష్టంగా న‌మోదైంది.

రిజ‌ర్వు బ్యాంకు సీపీఐ ద్రవ్యోల్బణం 4 శాతానికి +/- 2% స్థాయిలో ఉంచ‌డం ద్వారా మ‌ధ్య‌కాల లక్ష్యాన్ని చేరుకోవటానికి స‌మీక్ష‌లో నిర్ణ‌యాలు తీసుకుంటుంది. ఈ సంవత్సరానికి ద్రవ్య లోటు 3.39% వద్ద ఉంది, నిర్దేశించుకున్న లక్ష్యానికి 3.4శాతానికి స‌మీపంలో ఉంది. అయితే ప్రభుత్వం ఖర్చులో రూ. 24.57 లక్షల కోట్లను సవరించిన రూ.23.4 లక్షల కోట్ల మేరకు తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం నుంచి ద్రవ్య లోటు కోసం ప్రభుత్వం లక్ష్యంగా మారలేదు.

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly