ఏటీఎంల‌ను గోడ‌ల‌కు బిగించండి- బ్యాంకుల‌ను కోరిన ఆర్‌బీఐ

నేరాలు జ‌రిగ‌న‌ప్పుడు త‌క్ష‌ణ‌మే స్పందించేందుకు గానూ ఈ-నిఘా వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేయాల‌ని ఆదేశించింది

ఏటీఎంల‌ను గోడ‌ల‌కు బిగించండి- బ్యాంకుల‌ను కోరిన ఆర్‌బీఐ

ఏటీఎం కేంద్రాల్లో దొంగతనాలు పెరుగుతున్నందున, వాటిని సురక్షితంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) శుక్ర‌వారం బ్యాంకులను ఆదేశించింది. విమానాశ్రయాలు,కేంద్ర-రాష్ట్ర భద్రతా బలగాలతో కూడిన అధిక భద్రత ఉండే ప్రాంతాలు, సీసీ టీవీలు ఉన్న ప్రాంతాలు మినహా, మిగిలిన కేంద్రాల్లో ఏటీఎంలను గోడ, స్తంభం, ఫ్లోరింగ్‌లోకి బిగింప చేయాలని కోరింది.

నగదు రవాణా, సరఫరా వ్యవస్థలను సురక్షితంగా ఉంచేందుకు ఏం చేయాలనే అంశంపై 2016లో క‌రెన్సీ మూమెంట్‌(సీసీఎమ్‌) క‌మిటీని ఆర్‌బీఐ నియమించింది. ఈ కమిటీ సిఫారసుల మేరకు ఏటీఎమ్‌ల వ‌ద్ద లావాదేవీలు సుర‌క్షితంగా నిర్వ‌హించుకునేందుకు వీలుగా భ‌ద్ర‌త ప‌టిష్టం చేసేందుకు ఆర్‌బీఐ ఈ ఆదేశాలిచ్చింది.

ఏటీఎంలలో నగదు భర్తీకి సంబంధించి, డిజిటల్‌లో ఒకసారి మాత్రమే వచ్చే సంఖ్య (ఓటీసీ)తో కూడిన తాళాలను తప్పనిసరిగా వాడాలని కోరింది. సూచించిన నిబంధ‌న‌ల మేర‌కు సంబంధించిన ప‌నుల‌ను సెప్టెంబరు 30 తేదీ నాటికి పూర్తి చేయాలని నిర్ధేశించింది.

అంతేకాకుండా, ఏటీఎంల వ‌ద్ద స‌మ‌గ్ర ఈ-నిఘా వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేయాల‌ని, తద్వారా ఏదైనా నేర ఘటనలు జరిగినపుడు వెంటనే స్పందించేందుకు వీలవుతుందని సూచించింది. ప్రస్తుత భద్రతా చర్యలకు అదనంగా ఆర్‌బీఐ కొత్త సూచ‌న‌ల‌ను కూడా బ్యాంకులు పాటించాల్సి ఉంది. నిర్దేశిత సమయంలోగా పనులు జరగకపోతే, జరిమానాలు తప్పవని హెచ్చరించింది.

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly