డెబిట్‌, క్రెడిట్ కార్డుల‌కు ఆర్‌బీఐ కొత్త నియ‌మాలు

అందుబాటులో ఉన్న అన్ని ఛానెల్స్ ద్వారా 24 గంట‌లూ కార్డు ఆన్, ఆఫ్ సేవ‌లు అందుబాటులో ఉంటాయి

డెబిట్‌, క్రెడిట్ కార్డుల‌కు ఆర్‌బీఐ కొత్త నియ‌మాలు

గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా కార్డుల ద్వారా జ‌రిగే లావాదేవీలు సంఖ్య‌, విలువ రెండూ కూడా పెరుగుతూనే వ‌స్తున్నాయి. ఇక‌పై కూడా పెరుగుతూనే ఉంటాయిని నిపుణులు అంటున్నారు. అందువ‌ల్ల క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల‌ వినియోగ‌దారులకు మెరుగైన సేవ‌ల‌ను అందుబాటులో ఉంచేందుకు, అదేవిధంగా లావాదేవీల భ‌ద్ర‌త‌ను పెంచేందుకు రిజ‌ర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) కొన్ని కొత్త నిబంధ‌న‌లను బుధ‌వారం జారీ చేసింది.

క్రెడిట్‌, డెబిట్ కార్డుల‌కు ఆర్‌బీఐ జారీ చేసిన కొత్త నియ‌మాలు:

  • కార్డు జారీ/ పున‌రుద్ధ‌ర‌ణ చేసేప్పుడు భార‌త‌దేశంలోని ఏటీఎమ్‌లు, పాయింట్ ఆఫ్ సేల్‌(పీఓఓస్‌) కేంద్రాల వ‌ద్ద మాత్ర‌మే దేశీయ కార్డు లావాదేవీల‌ను అనుమ‌తించాల‌ని ఆర్‌బీఐ బ్యాంకుల‌ను కోరింది.
  • అంతర్జాతీయ లావాదేవీలు, ఆన్‌లైన్ లావాదేవీలు, కార్డ్-లేని లావాదేవీలు, కాంటాక్ట్‌లెస్ లావాదేవీల కోసం, వినియోగదారులు తమ కార్డుపై ప్ర‌త్యేక‌మైన‌ సేవలను ఏర్పాటు చేసుకోవాలి.
  • ఈ నియ‌మాలు మార్చి16, 2020 నుంచి కొత్త కార్డులు తీసుకున్న వారికి వర్తిస్తాయి. పాత కార్డు హోల్డ‌ర్లు ఈ సేవ‌లు వ‌ద్ద‌నుకుంటే నిలిపివేయ‌వ‌చ్చు.
  • ఇప్పటికే ఉన్న డెబిట్, క్రెడిట్ కార్డులు విష‌యంలో, కార్డుల‌ను జారీ చేసిన‌ సంస్థ‌లు, వారు తీసుకునే రిస్క్ ఆధారంగా అంత‌ర్జాతీయ లావాదేవీలు, కాంటాక్ట్‌లెస్ ట్రాన్సాక్షన్స్, కార్డ్ నాట్ ప్రజెంట్ ట్రాన్సాక్షన్లకు అనుమతించాలా…రద్దు చేయాలా… అనే నిర్ణ‌యం తీసుకుంటాయి.
  • వినియోగ‌దారులంద‌రికీ 24x7 కార్డు ఆన్, ఆఫ్ సేవల అందుబాటులో ఉంటాయి. దీంతో పాటు లావాదేవీల ప‌రిమితిని కూడా ఎప్పుడైనా మార్చుకోవచ్చు. ఈ సేవ‌ల‌ను మొబైల్ అప్లికేష‌న్‌/ ఇంట‌ర్‌నెట్ బ్యాంకింగ్‌/ ఏటీఎమ్‌/ ఇంట‌రేక్టీవ్ వాయిస్ స‌ర్వీస్‌(ఐవీఆర్‌) వంటి అందుబాటులో ఉన్న అన్ని చాన‌ళ్ళ ద్వారా పొంద‌చ్చు.
  • అయితే, ప్రీపెయిడ్ గిఫ్ట్ కార్డులు, మాస్ ట్రాన్సిట్ సిస్టమ్స్ యూజ‌ర్ల‌కు ఈ నిబంధనలు తప్పనిసరి కాదు.
  • సైబ‌ర్ మోసాలు పెరుగుతున్న నేఫ‌థ్యంలో ఆర్‌బీఐ తాజా సూచ‌న‌లు ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకున్నాయి.

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly