య‌థాత‌ధంగా వ‌డ్డీ రేట్లు

2019-20 ఆర్థిక సంవ‌త్స‌రం జీడీపీ అంచ‌నాల‌ను 6.1 శాతం నుంచి 5 శాతానికి ఆర్‌బీఐ త‌గ్గించింది

య‌థాత‌ధంగా వ‌డ్డీ రేట్లు

ఆర్‌బీఐ కీల‌క ప‌ర‌ప‌తి విధాన స‌మీక్ష నిర్ణ‌యాల‌ను వెల్ల‌డించింది. ఈ ద్వైమాసికానికి కీల‌క వ‌డ్డీ రేట్ల‌లో ఎటువంటి మార్పులు చేయ‌కూడ‌ద‌ని నిర్ణయించింది. దీంతో రెపోరేటు 5.15 శాతంగా కొన‌సాగనుంది. మ‌రోవైపు రివ‌ర్స్ రెపోరేటు 4.90 శాతం వ‌ద్ద‌, బ్యాంకు రేటు 5.40 శాతం వ‌ద్ద కొన‌సాగుతాయి. ఆర్‌బీఐ కీల‌క వ‌డ్డీ రేట్ల‌ను త‌గ్గిస్తుంద‌ని రేటు రేటులో 25 బేసిస్ పాయింట్ల‌ మేర కోత విధిస్తుంద‌ని ఆర్థిక వేత్తలు అంచ‌నా వేశారు. అంద‌రి అంచ‌నాల‌కు విరుద్దంగా ఆర్‌బీఐ రెపోరేటులో ఎటువంటి మార్పు చేయ‌లేదు. ప‌రిస్థితుల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని వ‌డ్డీ రేట్ల‌ను య‌థాత‌థంగా కొన‌సాగించాల‌ని ద్ర‌వ్య‌ ప‌ర‌ప‌తి విధాన క‌మిటి స‌భ్యులు ఏక‌గ్రీవంగా నిర్ణ‌యించారు.

ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో మంద‌గ‌మ‌నం కొన‌సాగుతున్న నేప‌థ్యంలో 2019-20 ఆర్థిక సంవ‌త్స‌రం జీడీపీ అంచ‌నాల‌ను 6.1 శాతం నుంచి 5 శాతానికి ఆర్‌బీఐ త‌గ్గించింది.

ద్ర‌వ్యోల్భ‌ణం స్వ‌ల్ప కాలానికి పెర‌గ‌వ‌చ్చని క‌మిటీ అంగీక‌రించింది. అయితే వ‌డ్డీ రేట్ల‌లో ఈ సారికి మార్పు అవ‌స‌రం లేద‌ని ద్ర‌వ్య ప‌ర‌ప‌తి విధాన క‌మిటీ అభిప్రాయ ప‌డింది. ద్ర‌వ్యోల్భ‌ణం అదుపులో ఉన్నంత వ‌ర‌కూ, వృద్ధి రేటు పుంజుకునే వ‌ర‌కూ అకామిడేటీవ్ విధానాన్న కొన‌సాగించాల‌ని నిర్ణ‌యించింది.

ఈ సంవత్సరం ప్రారంభం నుంచి ఆర్‌బీఐ ఐదుసార్లు వ‌డ్డీ రేట్లలో కోత విధించింది. వడ్డీ రేటు తగ్గింపులు భారతదేశ ఆర్థిక వ్యవస్థను 2013 నాటి క‌నిష్ట వృద్ధి రేటు దిశ‌గా వెళ్ళ‌కుండా ఆప‌లేక‌పోయాయి. ఇప్పటివరకు 135 బేసిస్ పాయింట్ల మేర సెంట్రల్ బ్యాంక్ రెపో రేటును తగ్గించింది.

జూన్-సెప్టెంబర్ త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ 4.5 శాతం వార్షిక వృద్ధి రేటును న‌మోదు చేసింది. గ‌త ఆరు సంవ‌త్స‌రాల‌లో ఇదే క‌నిష్ట వృద్ధి రేటు.

ద్ర‌వ్యోల్భ‌ణం స్వ‌ల్ప‌కాలానికి పెర‌గొచ్చ‌ని ప‌ర‌ప‌తి విధాన క‌మిటీ తెలిపింది. అయితే ఇది 2020-21 రెండో అర్ధ భాగానికి నిర్దేశిత ల‌క్ష్యం కంటే త‌క్కువ‌గానే ఉంటుంద‌ని పేర్కొంది. అందువ‌ల్ల ద్ర‌వ్యోల్భ‌ణంపై స్ప‌ష్ట‌త పొందేందుకు డేటాను జాగ్ర‌త్త‌గా ప‌ర్య‌వేక్షిచడం అవ‌స‌రం. అదేవిధంగా ప్రభుత్వం చేప‌ట్టాల్సిన త‌దుప‌రి చ‌ర్య‌లు, వృద్ధిపై వాటి ప్ర‌భావం గురించి రాబోయే యూనియ‌న్ బ‌డ్జెట్ అవ‌గాహ‌న క‌ల్పిస్తుంద‌ని ఆర్‌బీఐ పేర్కొంది

సిరి లో ఇంకా

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly