నోట్ల విలువ‌ను గుర్తిచేందుకు కొత్త యాప్‌..

ఈ అప్లికేష‌న్‌ను ఒక‌సారి మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసుకుంటే, ఆఫ్‌లైన్‌లోనూ యాప్ ప‌నిచేస్తుంద‌ని ఆర్‌బీఐ తెలిపింది

నోట్ల విలువ‌ను గుర్తిచేందుకు కొత్త యాప్‌..

కంటి చూపు లేని వారు, దృష్టిలోపం ఉన్న‌వారు క‌రెన్సీ నోట్ల విలువ‌ను గుర్తించేందుకు వీలుగా రిజ‌ర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) ఒక కొత్త యాప్‌ను తీసుకొచ్చింది. ఆర్‌బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత్‌దాస్ బుధ‌వారం ఈ యాప్‌ను లాంచ్ చేశారు.

ఈ యాప్‌ను ఉప‌యోగించి కంటి చూపు లేని వారు కూడా క‌రెన్సీ నోట్ విలువ‌ను సుల‌భంగా గుర్తించ‌గ‌ల‌గ‌ని ఆర్‌బీఐ తెలిపంది. ఈ అప్లికేష‌న్‌ను ఒక‌సారి మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసుకుంటే, ఆఫ్‌లైన్‌లోనూ యాప్ ప‌నిచేస్తుంద‌ని సెంట్ర‌ల్ బ్యాంక్ తెలిపింది.

మ‌ని(ఎమ్ఏఎన్ఐ- మొబైల్ ఎయిడెడ్ నోట్ ఐడెంటిఫైయ‌ర్‌) పేరుతో ప్రారంభించిన ఈ అప్లికేష‌న్‌ను ఆండ్రాయిడ్ ప్లే స్టోర్‌, ఐఓఎస్ యాప్ స్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. మొబైల్‌లోని కెమెరా సాయంతో క‌రెన్సీ నోట్ల‌ను ఈ అప్లికేష‌న్ ద్వారా స్కాన్ చేస్తే వాటి విలువ‌ను హిందీ, ఆంగ్ల భాష‌ల్లో ఆడియో రూపంలో తెలియ‌జేస్తుంది.

పెద్ద నోట్ల ర‌ద్దు తరువాత కేంద్ర బ్యాంక్ , సైజులు డిజైన్‌లో నిర్థిష్ట మార్పులు చేసి మ‌హాత్మా గాంధీ సిరీస్‌లో 2016లో ప‌లు ర‌కాల క‌రెన్సీ నోట్ల‌ను ప్ర‌వేశ‌పెట్టింది. ఈ సీరీస్‌లో భాగంగా రూ.10,రూ.20, రూ.50, రూ.100, రూ.200, రూ.500, రూ.2000 నోట్ల‌ను గ‌త రెండు సంవ‌త్స‌రాల‌లో విడుద‌ల చేసింది. అయితే ఈ కొత్త‌ నోట్ల విలువ‌ను గుర్తించ‌డంలో దృష్టిలోపం ఉన్న వారు స‌మ‌స్య‌లు ఎదుర్కుంటున్నారు. ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు ఆర్‌బీఐ ఈ కొత్త యాప్‌ను తీసుకొచ్చింది. ఈ యాప్, నోట్ నిజ‌మైన‌దా…న‌ఖిలిదా…అనే విష‌యం తెలియ‌జేయ‌ద‌ని ఆర్‌బీఐ తెలిపింది.

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly