ప్రాక్టో, ఆర్బీఎల్ కో బ్రాండెడ్ హెల్త్ క్రెడిట్ కార్డు..

ప్రాక్టో, ఆర్బీఎల్ బ్యాంకు మొబైల్ యాప్స్, వెబ్‌సైట్ల ద్వారా ఈ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు

ప్రాక్టో, ఆర్బీఎల్ కో బ్రాండెడ్ హెల్త్ క్రెడిట్ కార్డు..

దేశీయ ప్రైవేట్ రంగ బ్యాంకు ఆర్బీఎల్, డిజిటల్ హెల్త్‌ కేర్ ప్లాట్‌ఫాం అయిన ప్రాక్టో భాగస్వామ్యంతో సరికొత్త కో బ్రాండెడ్ హెల్త్ క్రెడిట్ కార్డును ప్రారంభించింది. ఈ క్రెడిట్ కార్డ్ మాస్టర్ కార్డ్ భాగస్వామ్యంతో అందుబాటులోకి రానుంది. ప్రాక్టో, ఆర్బీఎల్ బ్యాంకు మొబైల్ యాప్స్, వెబ్‌సైట్ల ద్వారా ఈ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇది అనుభవజ్ఞులైన, అర్హత కలిగిన వైద్యులతో అపరిమిత 24*7 ఆన్‌లైన్ కన్సల్టేషన్, ఒక ఉచిత ఫుల్ బాడీ చెక్ అప్ వంటి ప్రయోజనాలను అందిస్తుంది. అలాగే కార్డు వినియోగదారులు ఇతర కొనుగోళ్ల ద్వారా సంపాదించిన రివార్డ్ పాయింట్లను ఆన్లైన్ లో మందులు కొనుగోలు చేయడం, టెస్ట్ లు, ఆన్‌లైన్ కన్సల్టేషన్ వంటి ప్రాక్టో సర్వీసుల కోసం రెడీమ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా, ఈ కార్డు ప్రతి త్రైమాసికంలో రెండు కాంప్లిమెంటరీ ఎయిర్ పోర్ట్ లాంజ్ యాక్సెస్ లను కూడా అందిస్తుంది.

ఈ కార్డు వినియోగదారులకు వారి నెలవారీ ఆరోగ్య ఖర్చులను ప్రాక్టో ప్లాట్‌ఫామ్‌లో సబ్సిడీతో అందిచడంతో పాటు, రోజువారీ ఖర్చులకు ఉపయోగపడుతుందని ప్రాక్టో వైస్ ప్రెసిడెంట్, బిజినెస్ హెడ్ తరుణ్ భంబ్రా తెలిపారు.

భారతదేశంలో డిజిటల్ హెల్త్‌కేర్ మార్కెట్ విపరీతంగా పెరుగుతోంది. ఇది 2022 నాటికి 372 బిలియన్ డాలర్లకు చేసురుకునే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం భారతదేశంలో రోగులు వారి ఆరోగ్య అవసరాలను ఎప్పటికప్పుడు నిర్వహించడానికి అనుమతించే ఏకైక ప్లాట్ ఫారం ప్రాక్టో ఒక్కటే కావడం విశేషం.

సిరి లో ఇంకా

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly