రిలయన్స్‌ ఇండస్ట్రీస్ 42వ వార్షిక సర్వసభ్య సమావేశంలోని కీల‌క అంశాలు

రిలయన్స్‌ ఆయిల్‌ టు కెమిక‌ల్స్(ఓటీసీ) డివిజన్‌లో 20శాతం వాటాల కోసం సౌదీ అరమ్‌కో పెట్టుబడులు పెడుతుందని రియ‌ల‌న్స్ ఇండ‌స్ట్రీస్ అధినేత ప్ర‌క‌టించారు.

రిలయన్స్‌ ఇండస్ట్రీస్ 42వ వార్షిక సర్వసభ్య సమావేశంలోని కీల‌క అంశాలు

ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన డిజిటల్‌ కంపెనీగా జియో ఉందని రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ అన్నారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్ 42వ వార్షిక సర్వసభ్య సమావేశం ముంబయిలోని బిర్లా మాతుశ్రీ సభాగర్‌లో సోమవారం జరిగింది. ఈ సమావేశంలో కంపెనీ ఛైర్మన్‌ ముకేశ్ అంబానీ ప్రసంగించారు.

ఈ స‌మావేశంలో ముకేశ్ అంబానీ మాట్లాడుతూ…

గతేడాది అత్యధిక లాభాలు ఆర్జించిన సంస్థగా రిలయన్స్‌ రికార్డు సృష్టించిందని తెలిపారు. ప్రైవేట్ రంగంలో అత్యధికంగా క‌స్ట‌మ్స్‌, ఎక్సైజ్ సుంకాలు చెల్లించేవారిగా కొనసాగుతున్నాము. భార‌త్‌లో అతిపెద్ద ఎగుమ‌తిదారుగా రియ‌ల‌న్స్ ఇండ‌స్ట్రీస్ ప్ర‌ధాన పాత్ర పోషిస్తుంది.

 • జియో ఫైబ‌ర్ వినియోగ‌దార్లు ఉచితంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్ స‌బ్‌స్క్రిప్ష‌న్ పొందొచ్చు. అయితే దీని గురించి పూర్తి వివ‌రాలు వెల్ల‌డించాల్సి ఉంది.

 • రానున్న 18 నెల‌ల్లో రిల‌య‌న్స్ సంస్థ‌ను నిక‌ర రుణాలు లేని సంస్థ‌గా చేసేందుకు మార్గ‌ద‌ర్శ‌కాలు సిద్ధం చేసుకున్న‌ట్లు పేర్కొన్నారు. గ‌త సాధార‌ణ వార్షిక స‌మావేశం(ఏజీఎం) నుంచి ఇప్ప‌టికీ మార్కెట్ లో రిల‌య‌న్స్ షేర్లు 20 శాతం వృద్ధి చెందాయి.

 • న్యూ కామ‌ర్స్ ద్వారా 700 బిలియన్ డాలర్ల వ్యాపార అవకాశం అని ముఖేష్ అంబానీ అన్నారు. న్యూ కామ‌ర్స్ ఉద్దేశ్యం అసంఘటిత రిటైల్‌ను వ్యవస్థీకృత రిటైల్‌గా మార్చడం. దేశవ్యాప్తంగా కిరాణా దుకాణాలను డిజిటల్‌గా అనుసంధానించే చొరవతో రిలయన్స్ న్యూ కామర్స్ ను ఆర్‌ఐఎల్ రిటైల్ విభాగం త్వరలో ఆవిష్కరిస్తుంది.

 • జియో ఫైబర్ వినియోగదారులకు ల్యాండ్‌లైన్ ఫోన్ కనెక్షన్ ఉచితంగా లభిస్తుంది. జియో ఐఓటీ సేవలు 2020 జనవరి 1 న మార్కెట్లోకి రానున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

 • వినియోగదారు మార్కెట్లో జియో రిటైల్‌ అద్భుత ఫలితాలు సాధిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన డిజిటల్‌ ప్లాట్‌ఫాంగా రిలయన్స్‌ జియో ఎదిగింది.

 • రిలయన్స్ జియోఫోన్ 2కు మెరుగైన ఫీచ‌ర్ల‌ను జోడించి జియోఫోన్ 3 ను కూడా ఆర్ఐఎల్‌ విడుదల చేయనుంది.

 • ప్ర‌స్తుతం జియో ఖాతాదారుల సంఖ్య 34కోట్లు దాటింద‌ని, 2030 నాటికి భారత్‌ 10 ట్రిలియన్ల ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని ముఖేశ్ అభిప్రాయ‌ప‌డ్డారు.

 • రిలయన్స్ జియో బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను మూడు కీలకమైన విభాగాల‌లో విడుదల చేస్తుంది - బేస్-ప్యాక్ (బ్రాడ్‌బ్యాండ్ మాత్రమే), బండిల్డ్ ప్యాక్ (బ్రాడ్‌బ్యాండ్‌ + టివీ ఆఫ‌ర్ చేస్తుంది), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) పరికరాలతో హై-ఎండ్ కన్వర్జ్డ్ ప్యాక్.

 • సౌదీ అరేబియాకు చెందిన సౌదీ అరమ్‌కో తమ కంపెనీలో దీర్ఘకాల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం కుదిరిందని ముఖేశ్ అంబానీ తెలిపారు.

 • రిలయన్స్‌ ఆయిల్‌ టు కెమిక‌ల్స్ డివిజన్‌లో సౌదీ అరమ్‌కో 20శాతం వాటాల కోసం పెట్టుబడులు పెడుతుందని చెప్పారు. 75 బిలియన్‌ డాలర్ల(దాదాపు రూ. 5.25 ల‌క్ష‌ల కోట్లు)తో ఈ ఒప్పందం జరిగినట్లు వెల్లడించారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో ఇదే అతిపెద్ద సంయుక్త భాగస్వామ్యమని అన్నారు.

 • సెప్టెంబరు 5 నాటికి జియో ఆవిష్కరించి మూడేళ్లు పూర్తవుతుంది. అదే రోజున జియో ఫైబర్‌ సేవలను కమర్షియల్‌ బేసిస్‌లో ప్రారంభిస్తున్న‌ట్లు, అంత‌ర్జాతీయ రేట్ల‌తో పోలిస్తే 1/10 వంతు ధ‌ర‌కే ఈ సేవ‌ల‌ను ప్రారంభిస్తున్న‌ట్లు ముకేశ్ అంబానీ తెలిపారు.

 • జియోగిగాఫైబ‌ర్ కోసం1.5 కోట్ల రిజిస్ట్రేష‌న్లు 1600 నగరాల నుంచి న‌మోదుఅయ్యాయి. అయితే 2కోట్ల నివాసాలు, 1.5కోట్ల వ్యాపార భవనాలకు జియో ఫైబర్‌ను అందించాలనేది కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

 • ప్రారంభ ఆఫర్‌ కింద ఫరెవర్ వార్షిక ప్లాన్‌ తీసుకునే జియో ఫైబర్‌ కస్టమర్లు హెచ్‌డీ/ 4కే ఎల్‌ఈడీ టీవీ, సెట్‌టాప్‌ బాక్సును ఉచితంగా పొంద‌వ‌చ్చు. ప్రారంభించిన మూడేళ్ళలోపే, జియో ఇటు ఆదాయ పరంగా నంబర్ వన్ ఆపరేటర్‌గానూ, చందాదారుల సంఖ్య పరంగా రెండవ అతిపెద్దదిగా ఆప‌రేట‌ర్‌గా అవ‌త‌రించింది.

 • వాస్తవానికి, జూలై 2018 రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చివరి వార్షిక సర్వసభ్య సమావేశంలో, చైర్మన్ ముఖేష్ అంబానీ, మాట్లాడుతూ… రిలయన్స్ జియో గిగా ఫైబర్ ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ ఫిక్స్‌డ్-లైన్ బ్రాడ్‌బ్యాండ్ రోల్ అవుట్‌గా ప్రకటించారు. భారతదేశంలోని 1,600 నగరాల్లో ఈ సేవను ప్రారంభించాలని కంపెనీ భావిస్తోంద‌ని తెలిపారు.జియో గిగాఫైబ‌ర్ కోసం గ‌త ఆగ‌ష్టులోనే రిజిస్ట్రేష‌న్ల ప‌క్రియ‌ను కంపెనీ ప్రారంభించింది.

 • డెన్ నెట్‌వర్క్స్ లిమిటెడ్, హాత్వే కేబుల్, డాటాకామ్ లిమిటెడ్‌లో మెజారిటీ వాటాను, రూ.5,230 కోట్ల‌కు కొనుగోలు చేయ‌నున్న‌ట్లు రిల‌య‌న్స్ గ‌త అక్టోబ‌ర్‌లోనే తెలిపింది. ఈ చ‌ర్య జియోగిగాఫైబ‌ర్‌పై అంచ‌నాల‌ను పెంచింది. ఈ పెట్టుబడుల ద్వారా డెన్, హాత్వేతో అనుసంధాన‌మైయున్న‌ 27 వేల‌ స్థానిక కేబుల్ ఆపరేటర్ల క‌స్ట‌మ‌ర్ల‌తో క‌న‌క్ట్ అయ్యేందుకు అత్యుత్తమ బ్యాక్ ఎండ్ మౌలిక సదుపాయాలు, కంటెంట్ ప్రొడ్యూసర్లర్లు, డిజిటల్ మౌలిక సదుపాయాలలో పెట్టుబడులు పెట్టాలని యోచిస్తున్నట్లు జియో తెలిపింది.

 • మా స్థానిక కేబుల్ ఆప‌రేట‌ర్లుకు గిగాఫైబ‌ర్ హోమ్స్‌కి యాక్సిస్ ఉంటుంద‌ని, బ్రాడ్‌కాస్ట్ సేవ‌ల ద్వారా ఆదాయం పొంద‌చ్చు అని అంబానీ చెప్పారు. వైర్డ్ బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్ వృద్ధికి అధికంగా అవ‌కాశాలు ఉన్నాయి, టెలికాం రెగ్యూలేట‌ర్ డేటా ప్ర‌కారం మే చివ‌రి నాటికి 56.252 కోట్ల చందాదారుల‌లో కేవలం 1.845 కోట్ల చందాదారులు మాత్ర‌మే వైర్డ్ బ్రాడ్‌బ్యాండ్‌ను ఉప‌యోగిస్తున్నారు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly