భార‌త మార్కెట్‌లోకి రియ‌ల్‌మి 3ప్రో

ప్రారంభ ఆఫర్‌ కింద హెచ్‌డీఎఫ్‌సీ కార్డు ద్వారా కొనుగోలు చేసేవారు అదనంగా మరో రూ.1000 డిస్కౌంట్‌ను పొందవచ్చు.

భార‌త మార్కెట్‌లోకి రియ‌ల్‌మి 3ప్రో

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ త‌యారీ సంస్థ రియ‌ల్‌మి స‌రికొత్త స్మార్ట్‌ఫోన్ రియ‌ల్‌మి 3ప్రోను ప్ర‌వేశ‌పెట్టుంది. సోమ‌వారం న్యూధిల్లీలో జ‌రిగిన ఒక కార్య‌క్ర‌మంలో ఈ ఫోన్‌ను విడుద‌ల చేసింది. 4జీబీ/64జీబీ వేరియంట్ ప్రారంభ ధ‌ర రూ.13,999గా నిర్ణయించింది. ఎప్రిల్ 29 వ తేది మధ్యాహ్నం 12 గంట‌ల నుంచి సేల్ ప్రారంభంకానుంది. ప్ర‌త్యేకంగా ప్లిప్‌కార్ట్ ద్వారా మాత్ర‌మే ఈ ఫోన్‌లు అందుబాటులో ఉండ‌నున్నాయి.

రియల్‌మి3ప్రో రెండు వేరియంట్లలో లభిస్తోంది. 4జీబీ ర్యామ్‌ 64జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌, 6జీబీ ర్యామ్‌ 128జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో ఈ మొబైల్‌ రానుంది. హైఎండ్‌ వేరియంట్‌ ధరను రూ.16,999గా నిర్ణయించారు. కార్బన్‌ గ్రే, నిట్రో బ్లూ, లైటినింగ్‌ పర్పల్‌ రంగుల్లో ఇది లభ్యం కానుంది. ప్రారంభ ఆఫర్‌ కింద హెచ్‌డీఎఫ్‌సీ కార్డు ద్వారా కొనుగోలు చేసేవారు అదనంగా మరో రూ.1000 డిస్కౌంట్‌ను పొందవచ్చు.

రియ‌ల్‌మి 3ప్రో ఫీచ‌ర్లు:

  • 6.3ఫుల్‌హెచ్‌డీ డిస్‌ప్లే, వాటర్‌ డ్రాప్‌ నాచ్‌, స్క్రీన్‌గార్డ్‌తో, 2.5డీ కార్నింగ్‌ గోరిల్లా గ్లాస్‌ 5ప్రొటెక్షన్‌తో ల‌భిస్తుంది.
  • ఆండ్రాయిడ్‌ 9.0 (కలర్‌ ఓఎస్‌ 6.0), స్నాప్‌డ్రాగన్‌ 710 ప్రాసెసర్‌, 4జీబీ ర్యామ్‌, 64జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్(రూ.13,999)‌, 6జీబీ ర్యామ్‌, 128జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్(రూ.16,999), డ్యుయల్‌ సిమ్‌ స్లాట్‌, మైక్రో ఎస్డీ సాయంతో 256జీబీ వరకూ మెమొరీని పెంచుకునే వెసులుబాటు ఉంటుంది.
  • వెనుకవైపు 16+5మెగాపిక్సెల్‌ డ్యుయల్‌ కెమెరా సెటప్‌, ముందువైపు 25మెగాపిక్సెల్‌ సెల్ఫీ కెమెరాల‌తో వ‌స్తుంది. కెమెరా యాప్‌లో నైట్‌స్కేప్‌, స్పీడ్ షాట్‌లు ఉండ‌డం వ‌ల్ల ఇంటి లోప‌ల‌, బ‌య‌టి మంచి క్వాలిటీ ఫోటోలు తీసుకోవ‌చ్చు.
  • 4045ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఒప్పో వూక్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్ ఉండ‌డం వ‌ల్ల 10 నిమిషాలు చార్జ్ చేస్తే 5 గంట‌లు మాట్లాడు కోవ‌చ్చు.

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly