రిల‌య‌న్స్ రిటైల్ హెల్త్ ఇన్యూరెన్స్ విస్త‌ర‌ణ‌

రిల‌య‌న్స్ క్యాపిట‌ల్ ఆరోగ్య బీమా విభాగాన్ని విస్త‌రించ‌నుంది.

రిల‌య‌న్స్ రిటైల్ హెల్త్ ఇన్యూరెన్స్  విస్త‌ర‌ణ‌

రిలయన్స్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ నుంచి ఆరోగ్య బీమా విభాగాన్ని వేరుచేసి వ్యాపారాన్ని విస్త‌రింప‌జేయ‌నున్న‌ట్లు రిల‌య‌న్స్ క్యాపిట‌ల్ ప్ర‌క‌టించింది. ఇందుకు రిలయన్స్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ(ఆర్‌జీఐఎల్‌) బోర్డు డైరెక్టర్ల నుంచి ఆమోదం లభించింది. అయితే బీమా రంగ నియంత్రణాధికార సంస్థ ఐఆర్‌డీఏఐ నుంచి ఇంకా అనుమ‌తి రావ‌ల‌సి ఉంది.

ఈ కంపెనీ కూడా రిలయన్స్‌ క్యాపిటల్‌కు పూర్తి అనుబంధ సంస్థ‌గా ఉండ‌నుంది. బీమా విబాగంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించేందుకుగాను ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు కంపెనీ వివ‌రించింది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly