క్లౌడ్ సేవ‌ల విస్త‌ర‌ణ‌కు మైక్రోసాఫ్ట్ తో రిలయన్స్ ఒప్పందం

దేశంలో క్లౌడ్ సేవ‌ల విస్త‌ర‌ణ‌కు రిలయన్స్ ఇండ‌స్ట్రీస్, మైక్రోసాఫ్ట్ అజ్యూర్ క్లౌడ్ ప్లాట్‌ఫామ్ ను వినియోగించి దేశ‌మంతా డేటా సెంట‌ర్ల‌ను విస్తరించ‌నుంది.

క్లౌడ్ సేవ‌ల విస్త‌ర‌ణ‌కు మైక్రోసాఫ్ట్ తో  రిలయన్స్ ఒప్పందం

దేశంలో క్లౌడ్ సేవ‌ల విస్త‌ర‌ణ‌కు మైక్రోసాఫ్ట్ అజూర్ క్లౌడ్ ప్లాట్‌ఫామ్‌తో భాగస్వామం చేసుకుంటున్న‌ట్లు రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ పేర్కొంది. అమెజాన్.కామ్, ఆల్ఫాబెట్ గూగుల్ క్లౌడ్ సర్వీసు ప్రొవైడర్లకు సవాలుగా జియో టెలికాం ఈ భాగ‌స్వామ్యం చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. పదేళ్ల కాలం పాటు మైక్రోసాఫ్ట్ అజూర్ క్లౌడ్‌లో హోస్ట్ చేసే జియో దేశం అంతటా డేటా సెంటర్లను నిర్మిస్తుందని రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ చెప్పారు. అన్ని భారతీయ భాషలు మాండలికాలకు స్పీచ్ రిక‌గ్నైజేష‌న్, నేచుర‌ల్ లాంగ్వేజ్ అండ‌ర్‌స్టాండింగ్ వంటి సాంకేతిక‌త‌, దేశంలో ఉన్న‌ స‌మ‌స్య‌ల‌కు పరిష్కారాలను అభివృద్ధి చేసే సామర్ధ్యం త‌మ‌కు ఉంద‌ని ఆయ‌న పేర్కొన్నారు.

క్లౌడ్ సర్వీసెస్ మార్కెట్లోకి రిలయన్స్ ప్రవేశించడం ముఖ్యంగా వెబ్‌సైట్ హోస్టింగ్, డేటా స్టోరేజ్ వంటి కంప్యూటర్ సేవలను అమ్మడం - అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఎడబ్ల్యుఎస్) ఆధిపత్యంలో ఉన్న భారతీయ మార్కెట్లో పోటీని తీవ్రతరం చేస్తుందని విశ్లేషకులు అంటున్నారు. అంబానీ ఎప్పుడూ జియోను టెక్నాలజీ కంపెనీగా పిలుస్తారు. దీని ద్వారా ఇంటర్నెట్ అనుసంధానిత పరికరాలను ప్రారంభించడానికి, వినోద సేవలను అందించడానికి, ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్‌ను నిర్మించడానికి ఇతర సేవ‌ల‌ను అభివృద్ధి చేయడానికి ఉపయోగించారు. రిలయన్స్-మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యం ద్వారా జియో సేవ‌లు భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న స్టార్ట‌ప్ కంపెనీలు విస్తరించడానికి సహాయపడుతుంది.

రెండు సంస్థ‌లు క‌లిసి కంప్యూట్, స్టోరేజ్ నుంచి అనుసంధాన‌త‌, ఉత్పాదకత వరకు, దేశంలో ఉన్న చిన్న, మధ్యస్థ వ్యాపారాలకు సమగ్ర సాంకేతిక పరిష్కారాలను అందిస్తామని రికార్డ్ చేసిన వీడియో సందేశం ద్వారా రిలయన్స్ వాటాదారులను ఉద్దేశించి మైక్రోసాఫ్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సత్య నాదెల్లా తెలిపారు.

సిరి లో ఇంకా

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly