ఆర్‌బీఐ త‌గ్గింపు ఈఎమ్ఐల‌పై ఉంటుందా?

రెపోరేటు త‌గ్గ‌డం, బ్యాంకులో భ‌విష్య‌త్తులో ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లు త‌గ్గించే అవ‌కాశం ఉంది. అయితే ఇది త‌గ్గించిన రెపోరేటు అనుగుణంగా ఉండ‌క‌పోవచ్చు.

ఆర్‌బీఐ త‌గ్గింపు ఈఎమ్ఐల‌పై ఉంటుందా?

కొత్త ఆర్థిక సంవ‌త్స‌రంలో జ‌రిగిన మొద‌టి ద్ర‌వ్య ప‌ర‌ప‌తి స‌మీక్షా స‌మావేశంలో రిజ‌ర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు త‌గ్గించి 6 శాతంగా నిర్ణ‌యించింది. అయితే ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో కూడా రెపోరేటును 6.50 శాతం నుంచి 6.25 శాతానికి 25 బేసిస్ పాయింట్లు త‌గ్గించిన సంగతి తెలిసిందే. తాజాగా మ‌రో పావు శాతం మేర త‌గ్గిస్తూ ఆర్‌బీఐ నిర్ణ‌యం తీసుకుంది. అయితే ఈ ప్ర‌భావం రుణాల‌ పై చెల్లించే ఈఎమ్ఐల‌పై ఉంటంది. త‌గ్గించిన రెపో రేటు డిపాజిట్ రేట్ల‌పై ప్ర‌భావం చూపించ‌నుంది. అయితే ఇది కొత్త‌గా డిపాజిట్ చేసే వారికి మాత్ర‌మే వ‌ర్తిస్తుంది. అధిక వ‌డ్డీ రేటు వ‌ద్ద డిపాజిట్ చేసిన వారికి మెచ్యూరిటీ స‌మ‌యం వ‌ర‌కు అదే వ‌డ్డీరేటు కొన‌సాగుతుంది. రెపోరేటు త‌గ్గ‌డం, బ్యాంకులో భ‌విష్య‌త్తులో ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లు త‌గ్గించే అవ‌కాశం ఉంది. అయితే ఇది త‌గ్గించిన రెపోరేటు అనుగుణంగా ఉండ‌క‌పోవచ్చు. ఆర్‌బీఐ బెంచ్మార్క్ రెపో రేటును తగ్గించడంతో, రిటైల్ వినియోగదారుల‌కు ఈఎమ్ఐలలో తగ్గింపు కొంత మేర‌కు ఉంటుంది. అయితే ఇది వెంట‌నే జ‌ర‌గ‌దు. ఎందుకంటే గృహ రుణాల వంటి ఫ్లోటింగ్ రేట్ రిటైల్ రుణాలు ఎమ్సీఎల్ఆర్ ప్రాతిపాదిక‌న ఇస్తున్నారు. రెపో రేట్ త‌గ్గించిన‌పుడు ఆ ప్ర‌భావం ఎమ్‌సీఎల్ఆర్ పై ప్ర‌భావం త‌క్కువ‌గానే ఉంటుంది. ఎందుకంటే ఎమ్‌సీఎల్ఆర్ లెక్కింపులో బ్యాంకుల‌కు అయ్యే నిధుల వ్యయంలో డిపాజిట్ రేట్లను కూడా లెక్కిస్తారు. రెపో రేటు త‌గ్గిన‌పుడు బ్యాంకుల‌కు వ‌చ్చే ఆదాయం కూడా త‌గ్గుతుంది. అందువల్ల, బ్యాంకుల ఎమ్‌సీఎల్ఆర్ రేట్ల త‌గ్గింపు స్వ‌ల్పంగానే ఉంటుంది. ఇతర కారణం గృహ‌రుణాల‌కు ఒక రీసెట్ తేదీ ఉంటుంది. ఆ తేదీ నుంచి కొత్త రేటు అమ‌ల్లోకి వస్తుంది. సాధారణంగా ఈ రీసెట్ సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది. బ్యాంకులు ఎమ్‌సీఎల్ఆర్ ను తగ్గించినప్పటికీ రుణ‌గ్ర‌హీత‌ల తదుపరి రీసెట్ తేదీ నుంచి మాత్రమే ఈ త‌గ్గింపు ప్రభావం కనిపిస్తుంది.

ఉదాహరణకు, గృహ రుణాన్ని 1-సంవత్సర ఎమ్సీఎల్ఆర్ ఆధారంగా తీసుకుని రీసెట్ తేదీ కాల‌ప‌రిమితి ఒక సంవ‌త్స‌రం పెట్టుకుంటే, జనవరిలో తేదీని రీసెట్ చేస్తే, మ‌ళ్లీ తిరిగి వచ్చే ఏడాది జనవరిలో రీసెట్ చేసేందుకు వీలు అవుతుంది. వడ్డీరేట్లపై ప్రభావం రీసెట్ తేదీ నుంచి మాత్ర‌మే చూపుతుంది. ఈ స‌మ‌యంలో రిజ‌ర్వు బ్యాంకు రెండుసార్లు రెపో రేటును తగ్గించినా వినియోగ‌దారుల‌కు త‌మ రీసెట్ తేదీ ఆధారంగానే రేట్లు అమ‌ల‌వుతాయి .

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly