7.35 శాతానికి పెరిగిన రిటైల్ ద్ర‌వ్యోల్భ‌ణం

గ‌త నెల డిసెంబ‌రులో రిటైల్ ద్ర‌వ్యోల్భ‌ణం ఐదున్న‌రేళ్ళ గ‌రిష్ట స్థాయికి చేరుకుంది. 2014 జులై త‌రువాత ఈ స్థాయిలో పెరుగుద‌ల న‌మోదు కావ‌డం ఇదే తొలిసారి.

7.35 శాతానికి పెరిగిన రిటైల్ ద్ర‌వ్యోల్భ‌ణం

పెరుగుతున్న ఆహార ధ‌ర‌లు కార‌ణంగా రిటైల్ ద్ర‌వ్యోల్భ‌ణం ఒక్క‌సారిగా పెరిగింది. గ‌త నెల డిసెంబ‌రులో ఇది 7.35 శాతంగా న‌మోదైంది. న‌వంబ‌రు 2019లో 5.54 శాతంగా న‌మోదైన రిటైల్ ద్ర‌వ్యోల్భ‌ణం డిసెంబ‌రులో ఆందోళ‌నక‌ర స్థాయిలో 7.35 శాతానికి పెరిగింది. డిసెంబ‌రు 2018లో ఇది 2.11శాతం మాత్ర‌మే న‌మోదైంది.

కూర‌గాయల ద్ర‌వ్యోల్బ‌ణం న‌వంబ‌రు 2019లో 36 శాతం పెరుగ‌గా, ఇది డిసెంబ‌రు 2019లో 60.5 శాతం పెరుగుదల న‌మోదు చేసింది. ప్ర‌భుత్వ గ‌ణాంకాల ప్ర‌కారం ఆహార ద్ర‌వ్యోల్భ‌ణం డిసెంబ‌రులో 14.12 శాతం పెరుగ‌గా, 2018 ఇదే నెల‌లో (-)2.65 శాతంగా న‌మోదైంది. ఇది న‌వంబ‌రు,2019లో 10.01 శాతంగా ఉంది.

రిటైల్ ద్ర‌వ్యోల్భ‌ణం 4 శాతానికి 2 శాతం అటుఇటుగా ఉంచాల‌ని రిజ‌ర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాకు కేంద్ర ప్ర‌భుత్వం నిర్దేశించిన ల‌క్ష్యం. అయితే రిటైల్ ద్ర‌వ్యోల్భ‌ణం సౌక‌ర్య‌వంతంగా ఉంటుంద‌ని భావించిన స్థాయిని మించి ప్ర‌స్తుత ద్ర‌వ్యోల్భ‌ణం ఉంది.

దాదాపు 50 మంది ఆర్థిక వేత్త‌ల స‌గ‌టు అంచ‌నా ప్ర‌కారం భార‌త‌దేశ వార్షిక వినియోగ‌దారుల ద్ర‌వ్యోల్భ‌ణం న‌వంబ‌రులో 5.54 శాతం న‌మోదుకాగా ఇది డిసెంబ‌రులో 6.2 శాతానికి పెరిగింది.

ద్ర‌వ్యోల్భ‌ణాన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్‌బీఐ డిసెంబ‌రులో వ‌డ్డీ రేట్ల‌ను మార్చ‌లేదు. కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ యూనియ‌న్‌బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టిన కొద్ది రోజుల‌కే అంటే ఫిబ్ర‌వ‌రి 6న కేంద్ర బ్యాంక్ త‌న త‌దుప‌రి విధాన స‌మీక్షా స‌మావేశాన్ని నిర్వ‌హించి వ‌డ్డీ రేట్ల‌పై నిర్ణ‌యం తీసుకోనుంది. ఆర్‌బీఐ విధాన ప‌ర‌మైన నిర్ణ‌యాలు తీసుకోవ‌డంలో రీటైల్ ద్ర‌వ్యోల్భ‌ణం ముఖ్యపాత్ర పోషిస్తుంది.

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly