ఎన్పీఎస్ తో పదవీవిరమణ నిధిని సమకూర్చుకుందామా

పదవీవిరమణ అనంతర జీవితానికి నెలసరి / వార్షిక ఖర్చులు, పెన్షన్ ద్వారా నెలకు వచ్చే మొత్తం, నెలకు/ సంవత్సరానికి ఇంకా ఎంత మొత్తం కావాలో చూద్దాం.

ఎన్పీఎస్ తో  పదవీవిరమణ నిధిని సమకూర్చుకుందామా

ముందుగా, పదవీవిరమణ అనంతర ఆదాయం గురించి తెలుసుకుందాం. మనకు ఉన్న ఆర్ధిక లక్ష్యాలలో మరొక ముఖ్యమైనది - పదవీవిరమణ అనంతర ఆదాయం. చాలా మంది దీని గురించి పట్టించుకోరు . ఇంకా చాలా కాలం ఉందని , పీఎఫ్ లో ప్రతి నెలా జీతం నుంచి మదుపు చేయబడుతోందని అంటారు. ఎప్పుడో 30 సంవత్సరాల తరువాతి ఆదాయం గురించి ఇప్పుడు ఆలోచించనవసరం లేదని, పదవి విరమణ నాటికి బోలెడు సంపాదిస్తామని , ఇలా రకరకాల ఆలోచనలతో స్వల్పకాలిక లక్ష్యాల కొరకు ఖర్చుచేస్తుంటారు. అయితే మారుతున్న జీవన ఖర్చులు, జీవన ప్రమాణాలకు పీ ఎఫ్ లో చేస్తున్న మదుపు సరిపోదని గ్రహించము. ఏదేని కారణాల వలన అనుకున్న నిధిని సమకూర్చుకోలేక పోవడం గానీ , అవసరానికి తగినంత ఆదాయం గానీ లేకపోతే ఆ వయసులో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దానికి తోడు ఆరోగ్య సమస్యలు ఎదురైతే మరీ ఇబ్బంది. సరైన సంపాదన ఉండదు, పిల్లల మీద ఆధారపడలేము, ఎందుకంటే వారికి వారి కుటుంబ బాధ్యతలు ఉంటాయి కాబట్టి. దీనికి ఒక మార్గం ఎన్ పీ ఎస్ లో మదుపు చేయడం.

ఎన్ పీ ఎస్ గురించి ఈ కధానాలలో తెలుసుకోండి:
http://eenadusiri.net/NPS-Auto-Active-Choices-tfXKFPv
http://eenadusiri.net/Know-the-process-of-opening-an-NPS-Account-XYIGZ08

ఈ పధకం లో మదుపు చేస్తే ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు చూద్దాం. ఉదా : మాధవి మాధవ్ భార్యాభర్తలు. మాధవ్ వయసు 30 ఏళ్ళు. వారి నెలసరి ఖర్చులు రూ 20 వేలు. మాధవ్ తన 60 వ ఏట పదవీవిరమణ చేద్దామనుకుంటున్నాడు. ఆ తరువాత కూడా వారు ఇదే జీవన ప్రమాణంతో ఉండాలనుకుంటున్నారు. దీని ప్రకారం 6 శాతం ద్రవ్యోల్బణంతో, వారికి 30 సంవత్సరాల తరువాత మొదటి సంవత్సరంలో నెలకు రూ 1,15,000 (వార్షికంగా రూ13.80 లక్షలు)అవసరమవుతాయి. పదవీవిరమణ తరువాత వారి జీవిత కాలం 20 ఏళ్లు , అంటే వారికి 80 సంవత్సరాల వయసు వరకు ఉంటారని అంచనా వేశారు. మొత్తం జీవిత కాలానికి 6 శాతం ద్రవ్యోల్బణాన్ని పరిగణలోకి తీసుకున్నారు. పదవీవిరమణ అనంతర కాలానికి 8 శాతం రాబడి అంచనా వేయడమైనది.
ఈ కింది పట్టిక ద్వారా పదవీవిరమణ అనంతర జీవితానికి నెలసరి / వార్షిక ఖర్చులు, పెన్షన్ ద్వారా నెలకు వచ్చే మొత్తం, నెలకు/ సంవత్సరానికి ఇంకా ఎంత మొత్తం కావాలో చూద్దాం.

NPS 1.jpg

దీని ప్రకారం పదవీవిరమణ నిధిని రూ 2 కోట్ల 40 లక్షలుగా అంచనా వేయడమైనది. ఈ నిధి కోసం వారు పీ ఎఫ్ , ఎన్పీఎస్ మార్గాలను ఎంచుకున్నారు. ఇందుకోసం వారు ఎన్ పీ ఎస్ లో నెలకు రూ 5 వేలతో మొదలు పెట్టి, ప్రతి సంవత్సరం 5 శాతం పెంచుకుంటూ వెళతారు. దీర్ఘకాలంలో పది శాతం రాబడి అంచనాతో , 30 సంవత్సరాల తరువాత రూ 1 కోటి 80 లక్షలు జమ అవుతుంది . ప్రస్తుత నియమాల ప్రకారం 40 శాతం అంటే రూ 72 లక్షలు పెన్షన్ పథకంలో తప్పనిసరిగా ఉంచాలి. దీనిద్వారా వారికి నెలకు రూ 45 వేలు అందుతుంది.
మిగిలిన 60శాతం మొత్తం అంటే రూ 1 కోటి ఎనిమిది లక్షలను+ పీ ఎఫ్ ద్వారా పదవీవిరమణ నాటికి జమ అయ్యే రూ 67 లక్షలను కలిపి వివిధ ఇతర పథకాలలో మదుపు చేసి నెలసరి ఆదాయం పొందవచ్చు.

NPS 2.jpg

ఈ కింది పట్టిక ద్వారా నెలవారీ ఆదాయం కోసం ఎ నిధి నుంచి ఎంత జమ అవుతుందో తెలుసుకుందాం.

NPS 3.jpg

ముగింపు:
మదుపు చేయడం ఎంత తొందరగా మొదలుపెడితే దీర్ఘకాలంలో అధిక రాబడి పొందవచ్చు. ఆలస్యం చూసినకొద్దీ నెలవారీ చేయవలసిన మదుపు మొత్తం పెరుగుతుంది. సులభంగా అర్ధమయ్యేందుకు వెయ్యి రూపాయల దగ్గర చూపించడమైనది . ఈక్విటీలలో కచ్చితమైన వార్షిక రాబడి ఉండదు. అయితే దీర్ఘకాలంలో అధిక రాబడి ఆశించవచ్చు. CAGR పద్దతిలో వార్షిక రాబడి 10 శాతంగా గణించబడింది. ఇప్పుడు మనకు ఈ మొత్తాలు అధికంగా కనిపించవచ్చు. దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఇలాగే ఉంటాయి. ఉదా : పది, ఇరవై సంవత్సరాల క్రితం ఉన్న ధరలను ప్రస్తుత ధరలతో పోలిస్తే మీకు అవగాహన ఏర్పడుతుంది. క్రమశిక్షణ, పట్టుదలతో మదుపు చేస్తే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly