ఈపీఎఫ్ గురించి ప్ర‌తీ ఉద్యోగి తెలుసుకోవాల్సిన 5 అంశాలు

ఈపీఎఫ్ ఖాతా ప్ర‌భుత్వ నిర్వ‌హ‌ణ‌లో ఉంటుంది కాబ‌ట్టి పెట్టుబ‌డులు సుర‌క్షితంగా ఉంటాయి.

ఈపీఎఫ్ గురించి ప్ర‌తీ ఉద్యోగి తెలుసుకోవాల్సిన 5 అంశాలు

ఉద్యోగుల‌కు ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత ఆర్థిక భ‌ద్ర‌త‌ను క‌ల్పించే ఉద్దేశంతో ప్ర‌భుత్వం ఈపీఎఫ్ ప్రారంభించింది. దీనిపై వ‌డ్డీ రేట్లు ఇత‌ర చిన్న పొదుపు ప‌థ‌కాల‌తో పోలిస్తే ఎక్కువ‌గానే ఉన్నాయి.

1. ఎంత డిపాజిట్ చేయాలి

ప్రతి ఉద్యోగి వారు ప‌ని చేసే సంస్థ‌లో ఈపీఎప్ఓలో న‌మోదు చేసుకోవాలి. ఉద్యోగి ప్రాథ‌మిక వేత‌నం+ డీఏ నుంచి 12 శాతం ఈ ఖాతాలోకి చేరుతుంది. సంస్థ కూడా అంతే మొత్తం వాటాను ఈ ఖాతాలో డిపాజిట్ చేస్తుంది. ఇంకా కావాల‌నుకుంటే ఉద్యోగి పూర్తి బేసిక్ వేత‌నం, డీఏను కూడా డిపాజిట్ చేసుకోవ‌చ్చు. అయితే ఇది వాలంట‌రీ ప్రావిడెంట్ ఫండ్ (వీపీఎఫ్) కి చేరుతుంది. వీపీఎఫ్, ఈపీఎఫ్ కి కొన‌సాగింపు వంటిది. దీనికి కూడా ఈపీఎఫ్‌ నిబంధ‌న‌లే వ‌ర్తిస్తాయి.

2. సుర‌క్షిత‌మైన పెట్టుబ‌డులు

ఫండ్ మీద ప్ర‌భుత్వం క‌చ్చిత‌మైన రాబ‌డిని అందిస్తుంది కాబ‌ట్టి, ఎలాంటి ఆందోళ‌న‌ అవ‌స‌రం లేదు. మీ డ‌బ్బు సుర‌క్షితంగా ఉంటుంది.

3. ప‌న్ను విధానం

ఈపీఎఫ్ నిబంధ‌న‌ల ప్ర‌కారం త‌ప్ప‌నిస‌రిగా డిపాజిట్ చేయ‌వ‌ల‌సిన 12 శాతం వాటాకు ఎలాంటి ప‌న్ను వ‌ర్తించ‌దు. అయితే ఇది ఈపీఎఫ్ ప్రారంభించిన 5 సంవ‌త్స‌రాల త‌ర్వాత‌నే అమ‌లవుతుంది. ఐదేళ్ల‌కి ముందు ఖాతా నుంచి డ‌బ్బు తీసుకుంటే దానిని ఆదాయంగా ప‌రిగ‌ణించి వారి ప‌న్ను శ్లాబు ప్ర‌కారం ప‌న్ను విదిస్తారు.

4. ఈపీఎఫ్ ఉప‌సంహ‌ర‌ణ‌

ఈపీఎఫ్‌లో పూర్తి డ‌బ్బు ఉప‌సంహ‌రించుక‌నేందుకు,

  • సంస్థ నిబంధ‌న‌ల ప్ర‌కారం ఉద్యోగ ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సు వ‌చ్చి ఉండాలి.
  • ఉద్యోగం కోల్పోయి లేదా మానేసి 60 రోజులు పూర్త‌వ్వాలి.
  • ఈపీఎఫ్ అనేది దీర్ఘ‌కాలానికి పెట్టుబ‌డుల కోసం ప్రారంభించారు. దీనిని మధ్య‌లో నిలిపివేయ‌డాన్ని ఈపీఎఫ్ఓ ప్రోత్స‌హించ‌దు. అయితే కొన్ని త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో అంటే ఇంటి రుణం చెల్లించేందుకు లేదా ఇంటిని కొనుగోలు చ‌సేందుకు, కుటుంబ స‌భ్యుల పెళ్లికి లేదా పిల్ల‌ల ఉన్న‌త చ‌దువుల కోసం, అత్య‌వ‌స‌ర చికిత్స కోసం పాక్షికంగా కొంత డ‌బ్బును తీసుకోవ‌చ్చు.

5. నిర్వ‌హ‌ణ సుల‌భం

  • ప్ర‌త్యేక ఖాతా సంఖ్య (యూఏఎన్‌) , ఈపీఎఫ్ ఖాతా ప్రారంభించేందుకు సంస్థ‌లు త‌మ ఉద్యోగుల‌కు యూఏఎన్ నంబ‌ర్ ఇస్తాయి. అన్ని ఈపీఎఫ్ సేవ‌ల‌కు ఈ సంఖ్య ఉప‌యోగ‌ప‌డుతుంది.
  • ఖాతా నిర్వ‌హ‌ణ కార్య‌క‌లాపాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ఆన్‌లైన్‌లో www.epfindia.gov.in వెబ్‌సైట్ ద్వారా యూఏఎన్ సాయంతో ప‌రిశీలించుకోవ‌చ్చు
  • ఉద్యోగం మారిన‌ప్పుడు వేరే సంస్థ‌లో యూఏఎన్ నంబ‌ర్ ఇస్తే చాలు. ఖాతాను య‌ధావిధిగా కొన‌సాగించే అవ‌కాశం ఉటుంది.
  • ఈపీఎఫ్ ప్రారంభించే స‌మ‌యంలోనే నామినేష‌న్ స‌దుపాయం ఉంటుంది. మీరు ఎవ‌రినీ నామినీగా చేయాల‌నుకుంటున్నారో వారి పేరును నమోదు చేయ‌వ‌చ్చు. ఏదైనా అనుకోని ప్ర‌మాదం వ‌ల‌న ఉద్యోగి మ‌రిణించిన‌ట్లయితే ఖాతాలోని డ‌బ్బు నామినీకి చెందుతుంది. నామినీని న‌మోదు చేయ‌క‌పోతే కుటుంబ స‌భ్యుల‌కు అందిస్తారు. కుటుంబ స‌భ్యులు సంస్థ ద్వారా క్లెయిమ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly