అందుబాటు ధ‌ర‌లో ఇళ్ల‌కు పెరిగిన డిమాండ్

అంద‌రికీ ఇళ్లు అని ప్రభుత్వం తీసుకొచ్చిన ప్ర‌తిపాద‌న‌తో రూ.45 ల‌క్ష‌ల లోపు విలువ గృహాల‌కు డిమాండ్ భారీగా పెరిగిపోయింది.

అందుబాటు ధ‌ర‌లో ఇళ్ల‌కు పెరిగిన డిమాండ్

రూ.45 ల‌క్ష‌ల లోపు గృహ నిర్మాణాలు బిల్డ‌ర్ల‌తో పాటు, కొనుగోలుదారుల‌కు కూడా మంచి అవ‌కాశంగా మారాయి. మధ్యతరగతి ప్రజలు సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు ప్రోత్సహించేలా 2019 బడ్జెట్‌కు రూపకల్పన చేశారని స్థిరాస్తి నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రూ.45 లక్షల్లోపు ఇళ్లు కొనుక్కునేవారికి దాదాపు రూ.3.5 లక్షల వ‌ర‌కు ఆదాయ పన్ను రాయితీ లభించేలా బ‌డ్జెట్‌లో కీలక నిర్ణయం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. గత కొన్నేళ్ల‌ నుంచి నిర్మాణ సంస్థలు ఎదుర్కొంటున్న నిధుల కొరతను తీర్చేందుకు కేంద్రం ప్రయత్నించిందని అంటున్నారు. స్థిరాస్తి డెవ‌ల‌ప‌ర్లు అందుబాటు ధ‌ర‌లో ఉన్న గృహ విభాగంపై దృష్టి సారించారు.

మొద‌టిసారి ఇళ్లు కొనుగోలు చేస్తున్న‌వారికి ప్ర‌భుత్వం జీఎస్‌టీని 8 శాతం నుంచి 1 శాతానికి త‌గ్గించి మ‌రింత ప్రోత్స‌హిస్తోంది. అదేవిధంగా రూ.45 ల‌క్ష‌ల లోపు (60 చ‌ద‌ర‌పు మీట‌ర్లు మెట్రో న‌గ‌రాల్లో, ఇత‌ర ప్రాంతాల‌లో 90 చ‌ద‌ర‌పు మీట‌ర్లు ) విలువ చేసే గృహాల‌పై రూ.3.5 ల‌క్ష‌ల వ‌ర‌కు వ‌డ్డీ రేటు మిన‌హాయింపును ప్ర‌క‌టించింది. గ‌తంలో ఇది రూ.2 ల‌క్ష‌లుగా ఉండేది.

ఈ ర‌క‌మైన గృహాల‌కు ప‌న్ను మిన‌హాయింపుల‌తో పాటు అందుబాటు ధ‌ర‌లో ఉండ‌టంతో డిమాండ్ కూడా పెరిగింది. టైర్ 1, టైర్ 2 ప‌ట్ట‌ణాల్లో ముఖ్యంగా ఈ ఇళ్ల కొనుగోలు పెరుగుతున్నాయి. ముంబ‌యి, దిల్లీ, పూనె వంటి మెట్రోపాలిట‌న్ న‌గరాల్లో వీటి డిమాండ్ బాగా పెరిగిపోయింది.

సిరి లో ఇంకా

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly