విద్యుత్ వాహ‌నాల‌కు రిజిస్ర్టేష‌న్ రుసుము ర‌ద్దు?

విద్యుత్ వాహ‌నాల‌ను ప్రోత్స‌హించ‌డంలో భాగంగా ప్ర‌భుత్వం ఈ ప్ర‌తిపాద‌న‌ను తీసుకొచ్చింది.

విద్యుత్ వాహ‌నాల‌కు రిజిస్ర్టేష‌న్ రుసుము ర‌ద్దు?

పర్యావరణ కాలుష్యం అంతకంతకూ పెరుగుతున్నందున, ఉద్గారాలు వెదజల్లని విద్యుత్తు వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న సంగతి విదితమే. 2030 నాటికి దేశీయంగా అత్యధిక వాహనాలు విద్యుత్తుతో నిడిచేవే ఉండేలా చూడాలన్న ఆశయం సాకరమయ్యేందుకు విద్యుత్తు వాహనాలకు రిజిస్ట్రేషన్‌ రుసుము రద్దు చేయాలనే ప్రతిపాదనను ప్రభుత్వం తెచ్చింది.

బ్యాటరీతో నడిచే కొత్త వాహనాల రిజిస్ట్రేషన్‌, పునరుద్ధరణ సమయంలోనూ రుసుముల నుంచి మినహాయింపు ఇవ్వాలని ముసాయిదాలో ప్రతిపాదించారు. కేంద్ర మోటారు వాహనాల నిబంధనల (సీఎంవీఆర్‌) 1989కి సవరణల్లో భాగంగా, రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ ఈ ప్రతిపాదన చేసింది. ‘దీనిపై 30 రోజుల్లో అభిప్రాయాలు తెలపొచ్చు. వీటిని పరిగణనలోకి తీసుకున్నాక, నోటిఫికేషన్‌ జారీ చేస్తారు’ అని తెలిపింది.

ఈ ప్ర‌తిపాద‌న ఎల‌క్ర్టానిక్ స్కూట‌ర్లు, మోటార్‌సైకిళ్లు, ఆటో రిక్షాలు, కార్లు అన్నింటికి ఇది వ‌ర్తిస్తుంది. విద్యుత్ వాహ‌నాలు పెరిగితే కాలుష్యం త‌గ్గ‌డంతో పాటు, ఇంధ‌నం కోసం ఇత‌ర దేశాల‌పై ఆధార‌ప‌డ‌టం, దిగుమ‌తి చేసుకోవ‌డం త‌గ్గుతుంది. అదేవిధంగా ఉద్యోగాల సృష్టి జ‌రుగుతుంది.

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly