రూపే, యూపీఐ పేమెంట్స్ విధానం త‌ప్ప‌నిస‌రి..

రూపే కార్డు, యూపీఐ ద్వారా జ‌రిపే లావాదేవీల‌పై మ‌ర్చంట్ డిస్కౌంట్ రేట్‌(ఎండీఆర్‌)ను ర‌ద్దు చేస్లున్న‌ట్లు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది

రూపే, యూపీఐ పేమెంట్స్ విధానం త‌ప్ప‌నిస‌రి..

రూ.50 కోట్ల‌కు పైగా అమ్మ‌కాలు(ట‌ర్నోవ‌ర్‌) ఉన్న వ్యాపార సంస్థ‌లు, 2020 జ‌న‌వ‌రి 1 వ‌తేదీ నుంచి రూపే డెబిట్ కార్డుల వంటి ఎల‌క్ట్రానిక్ చెల్లింపు మోడ్‌ల‌ను త‌ప్ప‌నిస‌రిగా అందుబాటులో ఉంచాల‌ని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఫిబ్ర‌వ‌రి 1 తేదీ నాటికి దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్ల‌ను పూర్తి చేసుకోవాల‌ని లేనిచో… జ‌రిమాల‌ను విధిస్తామ‌ని తెలిపింది.

ఇప్ప‌టికే అందుబాటులో ఉంచిన ఎల‌క్ట్రానికి చెల్లింపు విధానాల‌తో పాటు, నిర్ధేశించిన చెల్లింపు విధానాల‌ను కూడా త‌ప్ప‌నిస‌రిగా అందుబాటులో ఉంచాల‌ని సంస్థ‌ల‌కు తెలిపింది. నేష‌న‌ల్ పేమెంట్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ) చెల్లింపుల నెట్‌వ‌ర్క్‌ అందించే రూపే ఆధారిత డెబిట్ కార్డులు, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంట‌ర్‌ఫేస్‌(యూపీఐ), యూనిఫైడ్ పేమెంట్స్ ఇంట‌ర్‌ఫేస్ క్విక్ రెస్పాన్స్ కోడ్‌(యూపీఐక్యూఆర్‌సీ), ఎస్‌పీసీఐ బీహెచ్ఐఎమ్ యూపీఐ, క్విక్ రెస్పాన్స్ కోడ్ వంటి నిర్థిష్ట విధానాల‌ను అందుబాటులోకి తీసుకురావాల‌ని ఉత్త‌ర్వుల‌లో సూచించింది.

ఈ విధానం రేప‌టి(జ‌న‌వ‌రి 1) నుంచి అమ‌లులోకి వ‌స్తున్న‌ప్ప‌టికీ, ఒక నెల గ్రేస్ పిరియ‌డ్ ఇస్తున్న‌ట్లు తెలిపింది. దీని ద్వారా మౌళిక స‌దుపాయాలు స‌మ‌కూర్చుకునేందుకు త‌గినంత స‌మ‌యం ల‌భిస్తుంద‌ని తెలిపింది. నిర్ణీత స‌మయంలో ఈ విధానాన్ని అమ‌లులోకి తీసుకురాని సంస్థ‌ల‌కు రోజుకు రూ.5 వేల జ‌రిమానా విధిస్తామ‌ని తెలిపింది. ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం(16వ స‌వ‌ర‌ణ‌) 2019 నిబంధ‌న‌ల ప్ర‌కారం ఈ విధానాన్ని ప్ర‌వేశ‌పెట్టారు. డిజిట‌ల్ లావాదేవీల‌ను ప్రోత్స‌హించ‌డం, ఎన్‌పీసీఐ చెల్లింపు సంస్థ‌కు మ‌ద్ద‌తు నివ్వ‌డం దీని ప్ర‌ధాన ఉద్దేశ్యంగా తెలుస్తుంది.

ఈ పేమెంట్ మోడ్‌ను ఆఫ‌ర్ చేస్తున్న బ్యాంకులు, పేమెంట్స్ వ్య‌వ‌స్థ‌లు… చెల్లింపులు చేసే వ్యక్తులు లేదా గ్ర‌హీత‌ల నుంచి ఎటువంటి చార్జీలు వ‌సూలు చేయ‌కూడ‌ద‌ని ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుద‌ల చేసిన అధికారిక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.
2016లో పెద్ద నోట్ల ర‌ద్దు త‌రువాత డిజిట‌ల్ లావాదేవీలు ఊపందుకున్నాయి. గ‌త మూడు సంవ‌త్స‌రాల‌లో యూపీఐ చెల్లింపు వ్య‌వ‌స్థ రికార్డు స్థాయిలో రూ. 100 కోట్ల మార్క్‌ను చేరుకుంది. ఆదాయంలో పెరుగుద‌ల‌, త‌క్కువ ధ‌ర‌కే స్మార్ట్‌ఫోన్‌లు, డేటా అందుబాటులో ఉండ‌డం కూడా యువ‌తను ఎక్కువ‌గా ఎల‌క్ట్రానిక్ పేమెంట్ వైపు మ‌ళ్ళించేందుకు దోహ‌దం చేసింది.

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly