10 వారాల క‌నిష్టానికి రూపాయి

డాల‌ర్‌తో మార‌కంలో 10 వారాల క‌నిష్ట స్థాయికి చేరిన రూపాయి.

10 వారాల క‌నిష్టానికి రూపాయి

కీల‌క‌మైన రేట్ల‌ను య‌థాత‌థంగా ఉంచుతున్న‌ట్లు ఫెడ్ రిజ‌ర్వ్ ప్ర‌క‌టించ‌డంతో డాల‌ర్‌తో మార‌కంలో నేడు రూపాయి 23 పైస‌లు న‌ష్ట‌పోయి 10 వారాల క‌నిష్ట స్థాయికి చేరింది. ఫెడ్ నిర్ణ‌యాల‌తో ప్ర‌స్తుతం ఆసియా క‌రెన్సీ మార్కెట్లు ప్ర‌తికూలంగా ట్రేడవుతున్నాయి. వ‌చ్చే డిసెంబ‌ర్‌లో మ‌రోసారి రేట్ల పెంపు ఉంటుంద‌ని ఫెడ్ సంకేతాలిచ్చింది. అలాగే 2008 ఆర్థిక సంక్షోభం త‌ర్వాత ఉద్దీప‌న ప‌థకానికి కేటాయించిన 4.2 ట్రిలియ‌న్ల డాల‌ర్ల‌ను ట్రెజ‌రీ బాండ్లు, సెక్యూరిటీల నుంచి ఉప‌సంహ‌రించేందుకు అక్టోబ‌ర్ నుంచి కార్యాచ‌ర‌ణ‌ను ప్రారంభిస్తామ‌ని తెలిపిది. దీంతో ఇత‌ర క‌రెన్సీల‌తో డాల‌ర్ బ‌ల‌ప‌డింది.

ఈ రోజు ట్రేడింగ్ ప్రారంభంలో రూ.64.27 వ‌ద్ద ప్రారంభమైన రూపాయి విలువ త‌ర్వాత ఉద‌యం 9.15 వ‌ద్ద 23 పైస‌లు కోల్పోయి రూ.64.50 వ‌ద్ద ట్రేడింగ్ కొన‌సాగుతోంది. ఆర్‌బీఐ రిఫ‌రెన్స్ రేటు ప్ర‌కారం ప్ర‌స్తుతం డాల‌ర్ రూ.64.36 వ‌ద్ద‌, యూరో రూ.77.24 వ‌ద్ద ఉన్నాయి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly