నాలుగు నెల‌ల క‌నిష్టానికి రూపాయి

డాల‌ర్‌తో మార‌కంలో రూపాయి నేడు 21 పైస‌లు కోల్పోయి నాలుగు నెల‌ల క‌నిష్ట స్థాయికి చేరుకుంది.

నాలుగు నెల‌ల క‌నిష్టానికి రూపాయి

డాల‌ర్‌తో మార‌కంలో రూపాయి న‌ష్టాలు కొన‌సాగుతునే ఉన్నాయి. ఈ రోజు ఫారెక్స్ మార్కెట్లో రూపాయి తొలిసారిగా రూ.65 స్థాయిని దాటింది. బ్యాంక‌ర్లు, దిగుమ‌తిదారుల నుంచి డాల‌ర్ల‌కు డిమాండ్ అధిక‌మ‌వ‌డం ఇందుకు కార‌ణం. అంత‌ర్జాతీయ ఉద్రిక్త‌త‌ల మ‌ధ్య ఈ రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు న‌ష్టాల్లో ట్రేడ‌వుతుండ‌ట‌మూ దీనికి దోహ‌దం చేసింది. మ‌రోవైపు విదేశీ సంస్థాగ‌త మ‌దుప‌రులు(ఎఫ్ఐఐ)లు పెట్టుబ‌డుల‌ను వెన‌క్కి తీసుకోవ‌డ‌మూ ఈ న‌ష్టాల‌కు కార‌ణ‌మైంది.

గ‌త ఆగస్టు 1 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ ఎఫ్ఐఐలు దాదాపు రూ.16 వేల కోట్లు(2.5 బిలియ‌న్ డాల‌ర్ల‌) పెట్టుబ‌డుల‌ను ఉప‌సంహ‌రించారు. ప్ర‌స్తుతం డాల‌ర్‌తో మార‌కంలో రూపాయి 21 పైస‌లు న‌ష్ట‌పోయి రూ.65.01 వ‌ద్ద ట్రేడింగ్ కొనసాగుతోంది. గ‌త సెష‌న్ ముగింపులో ఇది రూ.64.80 గా న‌మోదైంది. ఆర్‌బీఐ రిఫ‌రెన్స్ రేటు ప్ర‌కారం ప్ర‌స్తుతం డాల‌ర్ రూ.64.52, యూరో రూ.76.74 వ‌ద్ద ఉన్నాయి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly