బ‌ల‌ప‌డిన రూపాయి

డాల‌ర్‌తో మార‌కంలో రూపాయి నేడు మూడు వారాల గ‌రిష్ట స్థాయికి చేరువ‌లో ట్రేడింగ్ కొన‌సాగుతోంది.

బ‌ల‌ప‌డిన    రూపాయి

దేశ స్థూల ఆర్థిక గ‌ణాంకాలు మెరుగ్గా న‌మోద‌వ‌డంతో డాల‌ర్‌తో మార‌కంలో నేడు రూపాయి మూడు వారాల గ‌రిష్టానికి చేరువ‌లో ఉంది. ఆగ‌స్టు లో పారిశ్రామికోత్ప‌త్తి 9 నెల‌ల గ‌రిష్టానికి చేరి 4.3 శాతంగా న‌మోదైంది. మ‌రోవైపు సెప్టెంబ‌ర్ నెల రిటైల్ ద్ర‌వ్యోల్బ‌ణం సైతం త‌గ్గి 3.28 శాతంగా న‌మోద‌వ‌డం రూపాయి లాభాల‌కు కార‌ణం.

ఈ రోజు స్టాక్ మార్కెట్లు సానుకూలంగా మొద‌ల‌వ‌టం, అంత‌ర్జాతీయ క‌రెన్సీల‌తో డాల‌ర్ బ‌ల‌హీన‌ప‌డ‌ట‌మూ రూపాయి లాభాల‌కు కార‌ణ‌మైంది. అయితే దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి ఎఫ్‌పీఐల పెట్టుబ‌డుల ఉప‌సంహ‌ర‌ణ కొన‌సాగుతుండ‌టంతో రూపాయి లాభాలకు అడ్డుక‌ట్ట ప‌డింది.

ఈ రోజు ఉద‌యం ఫారెక్స్ మార్కెట్లో రూ.64.95 వ‌ద్ద ప్రారంభ‌మైన రూపాయి త‌ర్వాత రూ.64.91 స్థాయిని తాకింది. ఉద‌యం 9.15గంట‌ల‌కు డాల‌ర్‌తో మార‌కంలో రూపాయి 17 పైస‌లు లాభ‌ప‌డి రూ.64.92 వ‌ద్ద ట్రేడింగ్ కొన‌సాగుతోంది. గ‌త సెష‌న్ ముగింపులో ఇది రూ.65.09 గా న‌మోదైంది. ఆర్‌బీఐ రిఫ‌రెన్స్ రేటు ప్ర‌కారం ప్ర‌స్తుతం డాల‌ర్ రూ.65.10 వ‌ద్ద, యూరో రూ.77.27 వ‌ద్ద ట్రేడింగ్ కొన‌సాగుతోంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly