రూపాయి బ‌ల‌హీనం..

ప్ర‌తికూల అంత‌ర్జాతీయ‌ కార‌ణాల‌తో డాల‌ర్‌తో మార‌కంలో రూపాయి 6 పైస‌లు బ‌ల‌హీన‌ప‌డింది.

రూపాయి బ‌ల‌హీనం..

డాల‌ర్‌తో మారకంలో రూపాయి నేడు 6 పైస‌లు బ‌ల‌హీన‌ప‌డింది. బ్యాంక‌ర్లు, దిగుమ‌తిదారుల నుంచి డిమాండ్ అధిక‌మ‌వ‌డం ఇందుకు కార‌ణం. మిగతా క‌రెన్సీల‌తో కూడా డాల‌ర్ బ‌ల‌ప‌డ‌ట‌మూ ఇందుకు తోడైంది. అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల‌లో ర‌ష్యా పాత్ర‌పై నేడు సెనెట్‌కి మాజీ డైరెక్ట‌ర్ జేమ్స్ కోమే స‌మాధాన‌మివ్వ‌నున్నారు. ఈ ప్ర‌భావంతో రూపాయి మ‌రింత‌గా బ‌ల‌హీన‌ప‌డింది. అయితే ఆర్‌బీఐ చ‌ట్ట‌బ‌ద్ద ద్ర‌వ్య నిష్ప‌త్తి(ఎస్ఎల్ఆర్‌)ని త‌గ్గించ‌టంతో న‌ష్టాలు కొంత వ‌ర‌కు ప‌రిమిత‌మ‌య్యాయి. బ్రిట‌న్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో పౌండ్ స్టెర్లింగ్ రెండు వారాల క‌నిష్టానికి చేరింది.

ప్ర‌స్తుతం డాల‌ర్‌తో రూపాయి 6 పైస‌లు బ‌ల‌ప‌డి రూ.64.39 వ‌ద్ద ట్రేడింగ్ కొన‌సాగుతోంది. నిన్న‌టి సెష‌న్ ముగింపులో ఇది రూ.64.33 గా ఉంది. ఆర్‌బీఐ రిఫ‌రెన్స్ రేటు ప్ర‌కారం ప్ర‌స్తుతం డాల‌ర్ రూ.64.45 వ‌ద్ద‌, యూరో రూ.72.65 వ‌ద్ద ఉన్నాయి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly