రూపాయి బ‌ల‌హీనం

అమెరికా ఉద్యోగ గ‌ణాంకాలు అంచ‌నాల‌కు మించి మెరుగ్గా న‌మోద‌వ‌డంతో డాల‌ర్‌తో మార‌కంలో రూపాయి నేడు 12 పైస‌లు బ‌ల‌హీన ప‌డింది.

రూపాయి  బ‌ల‌హీనం

గ‌త కొద్ది రోజుల‌గా అమెరికా డాల‌ర్‌తో మార‌కంలో బ‌ల‌ప‌డుతూ వ‌స్తున్న‌ రూపాయి నేడు 12 పైస‌లు బ‌ల‌హీన ప‌డింది. బ్యాంక‌ర్లు, దిగుమ‌తిదారుల నుంచి డిమాండ్ అధిక‌మైనందు వ‌ల్ల ఈ ప‌రిస్థితి త‌లెత్తింది. అలాగే అంత‌ర్జాతీయంగా మిగ‌తా క‌రెన్సీల‌తో కూడా డాల‌ర్ బ‌ల‌ప‌డ‌టం ఇందుకు దోహ‌దం చేసింది. అయితే ఈ రోజు భార‌త స్టాక్ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభ‌మ‌వ‌టంతో ఈ న‌ష్టాలు కొంత వ‌ర‌కు ప‌రిమిత‌మ‌య్యాయి. అమెరికా ఉద్యోగ గ‌ణాంకాలు మెరుగ్గా న‌మోద‌వ‌డంతో 15 నెల‌ల క‌నిష్ట స్థాయి నుంచి డాల‌ర్ కోలుకుంది.

ప్ర‌స్తుతం డాల‌ర్‌తో రూపాయి 12 పైస‌లు బ‌ల‌హీన‌ప‌డి రూ.63.69 వ‌ద్ద ట్రేడింగ్ కొన‌సాగుతోంది. నిన్న‌టి సెష‌న్ ముగింపులో ఇది రూ.63.57 గా ఉంది. ఆర్‌బీఐ రిఫ‌రెన్స్ రేటు ప్ర‌కారం ప్ర‌స్తుతం డాల‌ర్ రూ.63.70 వ‌ద్ద‌, యూరో రూ.75.66 వ‌ద్ద ఉన్నాయి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly