రూపాయి బ‌ల‌హీనం

దేశీయ ప‌రిణామాల నేప‌థ్యంలో డాల‌ర్ తో మార‌కంలో రూపాయి 20 పైస‌లు బ‌ల‌హీన ప‌డింది.

అమెరికా డాల‌ర్‌తో మార‌కంలో రూపాయి బ‌ల‌హీన ప‌డింది. బ్యాంక‌ర్లు, దిగుమ‌తిదారుల నుంచి డిమాండ్ అధిక‌మైనందు వ‌ల్ల ఈ ప‌రిస్థితి త‌లెత్తింది. అలాగే అంత‌ర్జాతీయంగా మిగ‌తా క‌రెన్సీల‌తో కూడా డాల‌ర్ బ‌ల‌ప‌డ‌టం ఇందుకు దోహ‌దం చేసింది. దేశీయంగా ఈ రోజు ఫిబ్ర‌వ‌రి నెల‌కు సంబంధించి పారిశ్రామిక ఉత్ప‌త్తి గ‌ణాంకాలూ, వినియోగ దారు ధ‌ర‌ల సూచీ ద్ర‌వ్యోల్బ‌ణ గ‌ణాంకాలు విడుద‌ల కానుండ‌టం ప్ర‌ధానంగా ప్ర‌భావం చూపింది.

ప్ర‌స్తుతం డాల‌ర్‌తో రూపాయి 20 పైస‌లు బ‌ల‌హీన‌ప‌డి రూ.64.70 వ‌ద్ద ట్రేడింగ్ కొన‌సాగుతోంది. నిన్న‌టి సెష‌న్ ముగింపులో ఇది రూ.64.50 గా ఉంది. ఆర్‌బీఐ రిఫ‌రెన్స్ రేటు ప్ర‌కారం ప్ర‌స్తుతం డాల‌ర్ రూ.64.54 వ‌ద్ద‌, యూరో రూ.68.30 వ‌ద్ద ఉన్నాయి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly