ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ మార‌టోరియం వివ‌రాలు

మారటోరియం సమయంలో చెల్లించని బాకీలను డీఫాల్ట్ పేమెంట్లుగా పరిగణించరు

ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ మార‌టోరియం వివ‌రాలు

ఎస్‌బీఐ వెబ్ సైట్ ప్రకారం మార్చ్, ఏప్రిల్ , మే 2020 నెలలలో గడువు తేదీకి క్రెడిట్ కార్డు బాకీ చెల్లించకపోతే, స్వయంచాలకంగా (ఆటోమేటిక్‌గా) మారటోరియం ఎంచుకున్నట్లే లేదా ఎస్‌బీఐ వెబ్ సైట్ లో ద‌ర‌ఖాస్తు ఫారం తీసుకోవ‌చ్చు.

ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు మారిటోరియం గురించి కొన్ని ముఖ్యాంశాలు:

1.రిజర్వు బ్యాంకు ప్రకారం 1 మార్చి 2020 నుంచి 31 మే 2020 వరకు ఉన్న 3 నెలల మధ్య కాలంలో చెల్లించాల్సిన అన్ని రిటైల్ లోన్ - గృహ రుణ, కారు , విద్య , వ్యక్తిగత, క్రెడిట్ కార్డు రుణాల ఈఎంఐలను వాయిదా వేయమని బ్యాంకులను కోరింది .

2.మారటోరియం అంటే అసలు చెల్లించకపోవడం కాదు. చెల్లించాల్సిన డబ్బును 3 నెలల తరువాత కూడా చెల్లించవచ్చని . అయితే ఈ సమయంలో చెల్లించని క్రెడిట్ కార్డు మొత్తంపై వడ్డీ వర్తిస్తుంది.

3.ఒకవేళ ఇంతకుమునుపే ఆటో డెబిట్ లేదా ఈసీఎస్‌ ద్వారా చెల్లింపులు చేసే సౌకర్యం ఎంచుకున్నట్లయితే, యథావిధిగా చెల్లింపులు జరుగుతాయి. ఒకవేళ మరొటోరియం సదుపాయం పొందదలిస్తే, మీ ఖాతాలో ఈ మార్పు చేయాల్సి ఉంటుంది .

4.29 ఫిబ్రవరి 2020 నాటికి పాత బాకీలు లేని ఖాతాలు లేదా క్రెడిట్ కార్డు (ఒకటి కన్నా ఎక్కువ ఉన్నా) మారటోరియం కు అర్హులు కారు . అలాగే 1 మార్చి 2020 తరువాత క్రెడిట్ కార్డు లు పొందిన వారు కూడా మారటోరియం కు అర్హులు కారు.

5.అన్ని క్రెడిట్ కార్డు ల రుణాల‌పై, చెల్లించవలసిన బాకీలో కనీసం 5 శాతం , చెల్లించవలసి ఉండేది . లేకపోతె అపరాధ రుసుము లేదా ఫీజు వ‌ర్తించేది . అయితే మారటోరియం సమయంలో ఎటువంటి అపరాధ రుసుము, లేదా ఫీజు వర్తించవు .

6.మారటోరియం సమయంలో కూడా నెలవారీ క్రెడిట్ కార్డు స్టేట్‌మెంట్ వ‌స్తుంది. ఇందులో పాత బాకీలు, వాటిపై వర్తించే వడ్డీ వివరాలు వుంటాయి . ప్రతి లావాదేవీ తేదీ నుంచి స్టేట్‌మెంట్ తేదీ వరకు విడివిడిగా వడ్డీ లెక్కిస్తుంది.

7.మారటోరియం సమయంలో చెల్లించని బాకీలపై వడ్డీ వర్తిస్తుంది. వడ్డీ దానిపై వర్తించే జీఎస్‌టీ కలిపి మారటోరియం పీరియడ్ తరువాత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది .

8.అప్పటివరకు ఉన్న బాకీలతో పాటు, మారటోరియం పీరియడ్ లో విధించబడిన వడ్డీ, ఈఎంఐ లను అన్నింటిని జూన్ 2020 లో చెల్లించాల్సిన వాయిదా తో పాటు చెల్లించాల్సి ఉంటుంది .

9.రిజర్వు బ్యాంకు ఆదేశాల ప్రకారం, మారటోరియం సమయంలో చెల్లించని బాకీలను డీఫాల్ట్ పేమెంట్లుగా పరిగణించరు . అలాగే బ్యాంకులు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలకు తెలియచేయవు .

10.మారటోరియం సమయంలో చెల్లించాల్సిన అన్ని ఈఎంఐ లు , జూన్ 2020 నెలలో చెల్లించాల్సిన తేదీకి మొత్తం చెల్లించాల్సి ఉంటుంది . ఈ మారటోరియం సమయంలో నెలకు 3.35 శాతం వడ్డీ వర్తిస్తుంది . ఆ తరువాత ఈఎంఐ ల చెల్లింపులలో ఎటువంటి పొడిగింపూ ఉండదు .

చివరిమాట :
ఈ మారటోరియం సదుపాయం తాత్కాలిక ఉపశమనం కలిగించినప్పటికీ , క్రెడిట్ కార్డు బాకీలపై
విధించే అధిక వడ్డీలు , మరింత ఆర్ధిక భారం ప‌డుతుంది. క్రెడిట్ కార్డు లపై విధించే వడ్డీ వార్షికంగా 36-40శాతం వరకు ఉంటాయి. అందువలన సాధ్యమైనంత త్వరగా ఈ బాకీలను తీర్చడం మంచిది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly