డిపాజిట్ రేట్ల‌ను త‌గ్గించిన ఎస్‌బీఐ

179 రోజుల వ‌ర‌కు ఉన్న కాల‌ప‌రిమితుల‌పై డిపాజిట్ రేట్ల‌ను 50-75 బేసిస్ పాయింట్ల మేర త‌గ్గించ‌నుంది.

డిపాజిట్ రేట్ల‌ను త‌గ్గించిన ఎస్‌బీఐ

డిపాజిట్‌ రేట్లు తగ్గిస్తున్నట్లు స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ప్రకటించింది. కొత్తరేట్లు ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నాయి. 179 రోజుల వరకు ఉన్న వేర్వేరు కాలావధి డిపాజిట్లపై రేటును 50-75 బేసిస్‌ పాయింట్ల మేర తగ్గిస్తున్నామని ప్రకటించింది. దీర్ఘ కాలావధి డిపాజిట్లపై రిటైల్‌ విభాగంలో 20 బేసిస్‌ పాయింట్లు, భారీమొత్తం (బల్క్‌) విభాగంలో 35 బేసిస్‌ పాయింట్ల మేర తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. ఆర్‌బీఐ వ‌డ్డీ రేట్లు త‌గ్గించ‌డం, లిక్విడిటీ పెర‌గ‌డంతో రూ.2 కోట్ల కంటే త‌క్కువ‌ రిటైల్ డిపాజిట్ల రేట్ల‌ను, రూ.2 కోట్ల కంటే ఎక్కువ బ‌ల్క్ డిపాజిట్ రేట్ల‌ను త‌గ్గిస్తున్న‌ట్లు ఎస్‌బీఐ పేర్కొంది.

మే నెల‌లో బ్యాంకు ఏడాది నుంచి రెండేళ్ల కాల‌ప‌రిమితి క‌లిగిన‌, రూ.2 కోట్ల కంటే త‌క్కువ ట‌ర్మ్ డిపాజిట్ల‌పై వ‌డ్డీ రేట్ల‌ను 6.8 శాతం నుంచి 7 శాతానికి పెంచింది. అయితే ఇత‌ర కాల‌ప‌రిమితి క‌లిగిన డిపాజిట్ల‌పై వ‌డ్డీ రేట్ల‌ను త‌గ్గించింది. 2 నుంచి 3 సంవ‌త్స‌రాల వ్య‌వ‌ధి క‌లిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై వ‌డ్డీ రేట్ల‌ను 6.8 శాతం నుంచి 6.75 శాతానికి త‌గ్గించింది. 3 సంవ‌త్స‌రాల నుంచి 5 సంవ‌త్స‌రాల కాల‌వ్య‌వ‌ధి క‌లిగిన డిపాజిట్ల‌పై వ‌డ్డీ రేట్ల‌ను 6.8 శాతం నుంచి 6.7 శాతానికి స‌వ‌రించింది.

మ‌రోవైపు త‌గ్గింపు ప్ర‌యోజ‌నాల‌ను వినియోగ‌దారుల‌కు బ‌దిలీ చేసేందుకు బ్యాంకు, ల‌క్ష రూపాయ‌లు అంత‌కంటే ఎక్కువ డిపాజిట్ల‌ను, ఓవ‌ర్‌డ్రాఫ్ట్ వంటి స్వ‌ల్ప కాలిక రుణాల‌ను ఆర్‌బీఐ రెపోరేటుతో అనుసంధానం చేసింది.

సిరి లో ఇంకా

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly