ఎస్‌బీఐ, ఫోస్టాఫీస్ ఆర్‌డీ ఖాతా తాజా వ‌డ్డీ రేట్లు, ఇత‌ర వివ‌రాలు

బ్యాంకుల‌లో ఒక సంవ‌త్స‌రం నుంచి ప‌ది సంవ‌త్స‌రాల‌కు ఆర్‌డీ ఖాతా తెరిచేందుకు వీలుంటుంది

ఎస్‌బీఐ, ఫోస్టాఫీస్ ఆర్‌డీ ఖాతా తాజా వ‌డ్డీ రేట్లు, ఇత‌ర వివ‌రాలు

రిక‌రింగ్ డిపాజిట్‌లు(ఆర్‌డీ) ఒక ర‌క‌మైన ట‌ర్మ్ డిపాజిట్లు. బ్యాంకులు, బ్యాంకింగేత‌ర ఆర్థిక సంస్థ‌లు ఈ త‌ర‌హా సేవ‌ల‌ను అందిస్తున్నాయి. నెల‌వారీగా కొంత స్థిర మొత్తాన్ని, ప‌రిమిత కాలానికి డిపాజిట్ చేస్తూ, డ‌బ్బును పొదుపు చేయాల‌నుకునే వారికి ఇది మంచి ఎంపికగా చెప్పుకోవ‌చ్చు. ఆర్‌డీ ఖాతాలో ముందుగా నిర్ణ‌యించిన క‌చ్చిత‌మైన మొత్తాన్ని, ముందుగా నిర్ణ‌యించిన వాయిదాల ప‌ద్ద‌తిలో డిపాజిట్ చేసేందుకు వీలుంటుంది. వాయిదా మొత్తాన్ని ఒక‌సారి నిర్ణ‌యించిన త‌రువాత మార్చుకునే అవ‌కాశం ఉండ‌దు.
ఉదాహ‌ర‌ణ‌కు, ప్ర‌తీ నెల రూ.1000, 12 నెల‌ల పాటు డిపాజిట్ చేసే విధంగా బ్యాంకు ఆర్‌డీ ఖాతాను తెరిస్తే, ప్ర‌తీ నెల మీరు ఎంచుకున్న తేదీకి నిర్ధిష్ట మొత్తాన్ని డిపాజిట్ చేయాలి. ఆర్‌డీ ఖాతా వ‌డ్డీ రేట్లు దాదాపు ఫిక్స్‌డ్ డిపాజిట్ వ‌డ్డీరేట్లను పోలి ఉంటాయి. ఆర్‌డీ ఖాతా టైమ్ డిపాజిట్ ఖాతాలోకి వ‌స్తుంది . అందువ‌ల్ల వ‌డ్డీ ఆదాయంపై ప‌న్ను వ‌ర్తిస్తుంది.

ఎస్‌బీఐ, పోస్టాఫీసు ఆర్‌డీ ఖాతాల‌ను ప‌రిశీలిస్తే…

  • ఎస్‌బీఐ ఆర్‌డీ ఖాతా రేట్లు 6.4 శాతం నుంచి 6.85 శాతం మ‌ధ్య‌లో మారుతూ ఉంటాయి. పోస్టాఫీసులు వార్షికంగా 7.2 శాతం అధిక వ‌డ్డీ రేటును ఆఫ‌ర్ చేస్తున్నాయి. త్రైమాసికంగా కాపౌండ్ చేస్తారు.

  • ఎస్‌బీఐ ఆర్‌డీ ఖాతా గ‌డువు 12 నెల‌ల నుంచి 120 నెల‌ల వ‌ర‌కు ఉంటుంది. అదే పోస్టాఫీస్ ఆర్‌డీ గ‌డువు కేవ‌లం 5 సంవ‌త్స‌రాలు మాత్ర‌మే.

  • ఎస్‌బీఐ ఆర్‌డీ ఖాతాను చెక్ ద్వారా గానీ/న‌గ‌దు ద్వారా గానీ తెర‌వ‌వ‌చ్చు. కానీ పోస్టాఫీసు ఖాతాను న‌గ‌దు ద్వారా మాత్ర‌మే తెరిచేందుకు వీలుంటుంది.

  • ఎస్‌బీఐ రికరింగ్ డిపాజిట్ ఖాతాను నెట్ బ్యాంకింగ్ ద్వారా ప్రారంభించవ‌చ్చు. అయితే పోస్టాఫీస్‌లో ఆర్‌డీ ఖాతాను ప్రారంభించేందుకు పోస్టాఫీస్ శాఖ‌కు వెళ్లాల్సి ఉంటుంది.

  • ఎస్‌బీఐ ఆర్‌డీ ఖాతాదారులు నెల‌కు క‌నీసం రూ.100 నుంచి 10 గుణిజాల‌లో ఎంతైనా డిపాజిట్ చేయ‌వ‌చ్చు. దీనికి ఎలాంటి గ‌రిష్ఠ ప‌రిమితి లేదు. పోస్టాఫీస్ ఆర్‌డీని ప్రారంభించేందుకు నెల‌కు క‌నీసం రూ.10 అవ‌స‌రం. 5 గుణిజాల‌లో ఎంతైనా డిపాజిట్ చేయ‌వ‌చ్చు. ఎలాంటి ప‌రిమితి లేదు.

  • ఒక‌వేళ ఒక నెల‌లో ఖాతాలో డిపాజిట్ చేయ‌క‌పోతే ఎస్‌బీఐ ఛార్జీల‌ను విధిస్తుంది. ఐదేళ్లు అంత‌కంటే త‌క్కువ కాల‌వ్య‌వ‌ధి ఉన్న ఖాతాల‌కు రూ.100 కు రూ.1.50 చొప్పున వ‌సూలు చేస్తుంది. పోస్టాఫీస్ ఆర్‌డీ ఖాతాలో స‌మ‌యానికి డిపాజిట్ చేయ‌క‌పోతే ప్ర‌తి 5 రూపాయిల‌కు రూ.0.05 చొప్పున ఛార్జీలు వ‌ర్తిస్తాయి. వ‌రుస‌గా నాలుగు సార్లు డిపాజిట్ చేయ‌క‌పోతే ఖాతా నిలిచిపోతుంది. తిరిగి రెండు నెల‌ల్లో దీనిని పున‌రుద్ధ‌రించుకోవ‌చ్చు. అయితే ఈ కాలంలో తిరిగి ప్రారంభం కాక‌పోతే త‌ర్వాత డిపాజిట్ చేసేందుకు వీలుండ‌దు.

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly