ఎస్‌బీఐ పీపీఎఫ్ ఖాతా గురించిన 10 ముఖ్య‌విష‌యాలు

చందాదారుడు వార్షికంగా రూ.1.5 ల‌క్ష‌లకు మించి డిపాజిట్ చేయ‌కూడ‌దు. అద‌న‌పు మొత్తానికి వ‌డ్డీ వ‌ర్తించ‌దు.

ఎస్‌బీఐ పీపీఎఫ్ ఖాతా గురించిన 10 ముఖ్య‌విష‌యాలు

దేశంలోనే అతిపెద్ద బ్యాంక్‌, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), త‌మ ఖాతాదారుల‌కు ప‌లు ర‌కాల సేవ‌ల‌ను అందిస్తుంది. ప‌ద‌వీ విర‌మ‌ణ నిధి కోసం ప్రణాళిక చేసుకునే వారి కోసం ఎస్‌బీఐ పీపీఎఫ్‌(ప‌బ్లిక్ ప్రావిడెండ్ ఫండ్‌)ను ఆఫ‌ర్ చేస్తుంది. చిన్న మొత్తాల పొదుపును ప్రోత్స‌హించేందుకు నేష‌న‌ల్ సేవింగ్స్ ఆర్గ‌నైజేష‌న్ 1968లో ప‌బ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ పథ‌కాన్ని ప్రవేశ‌పెట్టింది. పీపీఎఫ్ ఖాతా మంచి రాబ‌డితో పాటు ప‌న్ను ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది. వ్య‌క్తులు త‌మ పేరు మీద గానీ త‌మ మైన‌ర్ పిల్ల‌ల పేర్ల‌పై గానీ ఖాతాను తెరువ‌వ‌చ్చు.

ఎస్‌బీఐ పీపీఎఫ్ ఖాతాను గురించిన 10 ముఖ్య‌విష‌యాలు:

  1. ఎస్‌బీఐ ప్ర‌కారం ఈ ఖాతాను హిందూ అవిభాజ్య కుటుంబాల పేర్ల‌తో తెరువ కూడ‌దు.
  2. క‌నీసం రూ. 500 నుంచి గ‌రిష్టంగా రూ. 1.5 ల‌క్ష‌ల వ‌ర‌కు వార్షికంగా జ‌మ చేయ‌వ‌చ్చు.
  3. వార్షికంగా జ‌మ చేసే మొత్తాన్ని ఒకేసారి గానీ 12 వాయిదాలుగా విభ‌జించి గానీ చెల్లించ‌వ‌చ్చు.
  4. ఈ ప‌థ‌కం కాల‌ప‌రిమితి 15 సంవ‌త్స‌రాలు. మెచ్యూరిటీ ముగిసిన త‌ర్వాత కూడా ఖాతా మ‌రింత కాలం కొన‌సాగించే అవ‌కాశం ఉంది. ఆ స‌మ‌యంలో డ‌బ్బు డిపాజిట్ చేసినా చేయ‌కోయినా గ‌డువు పెంచుకోవ‌చ్చు. 5 ఏళ్ల చొప్పున గ‌డువు పొడ‌గించుకోవ‌చ్చు.
  5. వ‌డ్డీ రేట్ల‌ను కేంద్ర ప్ర‌భుత్వం త్రైమాసికంగా నిర్ణ‌యిస్తుంది. ప్ర‌స్తుత వార్షిక వ‌డ్డీ రేటు 8 శాతం. నెల ప్రారంభ‌మైన 5వ రోజు నుంచి నెల చివ‌రి వ‌ర‌కు ఉన్న క‌నీస బ్యాలెన్స్‌పై వ‌డ్డీ లెక్కిస్తారు. ప్ర‌తీ సంవ‌త్స‌రం మార్చి 31కి వ‌డ్డీ చెల్లిస్తారు.
  6. ఖాతా వ‌య‌సు, నిర్ధిష్ట తేదిల‌కు ఉన్న బ్యాలెన్స్‌ల ఆధారంగా రుణాలు, విత్‌డ్రాల‌ను అనుమ‌తిస్తారు.
  7. ఎస్‌బీఐ అందించే పీపీఎఫ్ ఖాతా ద్వారా ఆదాయ‌పు ప‌న్ను ప్ర‌యోజ‌నాలు అందుబాటులో ఉన్నాయి. వ‌డ్డీ ఆదాయంపై పూర్తి ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది.
  8. ఒక‌రు లేదా అంత‌కంటే ఎక్కువ మందిని నామీనీలుగా నియ‌మించే సౌక‌ర్యం ఉంది. చందాదారుడు నామీని షేర్ల‌ను ఎంచుకోవాలి.
  9. చందాదారుడు కోరితే పీపీఎఫ్ ఖాతాను ఇత‌ర బ్యాంకులు లేదా పోస్టాఫీసుల‌కు బ‌దిలీ చేసే సౌక‌ర్యం ఉంది.
  10. పీపీఎప్ ఖాతాకు 15 సంవ‌త్స‌రాలు లాక్‌-ఇన్ పీరియ‌డ్ ఉంటుంది. అయితే కొన్ని ప్ర‌త్యే క నిబంధ‌న‌ల ప్ర‌కారం ముందుగా విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. కానీ 5 ఏళ్లు పూర్త‌యిన త‌ర్వాతే ఖాతా మూసివేత‌కు అవ‌కాశం ఉంటుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly