ఎస్‌బీఐ వినియోగ‌దారులు కార్డ్, పిన్ లేకుండానే చెల్లించ‌వ‌చ్చు

ఎస్‌బీఐ కార్డ్ పే కోసం వినియోగ‌దారులు మొద‌ట మీ కార్డుతో మొబైల్ యాప్‌లో రిజిస్ట‌ర్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఎస్‌బీఐ వినియోగ‌దారులు కార్డ్, పిన్ లేకుండానే చెల్లించ‌వ‌చ్చు

ఎస్‌బీఐ కార్డ్ మీ వ‌ద్ద ఉంటే పిన్ అవ‌స‌రం లేదు అస‌లు కార్డ్ కూడా అవ‌స‌రం లేదు. ఎస్‌బీఐ, జీఈ క్యాపిట‌ల్ క‌లిసి ‘ఎస్‌బీఐ కార్డ్ పే’ స‌దుపాయాన్ని అందుబాటులోకి తెచ్చాయి. ఇందుకు ‘ఎస్‌బీఐ కార్డ్ పే’ మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. దీంతో కార్డ్ లేకుండానే మొబైల్‌తో చెల్లింపులు చేయ‌వ‌చ్చు.

డిజిట‌ల్ లావాదేవీల‌ను ప్రోత్స‌హించ‌డంతో పాటు త‌మ వినియోగ‌దారుల‌కు చెల్లింపు సౌక‌ర్యాన్ని సుల‌భం చేసేందుకు హోస్ట్‌కార్డ్ ఎమ్యులేషన్ సాంకేతిక‌త‌ను (హెచ్‌సీఈ) ఉప‌యోగించి ఈ స‌దుపాయాన్ని అందుబాటులోకి తెచ్చిన‌ట్లు ఎస్బీఐ పేర్కొంది. వీసా ఫ్లాట్‌ఫాంపై తీసుకొచ్చిన ఈ సౌక‌ర్యం ఆండ్రాయిడ్ ఓఎస్ కిట్‌క్యాట్ వ‌ర్ష‌న్ 4.4, దానికి మించి ఓఎస్ ఉన్న‌ ఆండ్రాయిడ్ వ‌ర్ష‌న్‌ల‌లో అందుబాటులో ఉంది.

రోజూవారి లావాదేవీల‌ ప‌రిమితి పెట్టుకోవ‌డం వినియోగ‌దారుల చేతిలోనే ఉంటుంది. లావాదేవీ ప‌రిమితి రూ.2000 , రోజుకు రూ.10 వేలు మాత్ర‌మే అందుబాటులో ఉంద‌ని బ్యాంకు తెలిపింది. ప‌రిమితిని మించి లావాదేవీలు చేయాల‌నుకుంటే కార్డ్ స్వైప్‌ చేసి, పిన్ నంబ‌ర్ ఎంట‌ర్ చేయాల్సి ఉంటుంది. ఎన్ఎఫ్‌సీల వ‌ద్ద కార్డుతో వైర్‌లెస్ లావాదేవీల‌ను కూడా జ‌రుపుకోవ‌చ్చు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly