మీరు ఎస్‌బీఐ ఖాతాదారులా? అయితే ఈ మూడు మార్పులు గ‌మ‌నించండి..

సవ‌రించిన ఎక్స్‌ట్ర‌న‌ల్‌ బెంచ్‌మార్క్ ఆధారిత గృహ‌రుణ వ‌డ్డీ రేట్లు నేటి(జ‌న‌వ‌రి 1,2020) నుంచి అమ‌లులోకి రానున్నాయి

మీరు ఎస్‌బీఐ ఖాతాదారులా? అయితే ఈ మూడు మార్పులు గ‌మ‌నించండి..

దేశీయ అతిపెద్ద బ్యాంక్ ఎస్‌బీఐ జ‌న‌వరి 1, 2020 నుంచి కొన్నికీల‌క నిర్ణ‌యాల‌ను నేటి నుంచి అమ‌లులోకి తీసుకొచ్చింది. ఒక వేళ మీరు ఎస్‌బీఐ ఖాతాదారులైతే ఈ మార్పుల‌ను గ‌మ‌నించండి. ఓటీపీ ఆధారిత ఏటీఎమ్ లావాదేవీలు, ఈఎమ్‌వీ చిప్ డెబిట్ కార్డు, ఎక్స్‌ట్ర‌న‌ల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటు త‌గ్గింపు.

  1. ఎస్‌బీఐ గృహ రుణ వ‌డ్డీరేట్ల త‌గ్గింపు:
    ఎక్స్‌ట్ర‌న‌ల్ బెంచ్ మార్క్ ఆధారిత రేటు(ఈబీఆర్‌) ను 25 బేసిస్ పాయింట్ల మేర త‌గ్గించిన‌ట్లు ఎస్‌బీఐ ప్ర‌క‌టించింది. దీంతో వార్షికంగా 8.05 శాతం ఉన్న ఎక్స్‌ట్ర‌న‌ల్ బెంచ్‌మార్క్ ఆధారిత రుణ రేటు 7.80 శాతానికి త‌గ్గింది. సవ‌రించిన వ‌డ్డీ రేట్లు నేటి(జ‌న‌వ‌రి 1,2020) నుంచి అమ‌లులోకి రానున్న‌ట్లు బ్యాంక్ తెలిపింది. తాజా త‌గ్గింపుతో ఎక్స్‌ట్ర‌న‌ల్ బెంచ్‌మార్క్ ఆధారిత రేట్ల ఆధారంగా గృహ రుణం తీసుకున్న ఖాతాదారులు, ఎమ్ఎస్ఎమ్ఈ రుణ గ్ర‌హీత‌లకు 25 బేసిస్ పాయింట్ల మేర వ‌డ్డీ రేటు త‌గ్గ‌నుంది. కొత్త‌గా గృహ రుణం తీసుకునే వారికి వార్షికంగా 7.90 శాతం వ‌డ్డీకే గృహ రుణం మంజూరు చేయ‌నున్న‌ట్లు ఎస్‌బీఐ తెలిపింది. ఇంత‌కు ముందు ఇది 8.15 శాతంగా ఉండేది.

  2. కొత్త ఈఎమ్‌వీ చిప్ ఆధారిత కార్డులు:
    మాగ్నిటిక్ స్ట్రిప్‌తో కూడిన ఏటీఎమ్ క‌మ్ డెబిట్ కార్డులు జ‌న‌వ‌రి1,2020 నుంచి ప‌నిచేయ‌వ‌ని ఎస్‌బీఐ స్ప‌ష్టం చేసింది. వాటి స్థానంలో ఈఎమ్‌వీ చిప్ కార్డుల‌ను డిసెంబ‌రు 31,2019 లోగా అప్‌డేట్ చేసుకోవాల‌ని బ్యాంక్ ఖాతాదారుల‌కు గ‌తంలోనే తెలియ‌జేసింది. ఈఎమ్‌వీ చిప్ ఆధారిత ఏటీఎమ్ కార్డులు మోస‌పూరిత లావాదేవీల నుంచి కొనుగోలు దారుల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించ‌మే కాకుండా లావాదేవీలు నిర్వ‌హించిన ప్ర‌తీసారి ప‌టిష్ట‌మైన భ‌ద్ర‌త‌ను అందిస్తాయ‌ని, అందువ‌ల్ల ఈ కార్డును క్లోనింగ్ చేయ‌డం సాధ్యం కాద‌ని ఎస్‌బీఐ తెలిపింది.

  3. ఓట‌పీ-ఆధారిత ఏటీఎమ్ లావాదేవీలు:
    న‌గ‌దు ఉప‌సంహ‌ర‌ణ‌ల‌కు మ‌రింత భద్ర‌త చేకూర్చేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓటీపీ ఆధారిత ఏటీఎమ్ విత్‌డ్రాల‌ను ప్ర‌వేశ‌పెట్టింది. జ‌న‌వ‌రి 1వ‌ తేది మొద‌లు రాత్రి 8 గంట‌ల నుంచి ఉద‌యం 8 గంట‌ల వ‌ర‌కు చేసే రూ.10వేల‌కు మించిన న‌గ‌దు ఉప‌సంహ‌ర‌ణ‌ల‌ను ఒటీపీ వెరిఫికేష‌న్ ద్వారానే చేసుకోవాలి. అయితే మీరు ఇత‌ర బ్యాంక్ ఏటీఎమ్ వ‌ద్ద‌ న‌గ‌దు విత్‌డ్రా చేస్తే ఓటీపీ అవ‌స‌రం ఉండదు. ఏటీఎమ్ నుంచి న‌గ‌దు విత్‌డ్రా చేసుకునేప్పుడు, ఏటీఎమ్‌లో మీకు కావ‌ల‌సిన మొత్తాన్ని ఎంట‌ర్ చేసిన త‌రువాత ఓటీపీ ఎంట‌ర్ చేయ‌మ‌ని అడుగుతుంది. ఖాతాదారులు బ్యాంకు వ‌ద్ద రిజిస్ట‌ర్ చేసుకున్న మొబైల్ నెంబ‌రుకు ఓటీపీని పంపిస్తారు. ఈ ఓటీపీని ఎంట‌ర్ చేసి న‌గ‌దు విత్డ్రా చేసుకోవ‌చ్చు.

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly