ఎస్‌బీఐ పండుగ ఆఫ‌ర్‌

ఎస్‌బీఐ 6 సంవ‌త్స‌రాల కాల‌ప‌రిమితితో 10.75 శాతం వ‌డ్డీతో రూ.20 ల‌క్ష‌ల వ‌ర‌కు వ్య‌క్తిగ‌త రుణాన్ని ఆఫ‌ర్ చేస్తుంది.

ఎస్‌బీఐ పండుగ ఆఫ‌ర్‌

దేశ‌పు అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పండుగ సీజ‌న్‌కు ముందుగానే రీటైల్ క‌స్ట‌మ‌ర్ల‌కు వివిధ రుణాల‌పై ప్ర‌త్యేక ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టించింది. ఆటో/ కారు రుణాలు, విద్యా రుణం, వ్య‌క్తిగ‌త రుణం, గృహ రుణం ఇలా వివిధ రుణాల‌పై ఈ ఆఫ‌ర్లు అందుబాటులో ఉండ‌నున్నాయి.

కారు రుణం:
కారు రుణాల‌పై ప్రాసెసింగ్ ఫీజుల‌ను ర‌ద్దు చేసింది. అంతేకాకుండా కారు కొనుగోలు నిమిత్తం రుణం తీసుకునే వారికి అద‌నంగా వ‌డ్డీ రేటును త‌గ్గించింది. కారు రుణ ప్రారంభ వ‌డ్డీ రేటు 8.70 శాతంగా ఉండ‌నుంది. కారు రుణం తీసుకునే వారికి ఎస్‌బీఐ అత్య‌ల్ప వ‌డ్డీ రేటుతో రుణం అందిస్తుందని, వ‌డ్డీలో పెరుగుద‌ల ఉండ‌ద‌ని బ్యాంక్ తెలిపింది. ఎస్‌బీఐ డిజిట‌ల్ ప్లాట్‌ఫామ్ అయిన యోనోయాప్ ద్వారా గానీ వెబ్‌సైట్ ద్వారా గానీ రుణం కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న వారికి 25 బేసిస్ పాయింట్ల మేర వ‌డ్డీ రాయితీ అందిస్తుంది. దీనికి తోడు ఉద్యోగులు కారు ఆన్‌-రోడ్ ధ‌ర‌పై 90 శాతం వ‌ర‌కు రుణం పొంద‌వ‌చ్చు.

వ్య‌క్తిగ‌త రుణం:
వ్య‌క్తిగ‌త రుణం కోసం ద‌ర‌ఖాస్తు చేసుకునే ఖాతాదారుల‌కు, ఎస్‌బీఐ 6 సంవ‌త్స‌రాల కాల‌ప‌రిమితితో,10.75 శాతం వ‌డ్డీతో, రూ.20 ల‌క్ష‌ల వ‌ర‌కు రుణం అందిస్తుంది. అంతే కాకుండా ఎస్‌బీఐలో శాల‌రీ ఖాతా ఉన్న ఉద్యోగులకు యోనో ప్లాట్ ఫామ్ ద్వారా రూ. 5 ల‌క్ష‌ల వ‌ర‌కు ప్రీ-అప్రూవుడ్ రుణాల‌ను ఇస్తుంది.

విద్యారుణం:
ఎస్‌బీఐ విద్యారుణాన్ని కూడా అందిస్తుంది. 8.25 శాతం ప్రారంభ వ‌డ్డీతో, 15 సంవత్స‌రాల కాల‌ప‌రితితో భార‌త‌దేశంలో చ‌దువుకునే విద్యార్ధుల‌కు రూ.50 ల‌క్ష‌లు, విదేశాల‌లో చ‌దువుకునే విద్యార్థుల‌కు రూ.1.50కోట్లు వ‌ర‌కు రుణాల‌ను అందిస్తుంది.

గృహ‌రుణం:
ఇటీవ‌లే ఎస్‌బీఐ 15 బేసిస్ పాయింట్ల మేర ఎమ్‌సీఎల్ఆర్‌ను త‌గ్గించింది. దీంతో క‌లిపి ఏప్రిల్ 2019 నుంచి మొత్తంగా 35 బేసిస్ పాయింట్ల మేర కొత్త గృహ రుణాల‌పై వ‌డ్డీ రేట్ల‌ను త‌గ్గించింది. రెపో రేటు అనుసందానిత గృహ రుణాన్ని 8.05 శాతం వ‌డ్డీ రేటుతో త‌క్కువ వ‌డ్డీకే గృహ రుణాన్ని ఎస్‌బీఐ ఆఫ‌ర్ చేస్తుంది. ఈ వ‌డ్డీ రేట్లు సెప్టెంబ‌ర్ 1వ‌తేదీ నుంచి ఇప్ప‌టికే ఉన్న రుణాల‌తో పాటు కొత్త రుణాలకు వ‌ర్తిస్తుంది.

ఆటో మొబైల్ డీల‌ర్లు:
వాహ‌న అమ్మ‌కాలు మంద‌గించ‌డంతో చాలా మంది ఆటో మొబైల్ డీల‌ర్లు షెడ్యూలు ప్ర‌కారం రుణాలు చెల్లించ‌లేక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. తీవ్ర ఒత్తిడికి లోన‌వుతున్న ఆటో మొబైల్ డీల‌ర్లు తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించేందుకు 15 నుంచి 30 రోజుల వ‌ర‌కు గ‌డువు పెంచుతూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణ‌యం తీసుకుంది. గ‌త 19 సంవ‌త్స‌రాల‌లో ఎన్న‌డూ లేనంత క‌నిష్ట ప‌ద‌ర్శ‌న‌ను భార‌త పాసెంజ‌ర్ వాహ‌న ఇండ‌స్ట్రీ న‌మోదు చేసింది. జులై 31 శాతం అమ్మ‌కాలు ప‌డిపోయాయి. ఎస్‌బీఐ ఆటోమొబైల్ డీల‌ర్ల‌కు రూ.11,500 కోట్ల రుణాల‌ను అందించింది. సాధార‌ణంగా రుణాలు తిరిగి చెల్లించేందుకు 60 రోజుల గ‌డువు ఉంటుంది. ఇప్పుడు ఈ ప‌రిమితిని కొంత మంది డీల‌ర్ల‌కు 75 రోజులు, మ‌రికొంత మంది డీల‌ర్ల‌కు 90 రోజుల వ‌ర‌కు పొడిగించిన‌ట్లు ఎస్‌బీ మేనేజింగ్ డైరెక్ట‌ర్ పీకే గుప్తా తెలిపారు.

సిరి లో ఇంకా

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

source: livemint

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly