లాక‌ర్ ఛార్జీల‌ను పెంచిన ఎస్‌బీఐ

పెరిగిన ఛార్జీలు మార్చి 31 నుంచి అందుబాటులోకి రానున్నాయి

లాక‌ర్ ఛార్జీల‌ను పెంచిన ఎస్‌బీఐ

దేశ అతిపెద్ద బ్యాంకు ఎస్‌బీఐ లాకర్ డిపాజిట్ల‌కు క‌నీస ఛార్జీ రూ.500 నుంచి రూ.2000 వ‌ర‌కు పెంచంది. ఎక్స్‌ట్రా లార్జ్ లాక‌ర్ వార్షిక ఛార్జి రూ.9000 నుంచి 12000 కి పెంచింది. పెరిగిన ఛార్జీలు మార్చి 31 నుంచి అందుబాటులోకి రానున్నాయి. మీడియం సైజ్ లాక‌ర్ ఛార్జీలు రూ.1000 నుంచి రూ.4000 వ‌ర‌కు ఉంటాయి. లార్జ్ లాక‌ర్ల అద్దె రూ.2000 నుంచి రూ.8000 వ‌ర‌కు వ‌సూలు చేయ‌నుంది. ఈ ఛార్జీలు మెట్రో న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల‌లో వ‌ర్తిస్తాయి. జీఎస్‌టీ ఛార్జీలు అద‌నం.

ఎస్‌బీఐ శాఖ‌లు త‌క్కువ ఛార్జీల‌తో చిన్న ప‌ట్ట‌ణాలు, గ్రామాల్లో లాక‌ర్ స‌ర్వీసుల‌ను అందిస్తున్నాయి. ఇక్క‌డ లాక‌ర్ అద్దెలు రూ.1500 నుంచి రూ.9000 వ‌ర‌కు ఉంటాయి. అన్ని ఎస్‌బీఐ శాఖ‌ల్లో 33 శాతం రేట్లు పెరిగాయి.

ఎస్‌బీఐ వ‌న్‌-టైమ్ రిజిస్ర్టేష‌న్ కోసం మీడియం లాక‌ర్ల‌కు రూ.500 తో పాటు జీఎస్‌టీ చెల్లించాల్సి ఉంటుంది . లార్జ్‌, ఎక్స్‌ట్రా లార్జ్ లాక‌ర్ల‌కు రూ.1000 తో పాటు అద‌నంగా జీఎస్‌టీ ప‌డుతుంది. లాక‌ర్ ఛార్జీలు చెల్లించ‌క‌పోతే 40 శాతం జ‌రిమానా వ‌ర్తిస్తుంది.

ఆర్‌బీఐ నిబంధ‌న‌ల ప్ర‌కారం, వినియోగ‌దారులు లాక‌ర్‌ను ఏడాదికి ఒక‌సారి ఆప‌రేట్ చేయ‌క‌పోతే బ్యాంకులు చేసే వీలుంది. అయితే ఓపెన్ చేసేముందు తెర‌వాలా లేదా అన్న విష‌యాన్ని అడిగేందుకు వినియోగారుల‌కు నోటీసులు పంపుతారు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly