కార్డు లేకుండానే క్యాష్

ఏటీఎం ద్వారా కార్డు ర‌హిత న‌గ‌దు విత్‌డ్రా చేసుకునే విధంగా 'యోనో క్యాష్ పాయింట్స్’ ను ఎస్‌బీఐ డిజైన్ చేసింది.

కార్డు లేకుండానే క్యాష్

మీరు ఎస్‌బీఐ ఖాతాదారులా? అయితే ఇక‌పై కార్డు లేకుండానే క్యాష్ విత్‌డ్రా చేసుకోండి.భార‌త అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) తమ డిజిటల్‌ బ్యాంకింగ్‌ ఫ్లాట్‌ఫామ్‌ యోనోపై ‘యోనో క్యాష్‌’ను ప్రవేశపెట్టింది. ఈ విధానం ద్వారా ఖాతాదారులు ఇక‌పై కార్డు ఉప‌యోగించకుండానే ఏటీఎమ్ నుంచి న‌గ‌దు విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. యోనో క్యాష్‌తో దేశవ్యాప్తంగా ఉన్న 16,500కు పైగా ఎస్‌బీఐ ఏటీఎంల్లో కార్డు లేకుండానే నగదు ఉపసంహరణ చేయొచ్చని బ్యాంక్‌ తెలిపింది. డిబిట్ కార్డుల‌ను ఉప‌యోగించి ఏటీఎమ్ వ‌ద్ద న‌గ‌దు ఉప‌సంహ‌ర‌ణ‌లు చేస్తున్న‌ప్పుడు జ‌రిగే మోసాల‌ను నివారించేందుకు ఈ ప‌ద్ధ‌తి స‌హాయ‌ప‌డుతుంద‌ని, డెబిట్ కార్డు లేకుండా న‌గ‌దు విత్‌డ్రాకు స‌హాయ‌ప‌డేవిధంగా యోనో ఫీచ‌ర్‌ను అభివృద్ది చేశార‌ని ఎస్‌బీఐ చైర్మెన్ ర‌జ్నీస్ కుమార్ తెలిపారు. దీనిద్వారా ఖాతాదారులు మ‌రింత సౌక‌ర్య‌వంత‌మైన, మెరుగైన బ్యాంకింగ్ అనుభ‌వాన్ని పొందుతార‌ని ర‌జ్నీస్ తెలిపారు. యోనో ను ఉప‌యోగించి చేసే లావాదేవీలు 2-ఫ్యాక్ట‌ర్ అథెంటికేషన్‌తో సుర‌క్షితం చేసుకోవ‌చ్చిని, స్కిమ్మింగ్, క్లోనింగ్ వంటి మోసాలను తగ్గించొచ్చని ఎస్‌బీఐ భావిస్తోంది.

ఎలా ప‌నిచేస్తుంది?

యోనో యాప్‌పై ఎస్‌బీఐ ఖాతాదారులు కార్డురహిత నగదు ఉపసంహరణకు విజ్ఞప్తి చేయాల్సి ఉంటుంది. అనంతరం లావాదేవీ పూర్తి చేయడానికి ఆరు అంకెల యోన్‌ క్యాష్‌ పిన్‌ పెట్టుకోవాలి. లావాదావీ పూర్తి చేయడానికి వినియోగదారుడి మొబైల్‌కు ఆరు అంకెల రిఫరెన్స్‌ సంఖ్య ఎస్‌ఎంఎస్‌ ద్వారా వస్తుంది. పిన్‌, రిఫరెన్స్‌ సంఖ్య వచ్చిన 30 నిమిషాల్లోగా నగదు ఉపసంహరణ పూర్తి చేయాల్సి ఉంటుంది.

ఈ కార్డు ర‌హిత న‌గ‌దు విత్‌డ్రా చేసుకునే సర్వీసు అందిస్తున్న ఏటీఎంలకు ‘యోనో క్యాష్ పాయింట్స్’ అని నామకరణం చేసింది. దేశంలోనే ఇటువంటి సేవలను ప్రారంభించిన తొలి బ్యాంక్‌ తమదేనని వెల్లడించింది.

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly